దేశమంతా ఈ ఒక్క స్కూటర్ వెనుకే పడుతోంది.. ఏప్రిల్‌లో ఏకంగా 70 వేల మంది కొనేశారు

భారత టూ వీలర్ మార్కెట్లో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో సుజుకి యాక్సెస్ (Suzuki Access) స్కూటర్ మరోసారి సత్తా చాటింది. గత నెల అంటే ఏప్రిల్ 2026లో కంపెనీ మొత్తం మోడల్స్‌లో కల్లా ఈ స్కూటర్ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 70,339 మంది కస్టమర్లు సుజుకి యాక్సెస్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ 2025లో జరిగిన 65,107 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి వార్షిక ప్రాతిపదికన 8 శాతం వృద్ధి నమోదైంది. ఈ విపరీతమైన క్రేజ్ చూస్తుంటే 125 సీసీ స్కూటర్ల విభాగంలో సుజుకి యాక్సెస్‌కు పోటీ ఇచ్చే మోడలే లేదని మరోసారి రుజువైంది.

ఇక సుజుకి కంపెనీకి చెందిన మిగతా మోడల్స్ అమ్మకాల విషయానికి వస్తే.. ఈ లిస్టులో రెండో స్థానంలో సుజుకి బర్గ్‌మన్ (Burgman) నిలిచింది. బర్గ్‌మన్ స్కూటర్లు ఏప్రిల్ నెలలో మొత్తం 19,337 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 16 శాతం తగ్గుముఖం పట్టడం గమనార్హం. మూడో స్థానంలో సుజుకి ఎవెనిస్ (Avenis) నిలిచింది. ఇది 2 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 5,805 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగో స్థానంలో సుజుకి పాపులర్ బైక్ మోడల్ జిక్సర్ (GIXXER) నిలిచింది. జిక్సర్ బైకులు గత నెలలో 1 శాతం స్వల్ప తగ్గుదలతో 977 యూనిట్లు అమ్ముడయ్యాయి.

suzuki access 125 highest selling scooter april 2026 sales report

ఈ సేల్స్ రిపోర్టులో అందరినీ ఆశ్చర్యపరిచింది సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (V-Strom SX) అడ్వెంచర్ బైక్. ఇది ఏకంగా 186 శాతం వార్షిక వృద్ధితో 776 యూనిట్ల మార్కును అందుకుని ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆరో స్థానంలో సుజుకి సరికొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎలక్ట్రిక్ అవతార్ ఈ-యాక్సెస్ (e-Access) నిలిచింది. ఈ కొత్త ఈవీ స్కూటర్ ఏప్రిల్ నెలలో 702 యూనిట్లు అమ్ముడై మంచి ఆరంభాన్ని అందుకుంది. ఏడో స్థానంలో సుజుకి జిక్సర్ 250 బైక్ 21 శాతం వృద్ధితో 40 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

స్పోర్ట్స్ బైక్ లవర్స్ కలల బైక్, స్పీడుకు మారుపేరైన సుజుకి హయాబుసా (Hayabusa) ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి హయాబుసా అమ్మకాలు 69 శాతం దారుణంగా పడిపోయి కేవలం 20 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక తొమ్మిదో స్థానంలో ఉన్న సుజుకి అడ్వెంచర్ బైక్ డిఎల్ 800 డిఈ (DL800DE) మోడల్‌ను గత నెలలో కేవలం ఆరుగురు మాత్రమే కొనుగోలు చేశారు. చివరగా పదో స్థానంలో నిలిచిన సుజుకి ప్రీమియం స్పోర్ట్స్ బైక్ జిఎస్ఎక్స్-8ఆర్ (GSX-8R) కేవలం ఇద్దరు కస్టమర్లను మాత్రమే ఆకర్షించగలిగింది.

suzuki access 125 highest selling scooter april 2026 sales report

మొత్తంగా చూసుకుంటే సుజుకి మోటార్ సైకిల్స్ సంస్థ ఏప్రిల్ 2026 నెలలో భారతదేశంలో మొత్తం 98,004 యూనిట్ల టూ-వీలర్లను విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్ 2025లో జరిగిన 95,250 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే కంపెనీ ఓవరాల్‌గా 3 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అయితే మార్చి 2026 నెలలో జరిగిన 1,05,398 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే మాత్రం ఈ నెలలో సుజుకి సేల్స్ 7 శాతం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, ఇండియన్ మార్కెట్లో ముఖ్యంగా స్కూటర్ల విభాగంలో సుజుకి బ్రాండ్ ఇమేజ్, పట్టు అలాగే కొనసాగుతున్నాయి.

Article Published On: Monday, May 25, 2026, 9:01 [IST]
English summary
Suzuki access 125 highest selling scooter april 2026 sales report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+