5 ఏళ్ల బ్యాటరీ వారంటీతో వస్తున్న బెస్ట్ EV స్కూటర్లు! ఏళ్ల తరబడి టెన్షన్ లేదు

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే చాలా మంది మనసులో మొదట వచ్చే సందేహం బ్యాటరీ పనితీరు, విశ్వసనీయత గురించే. కొన్నాక ఎలాంటి సమస్యలు వస్తాయో?, బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుందా? వంటి ప్రశ్నలు చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. అందుకే పెట్రోల్ స్కూటర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారుతోంది. తయారీ సంస్థలు వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఆకర్షణీయమైన బ్యాటరీ వారంటీ ప్యాకేజీలను అందిస్తున్నాయి. స్టాండర్డ్ వారంటీతో పాటు, అదనపు చెల్లింపుతో పొడిగించిన వారంటీ లేదా ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో బ్యాటరీ నిర్వహణ ఖర్చులపై ఉండే భయం గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐదేళ్ల వరకు బ్యాటరీ వారంటీతో లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ కథనంలో చూద్దాం.

TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్‌కు కంపెనీ స్టాండర్డ్‌గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది. అయితే బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BaaS) ప్లాన్‌ను ఎంచుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో మొత్తం బ్యాటరీ వారంటీ 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. నెలకు రూ.1,242 నుంచి ప్రారంభమయ్యే ప్లాన్‌లు అందుబాటులో ఉండటంతో బ్యాటరీపై ఆందోళన తగ్గడమే కాకుండా, స్కూటర్ రీసేల్ విలువ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.

Top Best Electric Scooters Offering Up To 5 Year Battery Warranty Cover

Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని అందిస్తోంది. అయితే మరింత భద్రత కోరుకునే వినియోగదారులు అదనపు చెల్లింపుతో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని తీసుకుంటే, ఈ కవరేజ్‌ను 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చు. దీంతో బ్యాటరీ నిర్వహణపై ఉండే ఆందోళన గణనీయంగా తగ్గుతుంది.

చేతక్‌లో ఉపయోగించిన బ్యాటరీని దీర్ఘకాల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. రోజువారీ ప్రయాణాలతో పాటు ఎన్నో ఛార్జింగ్ సైకిళ్లను తట్టుకునేలా దీనిని అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంటోంది. అయితే వారంటీ ప్రయోజనాలు పొందాలంటే స్కూటర్‌ను కంపెనీ సూచించిన విధంగానే ఉపయోగించాలి. రోడ్డు ప్రమాదాలు, అనధికారికంగా బ్యాటరీ లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో మార్పులు చేయడం, నాణ్యత లేని ఛార్జర్లు ఉపయోగించడం,లేదా తప్పు ఛార్జింగ్ వల్ల కలిగే నష్టాలకు వారంటీ వర్తించదు.

Top Best Electric Scooters Offering Up To 5 Year Battery Warranty Cover

Ola S1 Pro, S1 Air: ఓలా S1 ప్రో, S1 ఎయిర్ స్కూటర్లు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీతో వస్తాయి. ఎక్స్‌టెండెడ్ వారంటీ తీసుకుంటే కవరేజ్ 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు పెరుగుతుంది. బ్యాటరీ హెల్త్ 70% కంటే తక్కువకు పడిపోతే, కంపెనీ నిబంధనల ప్రకారం బ్యాటరీ రీప్లేస్‌మెంట్ అందిస్తుంది. అయితే ముందు మీ మోడల్‌కు వర్తించే వారంటీ వివరాలను ఒకసారి తెలుసుకోవాలి.

Ampere Nexus : గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ నెక్సస్, మాగ్నస్ గ్రాండ్, జీ మ్యాక్స్ వంటి మోడళ్లు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో వస్తున్నాయి. ప్రస్తుతం మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఇది అత్యంత ఆకర్షణీయమైన స్టాండర్డ్ వారంటీ ప్యాకేజీల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ స్కూటర్ల మరో ప్రధాన ప్రత్యేకత LFP బ్యాటరీ టెక్నాలజీ. ఇది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.

Top Best Electric Scooters Offering Up To 5 Year Battery Warranty Cover

Article Published On: Monday, July 13, 2026, 11:19 [IST]
English summary
Top best electric scooters offering up to 5 year battery warranty cover
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+