రోడ్ల మీద ఎటు చూసినా డుగ్ డుగ్ సౌండ్లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ ఒక్కటే 37 వేలు అమ్ముడైందట

భారత ఆటోమొబైల్ మార్కెట్లో పవర్‌ఫుల్ బైక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే 350cc నుంచి 450cc సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మరోసారి తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇటీవల విడుదలైన బైక్స్ విక్రయాల గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో ఈ పవర్‌ఫుల్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ తిరుగులేని సునామీ సృష్టించింది.

గత నెల అమ్మకాల్లో టాప్-10 స్థానాలను పరిశీలిస్తే ఏకంగా 6 మోడళ్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందినవే కావడం విశేషం. మరీ ముఖ్యంగా టాప్-4 స్థానాలను వేరే ఏ బ్రాండ్‌కూ దక్కకుండా ఈ సంస్థే క్లీన్ స్వీప్ చేసింది. యువత కలల బైక్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఈ లిస్టులో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా.. బుల్లెట్, హంటర్ మోడళ్లు టాప్-3 లో నిలిచి తోటి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాయి.

royal enfield classic 350 tops sales charts april 2026 bullet hunter ktm harley davidson telugu

ఈ విక్రయాల జోరులో ఎప్పటిలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మొదటి స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏప్రిల్ 2026 నెలలో ఈ బైక్ ఏకంగా 37,967 యూనిట్ల అద్భుతమైన విక్రయాలను నమోదు చేసింది. అంతకుముందు ఏడాది అంటే ఏప్రిల్ 2025 లో దీని విక్రయాలు కేవలం 26,801 యూనిట్లుగా మాత్రమే ఉండేవి. అంటే ఏడాది కాలంలోనే ఈ బైక్ ఏకంగా 11,166 యూనిట్లను అదనంగా విక్రయించి.. ఏడాది ప్రాతిపదికన (YoY) 41.66 శాతం భారీ వృద్ధిని సాధించింది.

ఈ సెగ్మెంట్‌లో మొత్తం మార్కెట్ వాటాలో సింహభాగం అంటే 31.92 శాతం వాటాను కేవలం క్లాసిక్ 350 మోడల్ ఒక్కటే దక్కించుకోవడం దీని క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఈ రేసులో క్లాసిక్ 350 తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, హంటర్ 350 మోడళ్లు వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. సాంప్రదాయ లుక్‌తో ఆకట్టుకునే బుల్లెట్ 350 మోడల్ ఏప్రిల్ 2026 లో 25,040 యూనిట్ల అమ్మకాలతో దుమ్మురేపింది.

royal enfield classic 350 tops sales charts april 2026 bullet hunter ktm harley davidson telugu

గత ఏడాది ఇదే నెలలో జరిగిన 16,489 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే ఇది 8,551 యూనిట్లు ఎక్కువగా అమ్ముడై.. ఏకంగా 51.86 శాతం అద్భుతమైన గ్రోత్ రేటును సొంతం చేసుకుంది. దీని మార్కెట్ వాటా 21.04 శాతంగా నమోదైంది. అలాగే యువతను అమితంగా ఆకట్టుకుంటున్న స్టైలిష్ హంటర్ 350 మోడల్ గత నెలలో 21,947 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానాన్ని భద్రపరుచుకుంది. గత ఏడాది నమోదైన 18,109 యూనిట్ల కంటే ఇది 3,838 బైకులను ఎక్కువగా విక్రయించి 21.19 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ లిస్టులో నాలుగో స్థానాన్ని కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఖాతాలోనే వేసుకుంది. కంపెనీకి చెందిన క్రూయిజర్ మోడల్ 'మీటియోర్ 350' గత నెలలో 10,060 యూనిట్ల విక్రయాలను సాధించి టాప్-4 లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన 7,644 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 2,416 బైకులను అదనంగా విక్రయించి 31.61 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

royal enfield classic 350 tops sales charts april 2026 bullet hunter ktm harley davidson telugu
దీని తర్వాత ఐదో స్థానంలో జావా, యెజ్డీ, బిఎస్ఏ (Jawa Yezdi BSA) కాంబినేషన్ రిటైల్ మార్కెట్లో 4,520 యూనిట్లను అమ్ముకుని కొద్దిగా పోటీని ఇచ్చే ప్రయత్నం చేసింది. గత ఏడాది జరిగిన 2,477 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 82.48 శాతం మెరుగైన వృద్ధిని కనబరిచాయి.

