ఇంట్లో సరుకులు ఈజీగా పెట్టొచ్చు.. ఎక్కువ లగేజ్ స్పేస్ ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) హవా రోజురోజుకూ పెరిగిపోతోంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు పెట్రోల్ ఖర్చులను ఆదా చేసేందుకు కస్టమర్లు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు కంపెనీలు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా.. రోజువారీ అవసరాల కోసం స్కూటర్లలో ప్రాక్టికాలిటీని, అంటే ఎక్కువ లగేజ్ స్పేస్‌ను అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు గ్రాసరీస్, షాపింగ్ బ్యాగులు, నిత్యావసర సరుకులు సులభంగా తీసుకెళ్లగలిగేలా భారీ బూట్ స్పేస్‌తో మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు చూద్దాం.

1. ఏథర్ రిజ్టా (Ather Rizta) - 56 లీటర్లు
భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఈవీ స్కూటర్‌గా పేరు తెచ్చుకున్న ఏథర్ రిజ్టా స్టోరేజ్ పరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ స్కూటర్‌లో కంపెనీ ఏకంగా 56 లీటర్ల మొత్తం స్టోరేజ్ కెపాసిటీని అందించింది. ఇందులో సీటు కింద 34 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా.. స్కూటర్ ముందు భాగంలో అదనంగా 22 లీటర్ల ఫ్రంక్ స్టోరేజ్ లభిస్తుంది.

top 5 electric scooters india highest boot space groceries ather rizta river indie price details

చిన్న చిన్న సామాన్లు దాచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 159 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.21 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

2. రివర్ ఇండీ (River Indie) - 55 లీటర్లు
బెంగళూరుకు చెందిన రివర్ కంపెనీ తీసుకొచ్చిన ఇండీ స్కూటర్ మార్కెట్లో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దీనిని కంపెనీ స్కూటర్ల ఎస్‌యూవీ(SUV of Scooters) అని పిలుస్తుంది. దీని డిజైన్ మొత్తం లగేజ్ మోయడానికి వీలుగానే తయారు చేశారు. ఇందులో 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌తో పాటు 12 లీటర్ల గ్లోవ్ బాక్స్ లభిస్తుంది.

top 5 electric scooters india highest boot space groceries ather rizta river indie price details

మొత్తం 55 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ డిక్కీలో రెండు ఫుల్ సైజ్ హెల్మెట్లు సులభంగా పెట్టేయొచ్చు. దీని ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, సైడ్ హుక్స్ వల్ల సామాన్లు కట్టుకోవడం చాలా ఈజీ. 160 కిమీ రేంజ్ ఇచ్చే ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.52 లక్షలుగా ఉంది.

3. బజాజ్ చేతక్ సీ3501 (Bajaj Chetak C3501) - 35 లీటర్లు
భారత టూ-వీలర్ దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న ప్రీమియం మోడల్ చేతక్ సి3501 కూడా ప్రాక్టికాలిటీలో మంచి రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌లో సీటు కింద 35 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్‌ను అందించారు. ఇది వీకెండ్ షాపింగ్‌కు, ఆఫీస్ లగేజ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

top 5 electric scooters india highest boot space groceries ather rizta river indie price details

సింగిల్ ఛార్జ్‌పై 153 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ ప్రీమియం స్కూటర్ ధర రూ.1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో కీ-లెస్ ఎంట్రీ, టీఎఫ్టీ డిస్‌ప్లే, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

4. ఓలా ఎస్1 ప్రో ప్లస్ (Ola S1 Pro+) - 34 లీటర్లు
ఈవీ రంగంలో లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎస్1 ప్రో ప్లస్ లగేజ్ స్పేస్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ స్కూటర్ సీటు కింద 34 లీటర్ల పెద్ద స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఉంటుంది. దీనివల్ల మార్కెట్ సరుకులు అన్నీ ఇందులో ఈజీగా సర్దుకోవచ్చు.

top 5 electric scooters india highest boot space groceries ather rizta river indie price details

4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చే ఈ స్కూటర్ ఏకంగా 320 కిలోమీటర్ల టాప్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 130 కిమీ. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నేవిగేషన్ ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

5. టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter) - 34 లీటర్లు
టీవీఎస్ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు, లగేజ్ స్పేస్ కోరుకునే వారి కోసం దీనిని డిజైన్ చేశారు. ఇందులో కూడా ఓలా లాగే 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంది, దీనిలో రెండు ఫుల్ సైజ్ హెల్మెట్లు పడతాయి.

top 5 electric scooters india highest boot space groceries ather rizta river indie price details

దీని పొడవైన ఫ్లాట్ సీటు ప్రయాణాన్ని మరింత కంఫర్టబుల్‌గా మారుస్తుంది. దీని సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,999 కాగా.. కంపెనీ అందిస్తున్న బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) స్కీమ్ కింద దీనిని కేవలం రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్‌లో ఎక్కువ స్పేస్ కావాలనే వారికి ఇది ది బెస్ట్ ఆప్షన్.

Article Published On: Tuesday, June 9, 2026, 7:28 [IST]
English summary
Top 5 electric scooters india highest boot space groceries ather rizta river indie price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+