బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతోందా? మధ్య తరగతి బడ్జెట్‌లో ప్రాణాలకు రక్షణనిచ్చే టాప్-5 బైకులు ఇవే
మనదేశంలో టూ వీలర్ ప్రయాణం ఎంత సరదాగా ఉంటుందో అంతే రిస్క్‌తో కూడుకుంది. ముఖ్యంగా వానాకాలంలో లేదా ఇసుక రోడ్ల మీద సడన్ బ్రేక్ వేస్తే బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని లాంటి టెక్నాలజీనే'ABS' (Anti-lock Braking System). బండి స్పీడుగా వెళ్తున్నప్పుడు బ్రేక్ నొక్కినా వీల్స్ లాక్ అవ్వకుండా చూస్తూ, బైక్ అదుపు తప్పకుండా ఆపేందుకు ఇది సాయపడుతుంది. సాధారణంగా ఖరీదైన బైకుల్లో మాత్రమే కనిపించే ఈ ఫీచర్, ఇప్పుడు బడ్జెట్ బైకుల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. అతి తక్కువ ధరలో ఏబీఎస్ ఫీచర్‌తో లభిస్తున్న టాప్-5 బైకుల వివరాలు చూద్దాం.
ఏబీఎస్ (ABS) అంటే ఏమిటి?
చాలామంది బైక్ కొనేటప్పుడు కేవలం మైలేజీ, స్టైల్ మాత్రమే చూస్తారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది సేఫ్టీ. సాధారణ బైకుల్లో వేగంగా బ్రేక్ వేస్తే వీల్స్ గట్టిగా లాక్ అయిపోయి, బైక్ రోడ్డు మీద జారిపోతుంది. దీనివల్ల తీవ్రమైన గాయాలవుతాయి. కానీ ఏబీఎస్ సిస్టమ్ ఉన్న బైకుల్లో బ్రేక్ వేయగానే అది సెకనుకు పదుల సార్లు బ్రేక్ ప్యాడ్లను వదులుతూ, నొక్కుతూ వీల్ ఆగకుండా దొర్లుతూనే ఆగిపోయేలా చేస్తుంది. దీనివల్ల బైక్ స్కిడ్ అవ్వదు. ప్రస్తుతం 125సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైకులకు ఇది తప్పనిసరి. కానీ కంపెనీలు పోటీ పడి 125సీసీ లోపు బైకుల్లో కూడా దీనిని ఇస్తున్నాయి.

1. హీరో ఎక్స్ట్రీమ్ 125R (Hero Xtreme 125R)
ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న బైక్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. 125సీసీ సెగ్మెంట్‌లో చాలా తక్కువ ధరకు ఏబీఎస్ (ABS) ఫీచర్‌ను అందిస్తున్న ఏకైక బైక్ ఇదే కావడం విశేషం. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.93,500 నుంచి ప్రారంభమవుతుంది. యూత్‌ను ఆకట్టుకునేలా దీని డిజైన్ చాలా స్పోర్టీగా ఉంటుంది. 125సీసీ ఇంజిన్ కాబట్టి మైలేజీ విషయంలో కూడా తిరుగుండదు. మంచి లుక్, సూపర్ మైలేజీతో పాటు బడ్జెట్ ధరలో సేఫ్టీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
2. టీవీఎస్ రెయిడర్ 125 (TVS Raider 125)
నేటి కాలంలో టీనేజర్లు, ఆఫీసు వెళ్లే యువతకు ఫేవరెట్ బైక్ అంటే టీవీఎస్ రెయిడర్. దీనిలోని ఏబీఎస్ వేరియంట్ ధర రూ.95,225 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వెనుక కూడా డిస్క్ బ్రేక్ సౌకర్యం ఉంటుంది. దీనివల్ల బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ మరింత పెరుగుతుంది. టీఎఫ్‌టీ డిస్‌ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నప్పటికీ ధరను తక్కువగానే ఉంచింది టీవీఎస్. స్పోర్టీ కమివ్యూటర్ బైక్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

3. బజాజ్ పల్సర్ NS125 (Bajaj Pulsar NS125)
పల్సర్ అంటేనే పవర్. ఆ సిరీస్‌లో బడ్జెట్ ధరలో లభిస్తున్న రఫ్ అండ్ టఫ్ బైక్ NS125. దీని టాప్ ఎండ్ వేరియంట్ (LED BT ABS) ధర రూ.99,073 గా ఉంది. ఇందులో ఏబీఎస్‌తో పాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎన్ఎస్ సిరీస్ గంభీరమైన రూపం ఈ బైక్ సొంతం. చిన్న ఇంజిన్ అయినప్పటికీ పల్సర్ బ్రాండ్ వాల్యూ, స్టైల్ దీనిని ప్రత్యేకంగా నిలుపుతాయి.
4. హీరో ఎక్స్ట్రీమ్ 160R 2V (Hero Xtreme 160R 2V)
మీకు కొంచెం పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి కానీ బడ్జెట్ లక్ష రూపాయల అటు ఇటుగా ఉండాలి అనుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 160R బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ.1.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 160సీసీ ఇంజిన్ సెగ్మెంట్‌లో ఇంత తక్కువ ధరకు ఏబీఎస్ ఫీచర్‌తో లభిస్తున్న బైక్ ఇదొక్కటే. దీని పికప్ మరియు బ్రేకింగ్ సిస్టమ్ ఇతర 150సీసీ బైకుల కంటే మెరుగ్గా ఉంటుంది. సిటీ రైడింగ్ చేసేవారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

5. బజాజ్ పల్సర్ 150, యమహా FZ Fi (Bajaj Pulsar 150, Yamaha FZ Fi)
ఈ రెండు బైకులు ఐదవ స్థానాన్ని పంచుకుంటున్నాయి. ఎందుకంటే రెండింటి ధర దాదాపు రూ.1.10 లక్షల వరకు ఉంటుంది. పల్సర్ 150 అనేది ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ మోడల్. ఇందులో మొదటి నుంచే ఏబీఎస్ ఫీచర్ ఉంది. ఇక యమహా FZ విషయానికి వస్తే, ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తుంది. యమహా బ్రాండ్ ఇంజిన్ స్మూత్‌నెస్, టైర్ల గ్రిప్ ఈ బైక్‌ను సేఫ్టీ విషయంలో మరింత ముందుంచుతాయి.


Click it and Unblock the Notifications








