ఇది పక్కా పేదవాళ్ల స్కూటర్.. ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 400కిమీ రేంజ్..బ్యాటరీ, మోటార్ పై లైఫ్ టైమ్ వారంటీ

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. తన సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తూ, దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే ఛార్జ్‌తో ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే సింపుల్ అల్ట్రా వేరియంట్‌ను పరిచయం చేసింది. రేంజ్ విషయంలో భయపడే ఎలక్ట్రిక్ వాహనదారులకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు.

సింపుల్ ఎనర్జీ తాజాగా లాంచ్ చేసిన మోడళ్లలో సింపుల్ అల్ట్రా హైలైట్‌గా నిలిచింది. ఇందులో ఏకంగా 6.5 kWh బ్యాటరీని అమర్చారు. ఇది భారత ఎలక్ట్రిక్ స్కూటర్ చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ. దీనివల్ల ఈ స్కూటర్ ఐడీసీ (IDC) సర్టిఫైడ్ రేంజ్ 400 కిలోమీటర్లుగా ఉంది. అంటే మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం మొత్తం తిరిగేయొచ్చు.

Simple Energy Launches Indias First Single Charge 400 Km Range Electric Scooter

కేవలం రేంజ్ మాత్రమే కాదు, ఇది 115 కి.మీ.ల టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.77 సెకన్లలోనే అందుకుంటుంది. సింపుల్ వన్ జెన్-2 లో విభిన్న అవసరాలకు తగ్గట్టుగా మూడు ఇతర వేరియంట్లను కూడా సంస్థ పరిచయం చేసింది.

సింపుల్ వన్ఎస్ (Simple OneS): దీని రేంజ్ 190 కి.మీ. ధర రూ. 1,49,999 (ఎక్స్-షోరూమ్).
సింపుల్ వన్ (4.5 kWh): దీని రేంజ్ 236 కి.మీ. ధర రూ. 1,69,999 నుంచి ప్రారంభం.
సింపుల్ వన్ (5 kWh): దీని రేంజ్ 265 కి.మీ. ధర రూ. 1,77,999 నుంచి ప్రారంభం. ప్రస్తుతం ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ప్రారంభ ధర రూ. 1,39,999 కే అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ స్కూటర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.

Simple Energy Launches Indias First Single Charge 400 Km Range Electric Scooter

వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు సింపుల్ ఎనర్జీ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తమ వెహికల్స్‌లోని మోటార్, బ్యాటరీపై లైఫ్ టైమ్ వారంటీని ప్రకటించింది. ఇలాంటి ఆఫర్ ఇవ్వడం భారత ఈవీ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. అంతేకాకుండా, జెన్-2 స్కూటర్లలో ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 35 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్, 7-అంగుళాల టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించారు. ఎకో ఎక్స్, ఎకో, రైడ్, ఎయిర్, సోనిక్, సోనిక్ ఎక్స్ వంటి 6 రకాల మోడ్స్ ఉన్నాయి.

సింపుల్ ఎనర్జీ సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. భారతీయ వాహనదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ హై-రేంజ్ స్కూటర్లను డిజైన్ చేశామన్నారు. ప్రస్తుతం బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం సహా 61 కి పైగా షోరూమ్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Simple Energy Launches Indias First Single Charge 400 Km Range Electric Scooter

మార్చి 2026 నాటికి 150 డీలర్‌షిప్‌లు, 200 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 2027లో భారీ ఐపీఓ(IPO)కి కూడా సిద్ధమవుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఐపీఓ ద్వారా రూ.3,000 కోట్ల నిధులు సేకరించాలని సంస్థ భావిస్తోంది. ఇది మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 9:01 [IST]
English summary
Simple energy launches indias first single charge 400 km range electric scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+