బడ్జెట్ ధరలో మార్కెట్లోకి అదిరిపోయే బైక్ వచ్చేసింది.. దీనిపై వెళ్తే ట్రాఫిక్‌లో అందరూ మీవైపే చూస్తారు!
బ్రిటిష్ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్‌పై తన దృష్టిని మరింతగా కేంద్రీకరిస్తూ, యువ రైడర్లను ఆకట్టుకునే కొత్త మోడళ్లతో ముందుకు వస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కంపెనీ తాజాగా Triumph Speed 400 ఆధారంగా రూపొందించిన స్పీడ్ ట్రాకర్ 400 (Speed tracker 400)ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. రూ. 2.46 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసిన ఈ బైక్, ప్రీమియం సెగ్మెంట్‌లో స్టైల్, పనితీరు రెండింటినీ సమతుల్యం చేసేలా రూపొందించబడింది. ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని డిజైన్. ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ మోడల్, ఒకవైపు ఆధునిక క్లాసిక్ రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు స్పోర్టీ రోడ్-ఫోకస్డ్ సెటప్‌ను అందిస్తుంది. ఈ కలయిక వల్ల బైక్‌కు ఒక ప్రత్యేకమైన స్ట్రీట్ ప్రెజెన్స్ లభిస్తుంది.
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తీసుకొచ్చిన ట్రాకర్ 400లో డిజైన్, ఫీచర్ల పరంగా కనిపించే మెరుగుదలలు ఈ బైక్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మొదటగా చూసినప్పుడే ఆకట్టుకునే అంశం దాని స్టాన్స్. ఫ్లాట్‌గా ఉండే పొడవైన సీటు, సన్నగా ఆకృతీకరించిన ఫ్యూయల్ ట్యాంక్, అలాగే వెనుక భాగంలో పొట్టిగా కట్ చేసిన టెయిల్ సెక్షన్ కలిపి ఈ బైక్‌కు నిజమైన ఫ్లాట్-ట్రాకర్ లుక్‌ను ఇస్తాయి.

ఇది కేవలం స్టైల్ మాత్రమే కాకుండా, రైడర్‌కు మరింత ఫ్రీ మూవ్‌మెంట్, కంఫర్ట్‌ను అందిస్తుంది. ముందుభాగంలో వృత్తాకార LED హెడ్‌ల్యాంప్ క్లాసిక్ టచ్‌ను ఇస్తూనే, ఆధునిక టెక్నాలజీని కూడా ప్రతిబింబిస్తుంది. ట్రాకర్-శైలి సైడ్ ప్యానెల్స్, సీట్ కౌల్, మినిమల్ బాడీవర్క్ కలిసి రెట్రో స్టైలింగ్‌ను మరింత హైలైట్ చేస్తాయి. డిజైన్‌లో అనవసరమైన భాగాలను తగ్గించి, క్లీనుగా, స్పోర్టీగా ఉంచడం వల్ల బైక్ మొత్తం ఒక ప్రత్యేకమైన స్ట్రీట్ ప్రెజెన్స్‌ను పొందింది.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్ పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో నిండి ఉంది. ఫుల్ LED లైటింగ్ సెటప్ రాత్రి ప్రయాణాల్లో మెరుగైన విజిబిలిటీని అందిస్తే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌కు అవసరమైన సమాచారం స్పష్టంగా చూపిస్తుంది. రైడ్-బై-వైర్ థ్రాటిల్ ఇవ్వడం వల్ల థ్రోటిల్ రెస్పాన్స్ మరింత స్మూత్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్, వివిధ రోడ్డు పరిస్థితుల్లో వీల్ స్లిప్‌ను నియంత్రిస్తాయి.

ఇంకా భద్రత పరంగా డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ ఇవ్వడం వల్ల బ్రేకింగ్ సమయంలో స్థిరత్వం మెరుగవుతుంది. ముఖ్యంగా హై స్పీడ్ లేదా ఎమర్జెన్సీ బ్రేకింగ్ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తానికి, ఈ ట్రాకర్ 400లో డిజైన్, కంఫర్ట్, ఆధునిక ఫీచర్లు సమతుల్యంగా కలిపి, ఒక ప్రీమియం రైడింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించారు.ఈ బైక్‌కు శక్తినిచ్చేది బ్రాండ్ అప్‌డేటెడ్ TR-సిరీస్ 350cc సింగిల్-సిలిండర్ ఇంజిన్.
ఇది 8,750 rpm వద్ద 40 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తూ, సిటీ రైడింగ్‌కే కాకుండా ఓపెన్ రోడ్లపై కూడా సరిపడిన పనితీరును అందిస్తుంది. పవర్ డెలివరీ స్మూత్‌గా ఉండేలా ట్యూన్ చేయడంతో, కొత్త రైడర్లు కూడా సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ ఇంజిన్‌ను టార్క్-అసిస్ట్ క్లచ్‌తో జత చేయడం వల్ల క్లచ్ లివర్ యాక్షన్ తేలికగా ఉండటమే కాకుండా, గేర్ మార్పులు చాలా సున్నితంగా జరుగుతాయి.

ట్రాఫిక్‌లో తరచూ గేర్ మార్చాల్సిన పరిస్థితుల్లో ఇది రైడర్‌కు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మొత్తానికి, రోజువారీ ప్రయాణంలో అలసట తగ్గించేలా ఈ సెటప్ పనిచేస్తుంది. డిజైన్ పరంగా మాత్రమే కాదు, రైడింగ్ ఫీల్ పరంగానూ ఈ బైక్ ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. సరళమైన కానీ దూకుడుగా కనిపించే స్టాన్స్, రోడ్డుపై బైక్‌కు ఒక ప్రత్యేకమైన ప్రెజెన్స్‌ను ఇస్తుంది. ఇది చూసిన వెంటనే స్పోర్టీ క్యారెక్టర్‌ను ప్రతిబింబిస్తుంది.
సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందు 43 మిమీ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్, వెనుక భాగంలో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌ను అందించారు. ఇవి రెండూ 140 మిమీ సస్పెన్షన్ ట్రావెల్‌ను అందిస్తూ, గుంతలు, అసమాన రోడ్లపై కూడా మంచి కంఫర్ట్‌ను కల్పిస్తాయి. బ్రేకింగ్ పరంగా ముందువైపు నాలుగు-పిస్టన్ రేడియల్ కాలిపర్‌తో కూడిన డిస్క్ బ్రేక్, వెనుకవైపు ABS సపోర్ట్‌తో కూడిన డిస్క్ సెటప్ ఇచ్చారు. మొత్తానికి ఈ బైక్ ఆకట్టకునే ఫీచర్లతో వచ్చింది.


Click it and Unblock the Notifications








