డ్రైవింగులో ఫోన్ చూడక్కర్లేదు..ఈ స్కూటరే అన్నీ చెబుతుంది..టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉన్న టాప్ 5 స్కూటర్లు ఇవే
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ఇప్పుడు కేవలం బ్యాటరీ, మైలేజ్ మాత్రమే కాదు.. స్కూటర్ ఎంత స్మార్ట్‌గా ఉందనేది కూడా కస్టమర్లు చూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ లాంటి టీఎఫ్‌టీ (TFT) టచ్ స్క్రీన్ డిస్‌ప్లేలు ఇప్పుడు ఈవీ స్కూటర్లలో ప్రధాన ఆకర్షణగా మారాయి. మ్యాప్స్ చూడాలన్నా, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా, లేదా మ్యూజిక్ మార్చాలన్నా ఈ స్క్రీన్లు ఎంతో ఉపయోగపడతాయి. 2026 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 టచ్ స్క్రీన్ ఈవీ స్కూటర్ల వివరాలు చూద్దాం.
1. ఏథర్ 450ఎక్స్ (Ather 450X)
ఎలక్ట్రిక్ స్కూటర్లలో టెక్నాలజీకి మారుపేరు ఏథర్ ఎనర్జీ. వీరి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఏథర్ 450ఎక్స్ లో 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఇది చాలా స్మూత్ గా పని చేయడమే కాకుండా.. ట్యాప్, స్క్రోల్ ఫంక్షన్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో గూగుల్ మ్యాప్స్ సపోర్ట్, మ్యాజిక్ ట్విస్ట్, పార్క్ అసిస్ట్, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ కాగా, రేంజ్ 161 కి.మీ వరకు ఉంటుంది. దీని ధర రూ.1.46 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

2. సింపుల్ వన్ (Simple One)
పర్ఫార్మెన్స్, టెక్నాలజీ కలయికలో సింపుల్ వన్ దూసుకుపోతోంది. ఇందులో కూడా 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్ నావిగేషన్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఏకంగా 265 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.1.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

3. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ & ఎస్టీ (TVS iQube S & ST)
నమ్మకమైన బ్రాండ్ టీవీఎస్ నుండి వచ్చిన ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ లో 17.78 సెం.మీ భారీ టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ ఉంటుంది. జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.1.58 లక్షల వరకు ఉంటుంది. కుటుంబ అవసరాలకు ఇది ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ స్కూటర్.

4. ఓలా ఎస్1 ప్రో జెన్ 3 (Ola S1 Pro Gen 3)
ఓలా ఎలక్ట్రిక్ లో టాప్ మోడల్ అయిన ఎస్1 ప్రో జెన్ 3 లో మూవ్ ఓఎస్ 5 (MoveOS 5) తో పనిచేసే 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో రోడ్ ట్రిప్ మోడ్, ఎస్ఓఎస్ అలర్ట్స్, మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. హైపర్, స్పోర్ట్, నార్మల్, ఎకో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఇందులో లభిస్తాయి. దీని ధర రూ.1.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

5. ఏథర్ రిజ్తా (Ather Rizta)
ఫ్యామిలీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఏథర్ తీసుకొచ్చిన మోడల్ రిజ్తా. ఇందులో కూడా 7-అంగుళాల యూజర్ ఫ్రెండ్లీ టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ ఉంది. ఫాల్ సేఫ్, క్రాష్ అలర్ట్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని సీటు చాలా వెడల్పుగా ఉండటమే కాకుండా, సెగ్మెంట్ లోనే అత్యధికంగా 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ (ఫ్రంక్ + బూట్) కలిగి ఉంది. దీని ధర రూ.1.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








