పెట్రోల్ బంకులకు ఇక గుడ్ బై.. సుజుకి ఇ-యాక్సెస్ వచ్చేసింది..రేంజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టూవీలర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సుజుకి సంస్థ, ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుజుకి ఇ-యాక్సెస్(Suzuki e-Access) ఎలక్ట్రిక్ స్కూటర్ శుక్రవారం మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. పెట్రోల్ స్కూటర్ల విభాగంలో యాక్సెస్ 125 ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే నమ్మకంతో, అదే స్టైల్‌తో ఎలక్ట్రిక్ అవతారంలో ఈ స్కూటర్ కస్టమర్లను పలకరించడానికి వచ్చేసింది.
కొత్త సుజుకి ఇ-ఆక్సెస్ స్కూటర్ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రూ.1.88లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైంది. ధర కాస్త ప్రీమియంలా అనిపించినా, సుజుకి ఇచ్చే క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ ముందు ఇది తక్కువేనని వాహన ప్రియులు అంటున్నారు.

ఈ స్కూటర్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. మీరు సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో లేదా మీకు దగ్గరలోని డీలర్‌షిప్‌కు వెళ్లి ఈ స్కూటర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న సుజుకికి చెందిన 1,200 షోరూమ్‌లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.
సుజుకి ఇ-ఆక్సెస్ చూడటానికి చాలా క్లాసీగా, మోడ్రన్‌గా ఉంది. పాత యాక్సెస్ లుక్‌ను పోలి ఉన్నప్పటికీ, ఇందులో చాలా కొత్త మార్పులు చేశారు. మెరిసే ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, స్టైలిష్ ఎల్‌ఈడీ ఇండికేటర్లు, డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ ఈ స్కూటర్‌కు మరింత అందాన్ని ఇస్తున్నాయి.

రంగుల విషయానికి వస్తే.. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, మెటాలిక్ మ్యాట్ ఫైబ్రాయిన్ గ్రే వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీ ఉండటం వల్ల గుంతల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించవచ్చు.
ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 3.07 kWh సామర్థ్యం గల పవర్ ఫుల్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు (రేంజ్). ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దీని టాప్ స్పీడ్ గంటకు 71 కిలోమీటర్లు. అంటే సిటీ రోడ్లపై హాయిగా, వేగంగా దూసుకుపోవచ్చు. చార్జింగ్ విషయానికి వస్తే.. నార్మల్ పోర్టబుల్ చార్జర్‌తో 6 గంటల 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. అదే డీసీ ఫాస్ట్ చార్జర్ వాడితే కేవలం 2 గంటల 12 నిమిషాల్లోనే పని పూర్తవుతుంది.
సుజుకి ఈ స్కూటర్లో టెక్నాలజీని కూడా భారీగా వాడింది. ఇందులో 4.2 ఇంచుల పెద్ద టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే ఉంటుంది. దీని ద్వారా మనం కాల్స్, మెసేజ్ అలర్ట్స్ చూసుకోవచ్చు. రిమోట్ స్టార్ట్, యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్, సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మీ మూడ్‌ని బట్టి, రోడ్డుని బట్టి స్కూటర్ వేగాన్ని మార్చుకోవడానికి ఎకో, రైడ్ ఎ, రైడ్ బి అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. దీనివల్ల బ్యాటరీని సేవ్ చేస్తూ ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం సుజుకి ఎక్కడా రాజీ పడలేదు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల ప్రయాణం చాలా స్మూత్ గా ఉంటుంది.
బ్రేకింగ్ కోసం డిస్క్, డ్రమ్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ స్కూటర్ ప్రధానంగా బజాజ్ చేతక్ (Bajaj Chetak), ఏథర్ రిజ్టా (Ather Rizta), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి హేమాహేమీలతో తలపడనుంది. అయితే సుజుకికున్న బ్రాండ్ ఇమేజ్, యాక్సెస్ పై ఉన్న నమ్మకంతో ఇది నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








