ఏళ్ల తరబడి వాడే బైక్స్.. రిపేర్లు చాలా తక్కువ.. రూ.55 వేల నుంచి స్టార్ట్, లీటర్‌కు 70 కిమీల పైనే
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, కొత్తగా టూవీలర్ కొనాలనుకునే చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఖర్చు పరంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు స్టైల్, స్పీడ్, బ్రాండ్ అనే అంశాలు ప్రాధాన్యం కలిగినప్పటికీ, ఇప్పుడు మాత్రం "ఎక్కువ మైలేజ్ - తక్కువ ఖర్చు" అనే ఫార్ములానే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు.. అందరికీ బెస్ట్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో కొన్ని బైక్‌లు ప్రత్యేకంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), టీవీఎస్ రేడియన్ (TVS Radeon), హోండా షైన్ 100 (Honda Shine 100) వంటి మోడళ్లు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తూ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. వీటి గురించి ఈ కథణంలో చూద్దాం.
Hero HF Deluxe: రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో, నమ్మదగిన పనితీరుతో మంచి మైలేజ్ అందించే బైక్‌లలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ఈ బైక్, బడ్జెట్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు, సాధారణ వినియోగదారుల అవసరాలను పూర్తిగా తీర్చగలగడం వల్ల అత్యంత ప్రజాదరణ పొందింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,589 నుంచి ప్రారంభమవడం దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

ఈ బైక్‌లో అమర్చిన 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్, రోజువారీ ప్రయాణాలకు సరిపడే స్థాయిలో పనితీరును అందిస్తుంది. ఇది గరిష్టంగా 8.02 PS పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ ట్రాఫిక్‌లో సులభంగా నడిచేలా సహాయపడుతుంది. మైలేజ్, ARAI ప్రకారం ఈ బైక్ 68-70 kmpl వరకు ఇస్తుందని చెబుతారు. అయితే నిజ జీవిత వినియోగంలో కూడా ఇది సుమారు 60-70 kmpl మధ్య మైలేజ్ అందించడం గమనార్హం.
TVS Radeon: టీవీఎస్ రేడియన్ బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లు అందించే బైక్‌గా నిలుస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ.55,400 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 109.7cc డ్యూరాలైఫ్ ఇంజిన్ ఉండి 8.08 bhp పవర్, 8.7 Nm టార్క్‌ను ఇస్తుంది. ARAI ప్రకారం 73.68 kmpl మైలేజ్ కాగా, వాస్తవంలో 65-72 kmpl మధ్య ఉంటుంది. రోజు ప్రయాణాలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్.

USB ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ డిస్‌ప్లే, కంఫర్ట్ సీటింగ్ వంటి ఫీచర్లు కొన్ని వేరియంట్లలో లభిస్తాయి. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్, 10 లీటర్ ట్యాంక్, సౌకర్యవంతమైన సస్పెన్షన్‌తో రోజువారీ ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ విషయంలో రేడియాన్ మంచి ఎంపికగా నిలుస్తుంది. మీరు మరిన్ని ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటు కోసం చూస్తున్నట్లయితే, రేడియన్ ఒక మంచి ఎంపిక.
Honda Shine 100: బడ్జెట్‌లో సరళమైన, నమ్మదగిన కమ్యూటర్ బైక్ కోసం చూస్తున్న వారికి Honda Shine 100 మంచి ఎంపికగా నిలుస్తుంది. సుమారు రూ. 65,243 ఎక్స్-షోరూమ్ ధరతో లభించే ఈ బైక్, తక్కువ ఖర్చులో మంచి పనితీరు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ప్రత్యేకంగా రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే విధంగా దీని డిజైన్, ఇంజిన్ ట్యూనింగ్ రూపొందించారు.

ఈ బైక్‌లో 98.98 సిసి పెట్రోల్ ఇంజిన్ అమర్చారు, ఇది స్మూత్ పనితీరుతో పాటు సరిపడ శక్తిని అందిస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిపి ఈ ఇంజిన్ నగర ట్రాఫిక్‌లో సులభంగా నడిచేలా చేస్తుంది. లీటర్‌కు సుమారు 65 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగలగడం వల్ల ప్రతిరోజూ ప్రయాణించే వారికి ఇంధన ఖర్చును తగ్గించే అవకాశం ఉంటుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న రోజుల్లో ఇది ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications








