ఇంకొన్ని గంటల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. బ్యాటరీ, ఫీచర్స్ వివరాలు ఇవే!

భారతదేశంలో క్లాసిక్ బైక్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ఇప్పుడు అదే కంపెనీ తన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. తన 125 ఏళ్ల ఘన చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపేందుకు పెట్రోల్ బైక్స్‌తో దశాబ్దాలుగా అభిమానులను అలరించిన ఈ బ్రాండ్, తొలిసారి ఎలక్ట్రిక్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రయాణానికి ఆరంభం కానున్న బైక్ పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Royal Enfield Flying Flea C6). ఈ బైక్ కేవలం కొత్త మోడల్ మాత్రమే కాదు, రాయల్ ఎన్‌ఫీల్డ్ భవిష్యత్తు దిశను చూపించే కీలక అడుగు. ఇది ఏప్రిల్ 10, 2026న అధికారికంగా విడుదల కానుంది. పట్టణ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, రోజువారీ కమ్యూటింగ్‌కు అనువుగా ఉండేలా డిజైన్ చేయబడింది.

విడుదలకు ముందే కంపెనీ దీని ముఖ్యమైన వివరాలు, ఫీచర్లను అధికారికంగా వెల్లడించడం, ఈ బైక్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.ఇది డిజైన్ విషయంలో నిజంగా విభిన్నంగా కనిపించే మోడల్‌గా నిలుస్తోంది. కాంపాక్ట్‌గా, సొగసుగా రూపొందించిన దీని రూపం మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టైలింగ్‌ను మోడర్న్ ఎలక్ట్రిక్ టచ్‌తో కలిపి, ఒక కొత్త ఐడెంటిటీని ఈ బైక్‌కు ఇచ్చారు.

Royal Enfiled Flying Flea C6 Electric Bike Details Out Before Official Launch April 10

ముఖ్యంగా EICMA 2025లో ప్రదర్శించిన కాన్సెప్ట్‌లో కనిపించిన స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను ప్రొడక్షన్ వెర్షన్‌లో కొనసాగించారు. హార్డ్‌వేర్ పరంగా చూస్తే, ఈ బైక్ తన సెగ్మెంట్‌లో ప్రత్యేకతను చూపిస్తుంది. ముందు భాగంలో గర్డర్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్ ఇవ్వడం చాలా అరుదైన విషయం, ఇది సాధారణంగా పాతకాలపు క్లాసిక్ బైక్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. అదే సమయంలో వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల, ఆధునిక రైడింగ్ కంఫర్ట్ కూడా అందుతుంది.

డిజైన్ చూస్తే, ఇది అచ్చం ఒక రెట్రో మోటార్‌సైకిల్‌ను గుర్తు చేస్తుంది. రౌండ్ లైట్స్, సింపుల్ బాడీ లైన్స్, మినిమలిస్టిక్ స్టైల్ ఒక టైమ్‌లెస్ ఫీల్‌ను ఇస్తాయి. కానీ ఈ క్లాసిక్ రూపం వెనుక పూర్తిగా ఆధునిక టెక్నాలజీ దాగి ఉంది. ఎర్గోనామిక్స్ విషయానికి వస్తే, రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేశారు. ట్యాంక్ ఏరియా, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ వల్ల రైడర్‌కు రిలాక్స్‌డ్ ఫీలింగ్ వస్తుంది.

Royal Enfiled Flying Flea C6 Electric Bike Details Out Before Official Launch April 10

పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.91 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు, ఇది గరిష్టంగా 15.4 kW పవర్, 60 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ సంఖ్యలు చూస్తే, పనితీరు సుమారు 150-200cc పెట్రోల్ బైక్‌లకు సమానంగా ఉంటుందని అర్థమవుతోంది. రేంజ్ విషయానికి వస్తే, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఇది రోజువారీ అవసరాలకు సరిపడే రేంజ్.

ఫీచర్ల విషయంలో ఈ బైక్ నిజంగా ఫ్యూచర్-రెడీగా కనిపిస్తోంది. 3.5-అంగుళాల TFT డిస్‌ప్లే కన్సోల్‌తో పాటు, ట్యాంక్‌లోనే ఇన్‌బిల్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి యూనిక్ ఫీచర్ అందిస్తున్నారు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, రిమోట్ లాక్/అన్‌లాక్, అజ్ఞాత (స్టెల్త్) మోడ్, వాయిస్ అసిస్ట్ ఈ బైక్‌ను ఒక స్మార్ట్ డివైస్‌లా మార్చేస్తాయి. అంతేకాదు, కాల్, మ్యూజిక్ కంట్రోల్స్, కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.

Royal Enfiled Flying Flea C6 Electric Bike Details Out Before Official Launch April 10

అదనపు ఫీచర్లలో స్మార్ట్‌ఫోన్ అలర్ట్స్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్స్, తీసివేయగల రియర్ సీటు వంటి ఫీచర్లు రోజువారీ ఉపయోగాన్ని సులభం చేస్తాయి. భద్రత కోసం డ్యూయల్-ఛానల్ లీన్-సెన్సిటివ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందిస్తున్నారు. రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎకో, రైన్, టూర్, పెర్ఫార్మెన్స్, కస్టమ్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే రీజెనరేటివ్ బ్రేకింగ్ వల్ల బ్యాటరీ సేవింగ్ కూడా సాధ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 8, 2026, 12:24 [IST]
English summary
Royal enfiled flying flea c6 electric bike details out before official launch april 10
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+