భారత్‌లో ప్రతిరోజూ 1,200 ఇదే స్కూటర్‌ను కొంటున్నారు.. పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుంది

భారత ఎలక్ట్రిక్ రెండు చక్రాల మార్కెట్లో టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీకి చెందిన టీవీఎస్ ఐక్యూబ్ (iQube) స్కూటర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులు పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతో పాటు, పర్యావరణ హిత వాహనాలపై ఆసక్తి పెరగడం కూడా ఐక్యూబ్ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. 2026 జనవరి నెలలో iQube విక్రయాలు గణనీయమైన స్థాయికి చేరుకున్నాయి. ఒక్క నెలలోనే మొత్తం 37,560 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడటం ఈ స్కూటర్‌పై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఇది గత ఏడాది అదే కాలంలో, అంటే 2025 జనవరిలో 24,991 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రెండింటిని పోలిస్తే సంవత్సరానికి 50.29 శాతం వృద్ధి నమోదవడం విశేషం. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది ఒక బలమైన ప్రదర్శనగా భావించబడుతోంది. అదే విధంగా, 2025 డిసెంబర్ నెలలో 35,137 యూనిట్లు అమ్ముడవగా, ఆ సంఖ్యను కూడా 2026 జనవరిలో అధిగమించడం గమనార్హం.

Tvs Iqube January 2026 Sales Recorded 37560 Units More Details Inside

ముఖ్యంగా జనవరిలో రోజుకు సగటున 1,211 యూనిట్లు అమ్ముడవడం iQube స్థిరమైన డిమాండ్‌ను తెలియజేస్తోంది. పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా ఈ స్థాయిలో విక్రయాలు కొనసాగడం బ్రాండ్ బలాన్ని ప్రతిబింబిస్తోంది. iQube విజయానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిగా, తక్కువ నిర్వహణ ఖర్చులు వినియోగదారులకు పెద్ద ప్రయోజనం. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉండటం కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది.

అదనంగా, దీర్ఘకాల సీర్వీసింగ్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు వంటి అంశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగదారులు కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఆదా మరియు నమ్మకాన్ని కూడా చూస్తున్నారు. ఈ కోణంలో iQube ఒక సమతుల్య ఎంపికగా నిలుస్తోంది. అందుకే ఇది మార్కెట్లో స్థిరంగా మంచి సంఖ్యలో అమ్ముడవుతూ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు భారత వినియోగదారుల మార్పును ప్రతిబింబిస్తోంది.

Tvs Iqube January 2026 Sales Recorded 37560 Units More Details Inside

TVS iQube కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరింత విస్తృతమైన వేరియంట్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్, ప్రయాణ దూరం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీనిని స్టాండర్డ్ iQube, iQube S, iQube ST అనే ఎంపికలలో విడుదల చేసింది. ప్రతి వేరియంట్ ప్రత్యేకమైన ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్‌తో వస్తూ వేర్వేరు రైడర్లను లక్ష్యంగా చేసుకుంది.

స్టాండర్డ్ iQube ధర రూ.1.10 లక్షల నుండి రూ.1.30 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ వేరియంట్ 2.2 kWh, 3.1 kWh, 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 94 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, మధ్యస్థ 3.1 kWh బ్యాటరీతో 123 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 145 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అదే సమయంలో iQube S ధర రూ.1.40 లక్షలు(ఎక్స్-షోరూమ్).

Tvs Iqube January 2026 Sales Recorded 37560 Units More Details Inside

ఈ వేరియంట్‌లో 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌పై 145 కిలోమీటర్లు ఇస్తుంది. దీని బ్యాటరీని కేవలం 3 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. టీవీఎస్ ఐక్యూబ్ ST ధర రూ. 1.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి 5.3 కిలోవాట్ (kWh) సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 212 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 24, 2026, 10:23 [IST]
English summary
Tvs iqube january 2026 sales recorded 37560 units more details inside
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+