కొత్తగా ముస్తాబై వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపులన్నీ మీవైపే!
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారత మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును కలిగిన గోవాన్ క్లాసిక్ 350ను 2026 మోడల్ సంవత్సరానికి స్వల్పంగా నవీకరించి విడుదల చేసింది. ఈ బైక్‌కి భారీ మార్పులు కాకపోయినా, రోజువారీ రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే చిన్న కానీ కీలకమైన అప్‌డేట్స్‌ను కంపెనీ అందించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కొత్త వెర్షన్‌కు ధర పరంగా పెద్ద మార్పులు చేయకుండా, ఇప్పటికే ఉన్న ధర స్థాయిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కొనసాగింది. ధరల విషయానికి వస్తే, 2026 గోవాన్ క్లాసిక్ 350 సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లైన షాక్ బ్లాక్, పర్పుల్ హేజ్ రంగుల్లో రూ. 2,19,787(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లైన ట్రిప్ టీల్ గ్రీన్, రేవ్ రెడ్ కోసం రూ. 2,22,593(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ నాలుగు రంగులు ఇప్పటికే గత మోడల్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే 2026 మోడల్ సంవత్సరానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాంటి కొత్త కలర్ ఆప్షన్లను జోడించలేదు. డిజైన్ పరంగా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన రంగులనే కొనసాగించడం ద్వారా, బ్రాండ్ తన క్లాసిక్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే, అసలు మెరుగుదలలు బైక్ మెకానికల్ అంశాల్లో కనిపిస్తాయి.

2026 గోవాన్ క్లాసిక్ 350కి అత్యంత ముఖ్యమైన అప్‌డేట్‌గా కొత్త స్లిప్, అసిస్ట్ క్లచ్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ వలన గేర్ మార్పులు మరింత సాఫీగా జరుగుతాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో లేదా లాంగ్ రైడ్స్ సమయంలో రైడర్ చేతిపై వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు, బైక్ అకస్మాత్తుగా వేగం తగ్గినప్పుడు లేదా డౌన్‌షిఫ్ట్ సమయంలో వెనుక చక్రం లాక్ అవ్వకుండా ఈ సిస్టమ్ సహాయపడుతుంది.
ఇంకొక ఉపయోగకరమైన అప్‌డేట్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌కు సంబంధించినది. ఇప్పటికే గోవాన్ క్లాసిక్ 350లో USB టైప్-C పోర్ట్ ఉన్నప్పటికీ, 2026 వెర్షన్‌లో దీన్ని హై-స్పీడ్ ఛార్జింగ్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు, నావిగేషన్ డివైజ్‌లు రైడింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ఈ మార్పు రోజువారీ వినియోగంలో చాలా ఉపయోగకరంగా మారనుంది. దూర ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ గురించి ఆందోళన లేకుండా ప్రయాణించేందుకు ఇది సహాయపడుతుంది.

డిజైన్ విషయానికి వస్తే, గోవాన్ క్లాసిక్ 350ను చూసిన వెంటనే అది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని చెప్పేయొచ్చు. దీని ప్రత్యేకమైన బాబర్-స్టైల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తాయి. రోడ్డు మీద ఈ బైక్ వెళ్తుంటే చూపులు తిప్పుకోకుండా ఉండటం కష్టం అనే చెప్పాలి. క్లాసిక్ లుక్‌ను ఇష్టపడే యువతతో పాటు, యూనిక్ డిజైన్ కోరుకునే రైడర్లకు ఇది ఇప్పటికీ ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌లా నిలుస్తుంది.
సొగసైన ఆకారంలో రూపొందించిన ఫెండర్లు, స్టైలిష్ స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు ఈ బైక్‌కు మరింత ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తున్నాయి. ఇవి గోవాన్ క్లాసిక్ 350 బాబర్-స్టైల్ డిజైన్‌ను మరింత హైలైట్ చేస్తూ, రోడ్డుపై దీన్ని వెంటనే గుర్తుపట్టేలా చేస్తాయి. లుక్ పరంగా మాత్రమే కాకుండా, ఇంజినీరింగ్ పరంగానూ ఈ మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల అంచనాలను అందుకుంటోంది.

2026 గోవాన్ క్లాసిక్ 350లో ఇప్పటికే నమ్మకాన్ని సంపాదించుకున్న 349cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద గరిష్టంగా 20.2 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. అలాగే 4,000 rpm వద్ద 27 Nm గరిష్ట టార్క్‌ను అందించడం వల్ల, నగర రైడింగ్‌తో పాటు హైవే ప్రయాణాల్లో కూడా మంచి పుల్, స్మూత్ పవర్ డెలివరీ లభిస్తుంది.
2026 మోడల్ సంవత్సరానికి ఇంజిన్ స్పెసిఫికేషన్లు లేదా కొలతలలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే వినియోగదారులు మెచ్చుకున్న అదే ఇంజిన్ సెటప్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనసాగించింది. ఇంజిన్‌కు తోడుగా 5-స్పీడ్ గేర్‌బాక్స్ పనిచేస్తుంది, ఇది గేర్ మార్పులను సాఫీగా చేస్తూ లాంగ్ రైడ్స్‌లో కూడా రైడర్‌కు సౌకర్యాన్ని కల్పిస్తుంది. మొత్తంగా పనితీరు, రైడింగ్ కంఫర్ట్ అన్నింటిలోనూ సమతుల్యతను కలిగిన బైక్‌గా 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








