చుక్క పెట్రోల్ కూడా అవసరం లేదు.. 2026లో మీరు కొనదగ్గ టాప్-10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క రూపాయి పెట్రోల్ ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ మొదటి స్థానంలో ఉంటుంది. టీవీఎస్ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ఇది iQube, iQube S, iQube ST అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 94 కి.మీ నుంచి 212 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీనిలో స్మార్ట్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. దీని రూ.94,434 నుంచి రూ.1.58 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Top 10 Best Electric Scooters to Buy in India 2026 Say Goodbye to Rising Petrol Prices

2. బజాజ్ చేతక్ ఈవీ (Bajaj Chetak EV)
క్లాసిక్ లుక్ తో పాటు మెటల్ బాడీ కావాలనుకునే వారికి బజాజ్ చేతక్ బెస్ట్ ఆప్షన్. ఫైబర్ బాడీ స్కూటర్ల కంటే ఇది చాలా ధృడంగా ఉంటుంది. ఇందులో C2501, C3001 వంటి సిరీస్ లు ఉన్నాయి. సింగిల్ ఛార్జ్ తో 113 కి.మీ నుంచి 153 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ప్రీమియం ఫినిషింగ్, అత్యుత్తమ రైడింగ్ కంఫర్ట్ దీని సొంతం. దీని ధర ప్రారంభ ధర రూ. 87,100 నుంచి రూ. 1.22 లక్షల వరకు ఉంటుంది.

3. ఏథర్ రిజ్తా (Ather Rizta)
ఫ్యామిలీ అవసరాల కోసం ఏథర్ సంస్థ ప్రత్యేకంగా రిజ్తాను డిజైన్ చేసింది. ఇది చూడటానికి పెద్దగా, కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. సింగిల్ ఛార్జ్ తో 123 కి.మీ నుంచి 159 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అతిపెద్ద సీట్, భారీ అండర్ సీట్ స్టోరేజ్ దీని ప్రత్యేకత. దీని ధర రూ. 1.04 లక్షల నుంచి రూ. 1.30 లక్షల మధ్య ఉంటుంది.

Top 10 Best Electric Scooters to Buy in India 2026 Say Goodbye to Rising Petrol Prices

4. ఏథర్ 450X (Ather 450X)
మీరు స్పోర్టీ లుక్, హై-పెర్ఫార్మెన్స్ కోరుకుంటే ఏథర్ 450X కి మించినది లేదు. దీని పికప్ చాలా వేగంగా ఉంటుంది. దీని మీద గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో వెళ్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 161 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.1.19 లక్షల నుంచి రూ.1.46 లక్షల వరకు.

5. హీరో విడా (Hero Vida)
హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన విడా స్కూటర్లు బడ్జెట్, ఫీచర్ల కలయికగా ఉంటాయి. ఇందులో బ్యాటరీని తీసి విడిగా ఛార్జింగ్ పెట్టుకునే (Portable) సౌకర్యం ఉంది. దీని రేంజ్ 92 కి.మీ నుంచి 165 కి.మీ వరకు ఉంటుంది. దీని ధర ప్రారంభ ధర రూ.73,850 (VX2 GO) నుంచి రూ.1.40 లక్షల వరకు. ఇది ఐపీఎల్ 2026 సందర్భంగా హీరో విడా VX2 ప్లస్ నైట్ ఎడిషన్ కూడా మార్కెట్లో సందడి చేస్తోంది.

Top 10 Best Electric Scooters to Buy in India 2026 Say Goodbye to Rising Petrol Prices

6. ఆంపియర్ మాగ్నస్ (Ampere Magnus)
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కావాలనుకునే వారికి ఆంపియర్ మాగ్నస్ సరైన ఎంపిక. దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ. సింగిల్ ఛార్జ్ మీద 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్లో 33 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం.

7. ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1X)
భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. బడ్జెట్ తక్కువగా ఉన్నవారు దీనిని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ 2kWh, 3kWh,4kWh ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 108 కి.మీ నుంచి ఏకంగా 242 కి.మీ వరకు ఇస్తుంది. దీని ధర కేవలం రూ. 49,999 నుంచి ప్రారంభం కావడం దీని విశేషం.

8. ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)
ప్రీమియం లుక్, లాంగ్ రేంజ్ కావాలనుకునే వారికి ఓలా ఎస్1 ప్రో బెస్ట్ ఆప్షన్. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేసి గరిష్టంగా 242 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీని ధర రూ. 1.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

9. రివర్ ఇండి (River Indie)
దీనిని స్కూటర్లలో SUV అని పిలుస్తారు. ఎందుకంటే దీని స్టోరేజ్ సామర్థ్యం అంతలా ఉంటుంది. సీటు కింద 55 లీటర్లు, ముందు వైపు 12 లీటర్ల బాక్స్ ఉంటుంది. సింగిల్ ఛార్జ్ మీద 163 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంటకు 90 కి.మీ వేగంతో వెళ్తుంది. దీని ధర రూ. 1.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

10. బిగాస్ సీ12 (BGauss C12)
చూడటానికి పాతకాలపు స్కూటర్ లాగా, పనితీరులో ఆధునిక టెక్నాలజీతో ఈ బిగాస్ సీ12 అలరిస్తుంది. రెట్రో లుక్ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. సింగిల్ ఛార్జ్ మీద 123 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 1.04 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 28, 2026, 11:19 [IST]
English summary
Top 10 best electric scooters to buy in india 2026 say goodbye to rising petrol prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+