పెరిగిన పెట్రోల్ రేట్లకు చెక్ పెట్టేస్తున్నాయ్! ఇప్పుడు దేశమంతా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకే డిమాండ్!
భారతదేశంలో ఇటీవల పెట్రోల్ ధరలు భారీగా పెరగడం సామాన్య ప్రజల జేబుపై నేరుగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, డెలివరీ పనులు చేసే యువత, చిన్న చిన్న అవసరాల కోసం టూవీలర్లపై ఆధారపడే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఇంధన ఖర్చులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు నెలకు సరిపడే పెట్రోల్ ఖర్చు ఇప్పుడు ఊహించని స్థాయికి చేరుకోవడంతో చాలామంది ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు కొత్త ఆశలా కనిపిస్తున్నాయి. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఖర్చును గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఈవీ స్కూటర్లను చూద్దాం.
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది కూడా ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, కాలేజ్ విద్యార్థులు, రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది. ధర విషయానికి వస్తే, TVS iQube ప్రారంభ వేరియంట్ ధర ఛార్జర్‌తో కలిపి సుమారు రూ.96,422 వద్ద ప్రారంభమవుతుంది. ఇక టాప్ వేరియంట్ ధర రూ.1.63 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు వెళుతుంది.

ఈ స్కూటర్‌ను 2.2 kWh, 3.5 kWh, 5.3 kWh బ్యాటరీ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. రోజువారీ చిన్న ప్రయాణాలు మాత్రమే చేసే వారికి చిన్న బ్యాటరీ వేరియంట్ సరిపోతే, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి పెద్ద బ్యాటరీ వేరియంట్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే TVS iQube సుమారు 94 కి.మీ నుంచి గరిష్టంగా 212 కి.మీ వరకు ప్రయాణించగలదు.
Bajaj Chetak C2501: ప్రీమియం డిజైన్‌తో పాటు నమ్మకమైన పనితీరును కోరుకునే వారికి బజాజ్ చేతక్ C2501 మంచి ఎంపిక. సుమారు రూ.1 లక్ష ధర పరిధిలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, క్లాసిక్ లుక్‌ను ఆధునిక టెక్నాలజీతో మిళితం చేస్తూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా మెటల్ బాడీ ఫినిష్, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా సాధారణ ఈవీ స్కూటర్లతో పోలిస్తే మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.

పనితీరు విషయానికి వస్తే, చేతక్ C2501లో 4.2 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. రోజువారీ నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ స్కూటర్ స్మూత్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే IDC క్లెయిమ్ ప్రకారం సుమారు 113 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీంతో ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు, ఎక్కువగా తిరిగేవారికి ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది.
Vida VX2 Go: ధర విషయానికి వస్తే, విడా వీఎక్స్2 గో ధర సుమారు రూ.99,490 వద్ద ఉంది. ఇందులోని 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ సుమారు 92 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదని కంపెనీ వెల్లడిస్తోంది. దీంతో రోజూ ఆఫీస్, కాలేజ్ లేదా నగరంలో సాధారణ ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ స్కూటర్ ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ఇందులో 6 కిలోవాట్ల శక్తి గల ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ మోటార్ సహాయంతో స్కూటర్ కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీంతో ట్రాఫిక్‌లో వేగంగా కదలడానికి, స్మూత్ రైడింగ్ అనుభూతిని పొందడానికి ఇది సహాయపడుతుంది. స్టైలిష్ డిజైన్, మంచి రేంజ్, వేగవంతమైన పనితీరు కోరుకునే వారికి ఇది బెస్ట్.


Click it and Unblock the Notifications