దేశం మొత్తం మీద 25 బైకులే.. ఇదో రేర్ పీస్ ఎన్‌ఫీల్డ్ మోడల్.. అదృష్టం ఉంటేనే మీ సొంతం
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అభిమానులకు కంపెనీ మరో అరుదైన సర్‌ప్రైజ్‌ను అందించింది. తన షాట్‌గన్ 650 మోటార్‌సైకిల్‌కు ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా పరిచయం చేసింది. సాధారణ మోడల్‌తో పోలిస్తే మరింత ప్రత్యేకమైన డిజైన్, ప్రత్యేక కలర్ థీమ్, ఎక్స్‌క్లూజివ్ ఫినిషింగ్‌తో రూపొందించిన ఈ ఎడిషన్‌ను చూసిన వెంటనే బైక్ ప్రియులు ఫిదా అయ్యేలా కంపెనీ డిజైన్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.75 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోటార్‌సైకిల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ ఉత్పత్తి మోడల్ కాదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నారు. అందులో కూడా భారత మార్కెట్‌కు కేవలం 25 యూనిట్లు మాత్రమే కేటాయించడం దీనిని మరింత అరుదైన కలెక్షన్ బైక్‌గా మార్చింది.
అందువల్ల ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలంటే ఆసక్తి ఉంటే ఫాస్ట్‌గా స్పందించాలి. ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రముఖ కస్టమ్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రఫ్ క్రాఫ్ట్స్ సహకారంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా కస్టమ్ బైక్‌లకు పేరొందిన రఫ్ క్రాఫ్ట్స్ డిజైన్ తత్వాన్ని ఇందులో కనిపించేలా ప్రతి చిన్న అంశాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దీంతో సాధారణ షాట్‌గన్ 650తో పోలిస్తే మరింత ప్రీమియం, బోల్డ్, అగ్రెసివ్ లుక్‌తో కనిపిస్తుంది.

ఈ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రేరణగా 2025 EICMA మోటార్ షోలో తొలిసారిగా ప్రదర్శించిన కాలిబర్ రాయల్ కస్టమ్ మోటార్‌సైకిల్ నిలిచింది. అనంతరం 2025 మోటోవర్స్ ఈవెంట్‌లో ఈ కాన్సెప్ట్‌ను ప్రదర్శించగా, అప్పటి నుంచే ఈ బైక్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే డిజైన్ కలిగిన మోడల్ రూపంలో దీన్ని కంపెనీ అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక యాప్, వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో జూలై 30 సాయంత్రం 7 గంటల నుంచి అమ్మకాలు అధికారికంగా ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో, విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అన్ని యూనిట్లు బుక్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కస్లమర్లు వేగంగా బుక్ చేసుకోవడం మంచిది.

డిజైన్ పరంగా షాట్‌గన్ 650 x రఫ్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ సాధారణ బైకులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను గ్లాస్ జెట్ బ్లాక్, మ్యాట్ స్టెల్త్ బ్లాక్ కలర్స్ కలయికలో రూపొందించగా, బైక్‌కు మరింత ప్రీమియం లుక్ ఇచ్చేలా గోల్డ్ లీఫ్ డీటైలింగ్‌తో పాటు గ్రే యాక్సెంట్స్‌ను కూడా జోడించారు. ఈ ప్రత్యేక రంగుల కలయిక రోడ్డుపై బైక్‌ను మరింత ఆకర్షణీయంగా నిలబెడుతుంది.
ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అనే విషయాన్ని ప్రతిబింబించేలా కాస్ట్ బ్రాస్ కొలాబరేషన్ బ్యాడ్జ్, ఫ్యూయల్ ట్యాంక్‌పై ప్రత్యేక సీరియల్ నంబరింగ్, బ్లాక్ బార్-ఎండ్ మిర్రర్స్, క్విల్టెడ్ లెదర్ సీట్, కాంట్రాస్ట్-కట్ అల్లాయ్ వీల్స్, గోల్డ్ ఫినిష్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్‌ను కంపెనీ అందించింది. దీంతో ఈ బైక్ సాధారణ షాట్‌గన్ 650తో పోలిస్తే మరింత ప్రీమియం, ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను సొంతం చేసుకుంది.

అయితే పనితీరు పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో కూడా సాధారణ షాట్‌గన్ 650లో ఉన్న అదే 648 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లు, అందులో భారత్‌కు 25 యూనిట్లు మాత్రమే కేటాయించడంతో ఈ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ అత్యంత అరుదైన మోడల్‌గా నిలిచింది. అందుకే ప్రత్యేక బైక్‌లను ఇష్టపడే రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది మంచి ప్రత్యేక ఎడిషన్‌గా మారనుంది.


Click it and Unblock the Notifications