ఆరో స్థానంలో జపాన్ దిగ్గజం హోండాకు చెందిన హోండా CB 350 బైక్ 3,975 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. గత ఏడాది కేవలం 1,863 యూనిట్లు మాత్రమే అమ్ముడైన ఈ బైక్.. ఏకంగా 113.37 శాతం అద్భుతమైన గ్రోత్ సాధించడం విశేషం. దీని తర్వాత సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన ట్రయంఫ్ 350' బైక్ 3,965 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇక ఎనిమిదో స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గొరిల్లా (Guerrilla) మోడల్ 2,474 యూనిట్ల అమ్మకాలతో రచ్చ చేసింది. గత ఏడాది కేవలం 920 యూనిట్లు అమ్ముడైన ఈ బైక్ ఈసారి ఏకంగా 168.91 శాతం భారీ వృద్ధిని చూసింది. తొమ్మిదో స్థానంలో హోండా హైనెస్ 350 (H'Ness 350) మోడల్ 2,105 యూనిట్లను విక్రయించి 129.55 శాతం గ్రోత్ సాధించగా.. పదో స్థానంలో ఆఫ్‌రోడింగ్ మొనగాడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలియన్ 1,941 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది.

టాప్-10 అవతల ఉన్న మిగతా బ్రాండ్ల పరిస్థితి చూస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ దెబ్బకు అవి చాలా వెనుకబడిపోయాయి. లగ్జరీ క్రూయిజర్ అయిన 'హార్లే డేవిడ్సన్ X440' (Harley Davidson X440) గత నెలలో కేవలం 1,505 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది. గత ఏడాది 657 యూనిట్లు అమ్ముడైన ఈ బైక్ 129.07 శాతం వృద్ధిని చూసినప్పటికీ ఎన్‌ఫీల్డ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.

ఇక బజాజ్ పల్సర్ 350/400 మోడళ్లు 997 యూనిట్లతో 12వ స్థానంలో, బజాజ్ డోమినార్ 350/400 మోడళ్లు 818 యూనిట్లతో 13వ స్థానంలో నిలిచాయి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు రేసింగ్ లవర్స్‌ను ఊపేసిన కేటీఆర్ (KTM) బైకుల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. KTM 350 మోడల్ కేవలం 696 యూనిట్లు విక్రయించగా.. పాపులర్ KTM 390 మోడల్ గత ఏడాది 1,466 యూనిట్లు అమ్ముడైతే ఈసారి కేవలం 633 యూనిట్లకు పడిపోయి మైనస్ 56.82 శాతం నెగటివ్ గ్రోత్‌ను నమోదు చేసింది.

చివరి స్థానాల్లో అప్రిలియా RS 457 (233 యూనిట్లు), విజయ్ 400 (110 యూనిట్లు), అప్రిలియా ట్యూనో (27 యూనిట్లు), హుస్క్‌వర్నా 401 (9 యూనిట్లు) నిలిచాయి. మొత్తం మీద ఈ సెగ్మెంట్లో ఏప్రిల్ నెలలో 1,19,022 బైకులు అమ్ముడవ్వగా ఆధిపత్యం మాత్రం రాయల్ ఎన్‌ఫీల్డ్‌దే అయింది.

Article Published On: Thursday, May 28, 2026, 7:24 [IST]
English summary
Royal enfield classic 350 tops sales charts april 2026 bullet hunter ktm harley davidson telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+