రూ.55 వేలకే లీటరుకు 80కిమీ మైలేజ్.. కాలేజీ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బైక్స్ ఇవే

కాలేజీకి వెళ్లే కుర్రాళ్లకు బైక్ అంటే కేవలం ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లే సాధనం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్. అయితే స్టైల్‌తో పాటు జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే తక్కువ మెయింటెనెన్స్, అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బైక్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, లీటరుకు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్ ఉంటే ఆ కిక్కే వేరు.

అందుకే కాలేజీ స్టూడెంట్స్ కోసం బడ్జెట్ ధరలో లభించే టాప్ 5 బెస్ట్ బైక్స్ వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. నేటి మార్కెట్‌లో కేవలం రూ.55,400 ప్రారంభ ధరతోనే మంచి ఫీచర్లు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో హీరో స్ప్లెండర్ వంటి నమ్మకమైన మోడల్స్ నుంచి, టీవీఎస్ రేడియాన్ వంటి స్టైలిష్ బైక్స్ వరకు అన్నీ ఉన్నాయి.

Top 5 Best Mileage Bikes for Students High Performance Low Budget

1. హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగుతున్న బైక్ ఇది. కాలేజీ స్టూడెంట్స్‌కు ఇది ఎప్పటికీ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉండటం దీని ప్లస్ పాయింట్. ఇందులో ఉన్న 97.2 సీసీ ఇంజిన్ 7.91 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. దీనిలోని i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో బైక్ ఆగినప్పుడు ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసి, పెట్రోల్ ఆదా చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల భద్రత కూడా ఎక్కువే. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.74,902గా ఉంది. ఇది లీటరుకు 70-80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

2. టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ ఒక వరప్రసాదం. ఈ బైక్ లీటరుకు గరిష్టంగా 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ గర్వంగా చెబుతోంది. ఇందులో ఉన్న ETFI టెక్నాలజీ వల్ల పాత మోడల్స్ కంటే 15 శాతం ఎక్కువ మైలేజ్ వస్తుంది. స్టైలిష్ అలాయ్ వీల్స్, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగే హ్యాండ్లింగ్ దీని సొంతం. దీని ప్రారంభ ధర సుమారు రూ.55,500గా ఉంది. మైలేజ్ పరంగా ఇది కాలేజీ కుర్రాళ్లకు బెస్ట్ ఆప్షన్.

Top 5 Best Mileage Bikes for Students High Performance Low Budget

3. బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110)
కంఫర్ట్ విషయంలో ప్లాటినాకు సాటిలేదు. ఇందులో ఉండే నిట్కా గైడ్ సస్పెన్షన్ వల్ల గతుకుల రోడ్లపై కూడా సాఫీగా వెళ్లొచ్చు. దీని 115.45 సీసీ ఇంజిన్ మంచి పికప్‌ను ఇస్తుంది. లాంగ్ రైడ్స్ వెళ్లే స్టూడెంట్స్ కోసం 11 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, మెత్తని సీటు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5-స్పీడ్ గేర్ బాక్స్ వల్ల హైవేల మీద కూడా బైక్ వైబ్రేషన్స్ లేకుండా వెళ్తుంది. దీని ధర సుమారు రూ.69,714 ఉండగా, లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

4. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
చాలా తక్కువ ధరలో నమ్మకమైన బైక్ కావాలంటే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వైపు చూడొచ్చు. ఇది కేవలం 110 కేజీల బరువు మాత్రమే ఉంటుంది, కాబట్టి కాలేజీ పార్కింగ్‌లో లేదా ట్రాఫిక్ లో బైక్ తిప్పడం చాలా సులభం. దీని లుక్ సింపుల్ గా ఉన్నా, పనితీరులో మాత్రం అసలైన హీరో అనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో కాలేజీకి వెళ్లి రావాలనుకునే మధ్యతరగతి విద్యార్థులకు ఇది మోస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ బైక్. దీని ధర సుమారు రూ.57,657 గా నిర్ణయించబడింది.

Top 5 Best Mileage Bikes for Students High Performance Low Budget

5. టీవీఎస్ రేడియాన్ (TVS Radeon)
స్టూడెంట్స్ కు కావాల్సిన స్మార్ట్ ఫీచర్లు అన్నీ టీవీఎస్ రేడియాన్ లో ఉన్నాయి. దీని లుక్ కాస్త క్లాసిక్ గా ఉన్నా, ఫీచర్లు మాత్రం అన్నీ మోడ్రన్. మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, రాత్రి వేళల్లో మెరిసే ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs), సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటివి ఇందులో స్పెషల్. 110 సీసీ ఇంజిన్ తో 73 కిలోమీటర్ల పైగా మైలేజ్ ఇస్తూ, స్టైల్ తో పాటు పొదుపును కూడా అందిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.55,400 మాత్రమే.

More from DriveSpark

Article Published On: Thursday, March 5, 2026, 12:50 [IST]
English summary
Top 5 best mileage bikes for students high performance low budget
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+