ఇది భైక్ కాదు భయ్యా.. ఒక ఎమోషన్..సామాన్యుడి బడ్జెట్లో 350 సీసీ పవర్‌ఫుల్ బైక్
రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఒకప్పుడు అది ఒక హోదా. కేవలం డబ్బులున్న వాళ్లు, రాజసం కోరుకునే వాళ్లు మాత్రమే నడిపే బైక్ అనే ముద్ర ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ బ్రాండ్ తన రూపురేఖలను మార్చుకుంది. మిడిల్ క్లాస్ యువత కలలను నిజం చేస్తూ, వారి బడ్జెట్లో ఇమిడిపోయేలా తీసుకొచ్చిన హంటర్ 350(Royal Enfield Hunter 350) ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో ఓ ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. 2025 డిసెంబర్ నెల అమ్మకాల లెక్కలు ఈ బైక్ క్రియేట్ చేసిన సంచలనాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మన రోడ్ల మీద రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వెళ్తుంటే ఆ సౌండ్‌కు, ఆ లుక్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే చాలా కాలం పాటు క్లాసిక్ 350 లేదా బుల్లెట్ 350 వంటి భారీ బైక్స్ నడపడం సాధ్యమయ్యేది కాదు. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉండడం, బైక్ ధర భారీగా ఉండడంతో యూత్ వెనకడుగు వేసే వారు.

ఈ లోటును భర్తీ చేస్తూ వచ్చిన హంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 2025 డిసెంబర్ గణాంకాల ప్రకారం.. కేవలం ఒక నెలలోనే 20654 హంటర్ బైక్స్ అమ్ముడయ్యాయి. 2024 డిసెంబర్ నెలలో ఈ సంఖ్య కేవలం 13744 మాత్రమే. అంటే ఏడాది తిరగకముందే అమ్మకాల్లో 50.28శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది.
సాధారణంగా మంచి ఫీచర్లు ఉన్న 150సీసీ లేదా 200సీసీ స్పోర్ట్స్ బైక్ కొనాలన్నా ఇప్పుడు రూ.1.50లక్షల వరకు ఖర్చు అవుతోంది. కానీ హంటర్ 350 బేస్ వేరియంట్ (ఫ్యాక్టరీ బ్లాక్) ప్రారంభ ధర కేవలం రూ.1,37,640 (ఎక్స్-షోరూమ్)కు మాత్రమే దొరుకుతుంది. ఇంత తక్కువ ధరకే 350సీసీ పవర్ఫుల్ ఇంజిన్ కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ వస్తుండటంతో కస్టమర్లు ఎగబడి మరీ కొంటున్నారు.

ఇందులోని ప్రీమియం వేరియంట్లు అయిన రీబెల్ బ్లూ, లండన్ రెడ్, టోక్యో బ్లాక్ కలర్ ఆప్షన్లు కూడా రూ.1,66,883 లోపే అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాస్ యువతకు ఇది ఓ బంగారు అవకాశంలా అనిపిస్తోంది.
హంటర్ 350 ఇంత వేగంగా క్లిక్ అవ్వడానికి ప్రధాన కారణం దాని డిజైన్. ఇది పాతకాలపు బుల్లెట్ లా కాకుండా, మోడ్రన్ రెట్రో లుక్‌తో వస్తుంది. ఈ బైక్ వెయిట్ క్లాసిక్ 350 కంటే సుమారు 14కిలోలు తక్కువగా ఉంటుంది. దీని వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సిటీ రోడ్ల మీద కూడా హ్యాండిల్ చేయడం చాలా సులభం.

ఎత్తు తక్కువ ఉన్న వారు కూడా ఈ బైకును సౌకర్యవంతంగా నడపవచ్చు. హంటర్ 350లోని 349cc J-సిరీస్ ఇంజిన్ స్మూత్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఇది లాంట్ రైడ్స్‌తో పాటు డైలీ ఆఫీసు ప్రయాణాలకు కూడా పక్కాగా సరిపోతుంది.
దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్ జాబితాలో ఎప్పుడూ హీరో స్ప్లెండర్, హోండా షైన్ వంటి కమ్యూటర్ బైక్‌లే ఉంటాయి. కానీ, డిసెంబర్ 2025 అమ్మకాల్లో హంటర్ 350 టాప్-10 జాబితాలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350, బుల్లెట్ 350 కూడా ఈ జాబితాలో ఉన్నప్పటికీ, గ్రోత్ రేటు విషయంలో హంటర్ అందరినీ అధిగమించింది.
యువతకు స్టైల్, పవర్, బ్రాండ్ వాల్యూని బడ్జెట్ ధరలో అందిస్తుండటమే హంటర్ జైత్రయాత్రకు కారణం. మీరు కూడా తక్కువ ఖర్చులో ఒక పవర్‌ఫుల్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే, హంటర్ 350 కంటే మెరుగైన ఆప్షన్ ప్రస్తుత మార్కెట్లో మరొకటి లేదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








