ఒక కొత్త బైక్‌ను అభివృద్ధి చేస్తోన్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ సారి ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ కావాల్సిందే!
భారత బైక్ మార్కెట్‌లో "రాయల్స్" అన్న పేరు వినిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). క్లాసిక్ లుక్, బలమైన ఇంజిన్, లాంగ్ రైడ్స్‌కు సరిపోయే కంఫర్ట్ ఈ మూడు అంశాలతో దశాబ్దాలుగా రైడర్ల మనసులు గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు అదే బ్రాండ్, కొత్త టెక్నాలజీతో యువతను టార్గెట్ చేస్తూ 450 సిసి ప్లాట్‌ఫామ్‌పై భారీ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌పై Royal Enfield Himalayan 450, Royal Enfield Guerrilla 450 మోడళ్లతో మార్కెట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. హిమాలయన్ 450 అడ్వెంచర్ రైడర్లకు సరైన ఎంపికగా నిలుస్తే, గొరిల్లా 450 అర్బన్ స్ట్రీట్ రైడింగ్‌కు కొత్త స్టైల్ తీసుకువచ్చింది. ఈ రెండు బైకులు 450 సిసి సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఇప్పుడు అదే జోష్‌ను మరింత పెంచేందుకు కంపెనీ మూడవ మోడల్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. 450 సిసి ఇంజన్‌తో రాబోయే స్క్రాంబ్లర్ 450 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని సమాచారం. ఈ కొత్త బైక్, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని, స్ట్రీట్ స్టైల్‌ను కలిపిన స్క్రాంబ్లర్ డిజైన్‌తో రావొచ్చని అంచనా. అంటే ఇది అడ్వెంచర్ బైక్‌లా పూర్తిగా కాకుండా, స్ట్రీట్ బైక్‌లా పూర్తిగా కాకుండా రెండింటి మధ్యలో "మిక్స్ క్యారెక్టర్"తో ఆకట్టుకునే అవకాశముంది.

450 సిసి ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చాలా కీలకమైనది. కొత్తగా అభివృద్ధి చేసిన లిక్విడ్-కూల్డ్ ఇంజన్, మెరుగైన పవర్ అవుట్‌పుట్, స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉండనున్నాయి. ఇప్పటి వరకు 350 సిసి సెగ్మెంట్‌లో ఆధిపత్యం చూపిన కంపెనీ, ఇప్పుడు 450 సిసి సెగ్మెంట్‌ను కూడా తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు స్ట్రాటజీ మార్చుతోంది.
అలాగే కంపెనీ ప్రస్తుతం 350 సిసి, 440 సిసి, 450 సిసి, 650 సిసి వంటి నాలుగు ప్రధాన ఇంజన్ ప్లాట్‌ఫామ్‌లపై బైకులను విక్రయిస్తోంది. వీటిలో ప్రతి సెగ్మెంట్‌కు వేర్వేరు రైడర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోడళ్లను డిజైన్ చేస్తోంది. కానీ 450 సిసి ప్లాట్‌ఫామ్ మాత్రం కొత్త టెక్నాలజీ, కొత్త డిజైన్, కొత్త రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్‌తో బ్రాండ్ భవిష్యత్తుకు బలమైన బేస్‌గా మారుతోంది.

రాబోయే స్క్రాంబ్లర్ 450 ఈ ప్లాట్‌ఫామ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. స్టైలిష్ లుక్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ పర్పస్ టైర్స్, అలాగే పవర్‌ఫుల్ ఇంజన్, ఇలాంటి ఫీచర్లతో ఇది యువ రైడర్లకు కొత్త ఫేవరెట్‌గా మారొచ్చు. ముఖ్యంగా అడ్వెంచర్ ట్రిప్స్, వీకెండ్ రైడ్స్, సిటీ కమ్యూటింగ్ బైక్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
కొత్త స్క్రాంబ్లర్ 450 డిజైన్‌పై వస్తున్న సమాచారం చూస్తే, ఫ్యూయల్ ట్యాంక్ షేప్, సింగిల్-పీస్ సీట్ డిజైన్ గొరిల్లా 450 స్టైల్‌ను రిఫ్లెక్ట్ చేస్తాయని తెలుస్తోంది. అంటే ఇది పూర్తిగా రెట్రో లుక్ కాకుండా, కొంచెం మాడర్న్, అగ్రెసివ్ స్టైల్‌తో యూత్‌ను టార్గెట్ చేసేలా ఉండొచ్చు. అయితే డిజైన్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా పెద్దగా ఎక్స్‌పెరిమెంట్ చేయకుండా ఇప్పటికే ప్రూవన్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.

హిమాలయన్ 450లో ఉపయోగించిన 452cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఈ స్క్రాంబ్లర్ 450లో కూడా కొనసాగించనున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే, ప్రస్తుత 450cc బైక్స్‌లో ఉన్నటువంటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అంశాలు ఇందులో కూడా ఉండే అవకాశముంది. అయితే స్క్రాంబ్లర్ క్యారెక్టర్‌కు తగ్గట్టు సస్పెన్షన్ సెటప్, టైర్లు, హ్యాండిల్‌బార్ పొజిషన్ వంటి వాటిలో చిన్న మార్పులు చేయవచ్చు.
ప్రస్తుతం గొరిల్లా 450 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.49 లక్షల నుంచి రూ. 2.72 లక్షల వరకు ఉండగా, హిమాలయన్ 450 ధర రూ. 3.06 లక్షల నుంచి రూ. 3.37 లక్షల వరకు ఉంది. ఈ రెండు మధ్య గ్యాప్‌ను ఫిల్ చేసేలా స్క్రాంబ్లర్ 450 ధరను దాదాపు రూ. 2.60 లక్షల నుంచి రూ. 3.10 లక్షల మధ్యలో ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications