లీటర్‌కు 60 కి.మీ మైలేజ్ స్కూటర్.. కొత్త లుక్‌లో వచ్చేసింది! పెట్రోల్ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation)కు అనుబంధంగా పనిచేస్తున్న సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్లో మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రీమియం స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ (Suzuki Burgman Street EX) కోసం పెర్ల్ గ్రే వైట్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగు స్కూటర్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు స్పోర్టీ లుక్‌ను కూడా పెంచుతుంది. యువతను ఆకట్టుకునేలా ఈ కలర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త కలర్ ఎంట్రీతో ఇప్పుడు బర్గ్‌మాన్ స్ట్రీట్ EX స్కూటర్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
వాటిలో కొత్తగా వచ్చిన పెర్ల్ గ్రే వైట్, అలాగే ఇప్పటికే ఉన్న మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2 రంగులు ఉన్నాయి. ఈ మూడు కలర్ ఆప్షన్లు స్కూటర్‌కు ప్రీమియం, స్టైలిష్ ఫినిష్‌ను అందిస్తాయి. ధర చూస్తే, ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 1,07,902గా నిర్ణయించింది. కొత్త కలర్ ఆప్షన్ రావడంతో ఈ స్కూటర్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

రంగులో మార్పు చేసినప్పటికీ, స్కూటర్‌లోని మెకానికల్ అంశాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ పాత ఇంజిన్‌ను అలాగే కొనసాగిస్తోంది. ఈ స్కూటర్‌కు ఇప్పటికే మంచి పేరు తెచ్చిన 124cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే ఇందులో ఉపయోగించారు. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ 6,500 rpm వద్ద గరిష్టంగా 8.6 bhp పవర్, 5,500 rpm వద్ద 10 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.
ఈ ఇంజిన్‌లో Suzuki Eco Performance Alpha (SEP-α) టెక్నాలజీతో పాటు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. దీని వల్ల స్కూటర్ పనితీరు మెరుగవడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. అదే సమయంలో ఇంజిన్ ఆటో స్టాప్-స్టార్ట్ (EASS) వ్యవస్థను కూడా అందించింది. ట్రాఫిక్‌లో స్కూటర్ కొంతసేపు ఆగినప్పుడు ఇంజిన్ స్వయంచాలకంగా ఆఫ్ అవుతుంది.

తర్వాత రైడర్ యాక్సిలరేటర్‌ను తిప్పగానే ఇంజిన్ తిరిగి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. ఈ ఫీచర్ వల్ల ముఖ్యంగా భారీ ట్రాఫిక్‌లో ఇంధన సామర్థ్యం పెరగడంతో పాటు స్కూటర్ వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్త కలర్‌తో వచ్చినప్పటికీ, ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ మంచి ప్రీమియం టచ్‌ను అందిస్తుంది. Suzuki Burgman Street EX లో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో సుజుకి రైడ్ కనెక్ట్‌తో కూడిన బ్లూటూత్ మల్టీ-ఫంక్షన్ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వబడింది. దీని ద్వారా రైడర్లు కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, నావిగేషన్ వంటి సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. అదే విధంగా LED హెడ్‌లైట్, LED టెయిల్ ల్యాంప్, బాడీ-మౌంటెడ్ విండ్‌స్క్రీన్, అలాగే సౌకర్యవంతమైన డ్యూయల్-టోన్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇందులో 21.5 లీటర్ల పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా అందించారు. ఇది 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక భాగంలో స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వబడింది. ఇవి రైడ్ సమయంలో మెరుగైన స్థిరత్వం, సౌకర్యాన్ని అందిస్తాయి. బ్రేకింగ్ కోసం ముందుభాగంలో డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ ఆప్షన్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఇవ్వబడింది.


Click it and Unblock the Notifications








