ఇవే 4 బెస్ట్ మైలేజ్ స్కూటర్లు.. ఒక్కసారి కొంటే కొన్నేళ్ల పాటు టెన్షన్ లేదు! రోజూ ఆఫీస్‌కు యూజ్‌ఫుల్

భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, సులభమైన రైడింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల చాలా మంది ఇప్పుడు స్కూటర్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రోజువారీ ప్రయాణాలకు స్కూటర్లు ఎంతో సౌకర్యంగా ఉండటంతో వినియోగదారులు వాటిని ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా రోజువారీ ఉపయోగం కోసం ఒక కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మంచి మైలేజ్ ఇచ్చే మోడళ్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఈ విషయంలో మార్కెట్లో మంచి పేరు సంపాదించిన కొన్ని 125cc స్కూటర్లు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా Honda Activa 125, TVS Jupiter 125, Suzuki Access 125, TVS NTorq 125 వంటి మోడళ్లు ప్రస్తావించవచ్చు. వాటి గురించి ఈ కథణంలో..

TVS Jupiter 125: భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన 125cc స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ ఒకటి. ఇది ధర పరంగా కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది వినియోగదారులు దీన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర సుమారు రూ.84,150 నుంచి రూ.93,110 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. పనితీరు విషయానికి వస్తే, ఇందులో 124.8 సిసి పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది.

Top 4 Mileage Scooters In India Activa Jupiter Access And Ntorq Details Inside

ఈ ఇంజిన్ నగర ప్రయాణాలకు సరిపోయే శక్తిని అందించడమే కాకుండా మంచి మైలేజీని కూడా ఇస్తుంది. సాధారణ పరిస్థితుల్లో ఇది సుమారు 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. అంతేకాకుండా, ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఫీచర్ల పరంగా కూడా ఇది వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ సైలెంట్ స్టార్ట్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.

Honda Activa 125: భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా 125 ఒకటి. దీని ధర రూ.88,339 నుంచి రూ.94,096 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. పనితీరు విషయానికి వస్తే, ఇందులో 123.92 సిసి పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. ఈ ఇంజిన్ మంచి శక్తిని అందించడమే కాకుండా సుమారు 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. అలాగే ఇది గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

Top 4 Mileage Scooters In India Activa Jupiter Access And Ntorq Details Inside

డిజైన్ పరంగా కూడా ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఇది బాగా ఆకట్టుకుంటోంది. ఫీచర్ల పరంగా కూడా ఇది ఆధునిక సదుపాయాలను అందిస్తుంది. ఇందులో TFT కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ ఎంపికలను కూడా అందించారు. దీంతో రోజువారీ ప్రయాణాలకు ఇది సౌకర్యవంతమైన, నమ్మకమైన స్కూటర్‌గా నిలుస్తోంది

Suzuki Access 125: సుజుకి యాక్సెస్ సరసమైన ధరతో పాటు మంచి పనితీరు ఇవ్వడం వల్ల చాలా మంది వినియోగదారులు దీన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర సుమారు రూ.81,508 నుంచి రూ.1.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 124 సిసి పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. ఇది మంచి పనితీరుతో పాటు లీటరుకు సుమారు 45 నుంచి 64 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు.

Top 4 Mileage Scooters In India Activa Jupiter Access And Ntorq Details Inside

TVS NTorq 125: టీవీఎస్ ఎన్‌టార్క్ యువతలో ఎక్కువగా క్రేజ్ పొందిన స్కూటర్లలో ఒకటి. ధర రూ.81,250 నుంచి రూ.1 లక్ష వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 124.8 సిసి పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 47 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదు. ఫీచర్ల పరంగా ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జర్ వంటివి ఉన్నాయి. ఇది రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా స్టైలిష్ స్కూటర్ కోరుకునే యువతకు బెస్ట్.

More from DriveSpark

Article Published On: Wednesday, March 11, 2026, 7:38 [IST]
English summary
Top 4 mileage scooters in india activa jupiter access and ntorq details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+