బైక్ మార్కెట్లో బబ్బర్ షేర్! ఎన్ని కొత్త బైకులు వచ్చినా ఇదే రారాజు, బుల్లెట్ సౌండ్‌కు షేక్ అవ్వాల్సిందే!

భారతీయ రోడ్లపై కొన్ని వాహనాలకు కేవలం మార్కెట్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం కూడా ఉంటుంది. అలాంటి అరుదైన మోటార్‌సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) ఒకటి. కాలం మారింది, టెక్నాలజీ మారింది, మార్కెట్లో ఎన్నో ఆధునిక ఫీచర్లతో కొత్త బైకులు వచ్చాయి. LED లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లేలు, అలాయ్ వీల్స్, స్పోర్టీ డిజైన్లు వంటి ఎన్నో ఫీచర్లు ఇప్పుడు సాధారణమయ్యాయి. అయినప్పటికీ, వీటిలో ఏవి పెద్దగా లేకపోయినా బుల్లెట్ 350 మాత్రం ఇప్పటికీ భారతీయుల మనసుల్లో తన ప్రత్యేక స్థానాన్ని అలాగే నిలుపుకుంది. దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కేవలం ఒక బైక్‌గా మాత్రమే కాకుండా, ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా, రాయల్ రైడింగ్ అనుభూతికి ప్రతీకగా నిలుస్తోంది.

గ్రామీణ రోడ్ల నుంచి నగర వీధుల వరకు, యువత నుంచి మధ్యవయస్కుల వరకు ఈ బైక్‌కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా దీని క్లాసిక్ డిజైన్, భారీ బాడీ, ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్, రోడ్డు మీద ఇచ్చే ప్రెజెన్స్ కారణంగా బుల్లెట్‌కు ఇప్పటికీ భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా విడుదలైన 2026 ఏప్రిల్ అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.

Royal Enfield Bullet 350 Registers 52 Percent Sales Growth In April 2026

రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 25,040 బుల్లెట్ 350 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో, అంటే 2025 ఏప్రిల్‌లో ఈ మోడల్ అమ్మకాలు 16,489 యూనిట్లుగా మాత్రమే ఉండగా, ఈసారి భారీగా పెరగడం విశేషం. ఈ లెక్కల ప్రకారం కంపెనీ ఒక్క ఏడాదిలోనే అదనంగా 8,551 బుల్లెట్ 350 బైకులను ఎక్కువగా విక్రయించింది. శాతం పరంగా చూస్తే, ఇది ఏకంగా 52 శాతం వృద్ధి.

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో కొత్త తరహా బైకులు, స్పోర్ట్స్ మోడళ్లు, ఫీచర్-లోడెడ్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, బుల్లెట్ 350 తన సొంత శైలితోనే మార్కెట్లో రాజులా దూసుకుపోతుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా యువతలో ఇప్పుడు రెట్రో-క్లాసిక్ బైకులపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ఆ ట్రెండ్‌ను బుల్లెట్ 350 బాగా ఉపయోగించుకుంటోంది. అదేవిధంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు ఉన్న వారసత్వం,కూడా ఈ మోటార్‌సైకిల్ అమ్మకాలను మరింత పెంచుతున్నాయి.

Royal Enfield Bullet 350 Registers 52 Percent Sales Growth In April 2026

Royal Enfield Bullet 350 బైక్ ధర భారత మార్కెట్లో వేరియంట్‌ను బట్టి సుమారు రూ. 1.64 లక్షల నుంచి రూ. 2.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఆన్‌రోడ్ ధరలు మాత్రం నగరాన్ని బట్టి కొంత మారుతాయి. అయినప్పటికీ, ఈ ధర రేంజ్‌లో బుల్లెట్ 350 అందించే రాయల్ ఫీల్, బలమైన రోడ్డు ప్రెజెన్స్, క్లాసిక్ డిజైన్ కారణంగా చాలా మంది ఇప్పటికీ దీనినే ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు.

పనితీరు విషయానికి వస్తే, బుల్లెట్ 350లో కొత్త జె-సిరీస్ 350cc సింగిల్ సిలిండర్ SOHC ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ స్మూత్ పవర్ డెలివరీతో పాటు లాంగ్ రైడ్స్‌లో మంచి కంఫర్ట్‌ను అందించేలా ట్యూన్ చేయబడింది. నగర రోడ్లలో సులభంగా నడిపించగలిగే ఈ బైక్, హైవేలపై కూడా స్టేబుల్‌గా దూసుకుపోతుంది. ముఖ్యంగా దీని ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్, భారీ బాడీ రైడర్లకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి.

Royal Enfield Bullet 350 Registers 52 Percent Sales Growth In April 2026

మైలేజీ విషయంలో కూడా బుల్లెట్ 350 నిరాశపరచదు. కంపెనీ ప్రకారం, అనుకూల పరిస్థితుల్లో ఈ బైక్ లీటరుకు సుమారు 36.2 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. 350cc సెగ్మెంట్‌లో ఇది మంచి ఫిగర్‌గా చెప్పొచ్చు. ఇక దీని 13 లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ కారణంగా లాంగ్ డ్రైవ్‌లకు మరింత అనువుగా మారుతుంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 470 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది.

Article Published On: Thursday, May 21, 2026, 16:31 [IST]
English summary
Royal enfield bullet 350 registers 52 percent sales growth in april 2026
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+