మధ్యతరగతి ప్రజల బెస్ట్ ఫ్రెండ్.. చాలా మంచి స్కూటర్! ఇండియాలో మూడో టాప్ సెల్లింగ్ మోడల్

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారీ ప్రభావం చూపుతున్నాయి. రోజువారీ ప్రయాణం కోసం బైక్ లేదా స్కూటర్‌పై ఆధారపడే వారు ఇప్పుడు అదనపు ఖర్చును తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పని కోసం, చదువు కోసం, కుటుంబ అవసరాల కోసం బయటకు వెళ్లే ప్రతి ప్రయాణం కూడా ఇప్పుడు జేబుపై భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలవైపు దృష్టి మళ్లిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలన్న ఆలోచన ఉన్నా, వాటి ధరలు ఇప్పటికీ బడ్జెట్‌కు అందని స్థాయిలో ఉండటంతో సాధారణ వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు.

ఇలాంటి సమయంలో గేర్‌లెస్ స్కూటర్లకు డిమాండ్ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) దేశవ్యాప్తంగా కుటుంబాల నమ్మకాన్ని పొందిన ఒక ముఖ్యమైన మోడల్‌గా నిలుస్తోంది. తక్కువ ఇంధన వినియోగం, సులభమైన రైడింగ్ అనుభవం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

Suzuki Access 125 70339 Units Sold In April 2026 More Details Here

125cc స్కూటర్ సెగ్మెంట్‌లో యాక్సెస్ మంచి స్థిరమైన స్థానాన్ని నిలుపుకుంటోంది. తాజా అమ్మకాల గణాంకాల ప్రకారం, ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సెగ్మెంట్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న Honda Activa, TVS Jupiter తర్వాత యాక్సెస్ 125 తన బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఏప్రిల్ 2026లో మాత్రమే ఈ స్కూటర్ 70,339 యూనిట్ల అమ్మకాలతో మార్కెట్లో మంచి డిమాండ్‌ను నమోదు చేసింది.

గత ఏడాది ఇదే నెలలో నమోదైన 65,107 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అంటే సుమారు 8 శాతం వృద్ధిని సాధిస్తూ, అదనంగా 5,232 యూనిట్లను విక్రయించింది. ఈ వృద్ధి వినియోగదారుల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో కూడా సుజుకి యాక్సెస్ 125 తన స్థిరమైన పనితీరు, అనువైన ఫీచర్లతో మార్కెట్లో బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది.

Suzuki Access 125 70339 Units Sold In April 2026 More Details Here

Suzuki Access 125 కుటుంబ వినియోగానికి అత్యంత నమ్మకమైన స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. రోజువారీ ప్రయాణాలకు సరైన మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం ఇస్తుంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ సుమారు రూ.82,106 నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ వరకు రూ.1,02,301 (ఎక్స్-షోరూమ్) వరకు వెళుతుంది. యాక్సెస్‌లో కంపెనీ రెండు ప్రత్యేక వేరియంట్లలో ABS ఫీచర్‌ను అందిస్తోంది. ఇందులో మొదటిది రైడ్ కనెక్ట్ ABS వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.92,328గా ఉంది.

మరొకటి మరింత ఆధునికంగా రూపొందించిన రైడ్ కనెక్ట్ TFT ABS వేరియంట్, ఇది సుమారు రూ.98,378 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే, Suzuki Access 125లో 124cc సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది, దీని వల్ల రైడింగ్ చాలా సులభంగా, స్మూత్‌గా ఉంటుంది.

Suzuki Access 125 70339 Units Sold In April 2026 More Details Here

పనితీరు పరంగా ఈ ఇంజన్ 6,750 rpm వద్ద 8.7 bhp శక్తిని, అలాగే 5,500 rpm వద్ద 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. నగర ట్రాఫిక్‌లో వేగంగా స్పందించే సామర్థ్యం ముఖ్యమైన ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. ఇది దాదాపుగా మైలేజ్ పరంగా లీటరుకు సుమారు 45 నుంచి 64 కిలోమీటర్లు ఇస్తుంది. 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కారణంగా ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తుంది.

Article Published On: Friday, May 22, 2026, 16:36 [IST]
English summary
Suzuki access 125 70339 units sold in april 2026 more details here
Read more on: #suzuki motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+