బడ్జెట్ అదే.. పవర్ వేరే.. కేవలం రూ. 3వేలే తేడా.. పల్సర్ 180cc vs అపాచీ 180ccలో ఏది బెస్ట్

భారతీయ రోడ్ల మీద పల్సర్, అపాచీ బైకుల మధ్య పోటీ అంటే అది కేవలం రెండు బైకుల మధ్య వార్ కాదు.. రెండు వేర్వేరు ఫ్యాన్ బేస్ ల మధ్య జరిగే యుద్ధం. 2022లో ఆగిపోయిన పల్సర్ 180 మళ్ళీ కొత్త అవతారంలో మార్కెట్లోకి రావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. దాదాపు రూ.1.25 లక్షల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ బైక్ కొనాలనుకునే కుర్రాళ్లకు ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ బైక్ కొంటే పైసా వసూల్? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.

ఇంజన్, పర్ఫార్మెన్స్
ఈ రెండు బైకుల ఇంజన్ సామర్థ్యం దాదాపు సమానంగా ఉన్నా, పర్ఫామెన్సులో కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. పల్సర్ 180లో 178.6cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది, ఇది 17 hp పవర్, 15 Nm టార్క్‌ని ఇస్తుంది. అదే అపాచీ RTR 180 విషయానికి వస్తే, ఇందులో 177.4cc ఇంజన్ ఉన్నప్పటికీ, ఇది ఆయిల్-కూల్డ్ టెక్నాలజీతో వస్తుంది. దీనివల్ల లాంగ్ రైడ్స్ చేసినప్పుడు ఇంజన్ త్వరగా వేడెక్కకుండా స్థిరంగా ఉంటుంది. అపాచీలో పవర్ 17.13 hp ఉండగా, టార్క్ 15.5 Nm గా ఉంది. అంటే పర్ఫార్మెన్స్ పరంగా అపాచీ స్వల్పంగా ముందుంది.

Pulsar 180 vs Apache RTR 180 Best Value 180cc Bike Under Rs 1 3 Lakh Compared

బరువులో తేడా.. హ్యాండ్లింగ్‌లో మజా
ఈ కంపారిజన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం బరువు. కొత్త పల్సర్ 180 బరువు 156 కిలోలు కాగా, అపాచీ కేవలం 140 కిలోలు మాత్రమే ఉంది. అంటే అపాచీ కంటే పల్సర్ ఏకంగా 16 కిలోల బరువు ఎక్కువ. ట్రాఫిక్‌లో బైక్‌ను వేగంగా మలుపులు తిప్పాలన్నా, సిటీలో రైడ్ చేయాలన్నా బరువు తక్కువగా ఉన్న అపాచీ చాలా సులభంగా ఉంటుంది. పవర్-టు-వెయిట్ రేషియో పరంగా కూడా అపాచీ అగ్రస్థానంలో నిలుస్తుంది.

టెక్నాలజీ, ఫీచర్లు
ఫీచర్ల విషయంలో అపాచీ తన ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసింది. అపాచీ RTR 180లో స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. వర్షం పడినప్పుడు లేదా సిటీలో వెళ్తున్నప్పుడు ఇంజన్ పవర్ డెలివరీని ఇవి మారుస్తాయి. అంతేకాకుండా, దీనిలో గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) ఉంది, దీనివల్ల ట్రాఫిక్‌లో గేర్ మార్చకుండానే బైక్ స్లోగా మూవ్ అవుతుంది. పల్సర్‌లో ఫుల్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నప్పటికీ, అపాచీలో ఉన్న స్మార్ట్‌కనెక్ట్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభిస్తాయి.

Pulsar 180 vs Apache RTR 180 Best Value 180cc Bike Under Rs 1 3 Lakh Compared

సేఫ్టీ, బ్రేకింగ్
సేఫ్టీ విషయానికి వస్తే, అపాచీ RTR 180 డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. అంటే ముందు, వెనుక రెండు చక్రాలకు బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా ఏబీఎస్ రక్షణ ఉంటుంది. పల్సర్ 180లో మాత్రం కేవలం సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉంది. నేటి రోజుల్లో సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి అపాచీనే సరైన ఎంపిక. రెండు బైకుల్లోనూ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి.

ధర, ముగింపు
బజాజ్ పల్సర్ 180 ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, అపాచీ ధర రూ.1.26 లక్షలుగా ఉంది. అంటే కేవలం రూ.3,100 మాత్రమే తేడా. ఈ కొద్దిపాటి ధర తేడాతో మీకు రైడింగ్ మోడ్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఆయిల్ కూలింగ్, తక్కువ బరువు వంటి అద్భుతమైన ఫీచర్లు అపాచీలో దొరుకుతున్నాయి. ఒకవేళ మీరు బజాజ్ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం, ఆ భారీ లుక్, తక్కువ ధర కోరుకుంటే పల్సర్ తీసుకోవచ్చు. కానీ టెక్నాలజీ, సేఫ్టీ, మెరుగైన హ్యాండ్లింగ్ కావాలనుకునే వారికి అపాచీ RTR 180 బెస్ట్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Tuesday, April 14, 2026, 12:33 [IST]
English summary
Pulsar 180 vs apache rtr 180 best value 180cc bike under rs 1 3 lakh compared
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+