వచ్చిందండి వయ్యారీ.. మరింత అందంగా, సరికొత్తగా, స్పెషల్‌గా రెడీ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అభిమానులకు ఎంతో ఇష్టమైన హంటర్ 350 (Hunter 350) ఇప్పుడు 2026 అవతారంలో మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే నగర యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, కొత్త మార్పులతో మరింత స్టైలిష్‌గా, ఫీచర్ల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ ఈసారి కేవలం చిన్న అప్డేట్స్‌తో ఆగకుండా, పూర్తిగా లైనప్‌ను విస్తరించేలా కొత్త వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త హంటర్ 350లో ముఖ్యమైన ఆకర్షణ 'బేస్ ప్రీమియం' వేరియంట్. ఇది బేస్ వేరియంట్‌కు కాస్త పైస్థాయిలో ఉండేలా రూపొందించారు. పేరు వినగానే అర్థమయ్యేలా, ఈ వేరియంట్ ప్రాథమిక హంటర్ డిఎన్‌ఎను కొనసాగిస్తూ, మరికొన్ని అదనపు ఫీచర్లను అందిస్తుంది.
ముఖ్యంగా 'టార్మాక్ బ్లాక్' అనే కొత్త రంగులో ఈ బైక్ అందుబాటులో ఉండటం యువతను బాగా ఆకట్టుకునే అంశంగా మారింది. సిటీ రైడ్స్‌కి సరిపోయే మినిమలిస్టిక్ డిజైన్‌కు ఈ కొత్త కలర్ మరింత బోల్డ్ లుక్‌ను జోడిస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, హంటర్ 350 తన క్లాసిక్ రోడ్‌స్టర్ స్టైల్‌ను అలాగే కొనసాగిస్తోంది. కానీ కొత్త కలర్స్, ఫినిషింగ్ టచ్‌లు ఈ బైక్‌కు ఫ్రెష్ ఫీల్‌ను తీసుకువచ్చాయి.

చిన్నగా కనిపించినా, నగర ట్రాఫిక్‌లో సులభంగా మేనేజ్ అయ్యే కాంపాక్ట్ డైమెన్షన్స్, తేలికపాటి హ్యాండ్లింగ్ ఈ బైక్ ప్రత్యేకతగా నిలుస్తాయి. ముఖ్యంగా డైలీ కమ్యూట్ చేసే రైడర్స్‌కు ఇది మరింత అనుకూలంగా మారింది. ధర విషయానికి వస్తే, ఈ 'బేస్ ప్రీమియం' వేరియంట్‌ను రూ. 1,49,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేయడం ద్వారా కంపెనీ మంచి విలువను అందించే ప్రయత్నం చేసింది.
డిజైన్ పరంగా చూస్తే, హంటర్‌కు ప్రత్యేకమైన ఆధునిక-రెట్రో లుక్‌ను మరింత మెరుగుపరిచేలా సవరించిన గుండ్రని హాలోజన్ హెడ్‌ల్యాంప్‌ను అందించారు. ఇది కేవలం లుక్ మాత్రమే కాకుండా, రాత్రి ప్రయాణాల్లో సరిపడిన విజిబిలిటీని కూడా ఇస్తుంది. బైక్ ఇంటర్‌ఫేస్‌ను సులభంగా ఉపయోగించుకునేలా డిజి-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిపి, రోటరీ స్విచ్ గేర్‌తో కంట్రోల్స్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు. ఈ చిన్న కానీ ఉపయోగకరమైన మార్పులు రైడింగ్ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

సాధారణంగా ఎంట్రీ లెవెల్ బైక్‌లలో కనిపించే స్పోక్ రిమ్‌ల స్థానంలో, ఈ వేరియంట్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చడం ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా నిలిచింది. వీటితో పాటు ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఇవ్వడం వల్ల, పంక్చర్ వంటి చిన్న సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించుకునే వీలుంటుంది. అలాగే తరచూ మెయింటెనెన్స్ అవసరం తగ్గిపోవడం, రోజువారీ ప్రయాణానికి ఇది మరింత అనువైన ఎంపికగా మారుస్తుంది.
సౌకర్యం విషయంలో కూడా ఈ వేరియంట్ వెనుకడుగు వేయలేదు. కుట్టుతో రూపొందించిన సీటు, దీర్ఘకాల ప్రయాణాల్లో కూడా కంఫర్ట్‌ను నిలబెడుతుంది. అదనంగా స్పోర్టీ గ్రాబ్ రైల్ ఇవ్వడం వల్ల, పిలియన్ రైడర్‌కు మరింత సపోర్ట్ లభిస్తుంది. ఫినిషింగ్ టచ్‌లలో కనిపించే ఈ శ్రద్ధ, బైక్ మొత్తానికి ఒక ప్రీమియం ఫీల్‌ను తీసుకువస్తుంది. భద్రత పరంగా చూస్తే, సింగిల్-ఛానల్ ABS సిస్టమ్‌ను అందించడం ద్వారా బ్రేకింగ్ సమయంలో అదనపు నియంత్రణను కల్పించారు.

ట్రాఫిక్‌లో ఆకస్మిక బ్రేకింగ్‌లో ఇది ఉపయోగపడుతుంది. అలాగే స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ను జోడించడంతో గేర్ మార్పులు మరింత సున్నితంగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్‌లో తరచూ గేర్ మార్చాల్సిన సందర్భాల్లో రైడర్‌కు అలసట తగ్గుతుంది. ఇంజిన్ పరంగా, అదే 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. కొత్త వేరియంట్‌తో పాటు, టాప్-స్పెక్ హంటర్ 350 కోసం ముంబై ఎల్లో, మూన్‌షాట్ వైట్ అనే కలర్స్ ప్రవేశపెట్టింది. ఈ రెండింటి ధర రూ.1,69,804(ఎక్స్-షోరూమ్ చెన్నై).


Click it and Unblock the Notifications








