ఈ స్కూటర్ కోసం షోరూమ్‌కు వెళ్లకండి! వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోకండి..!
భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ పోటీలో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తన సత్తాను నిరూపించుకుంది. ఒకప్పుడు కొత్తగా భావించిన ఈవీ సెగ్మెంట్‌ను ముందుగానే అంచనా వేసి, టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) రూపంలో వినియోగదారుల ముందుకు తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు మార్కెట్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం చిన్న విషయం కాదు. Ola Electric, Ather Energy, Bajaj Auto వంటి దిగ్గజాల మధ్య నిలబడి, ఐక్యూబ్ తనదైన స్థానం సంపాదించుకుంది. ఇలాంటి విజయోత్సాహం మధ్యలోనే కంపెనీ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, నిశ్శబ్దంగా TVS iQube S వేరియంట్ అమ్మకాలను నిలిపివేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇది అనూహ్యమైన పరిణామం. ఎందుకంటే, ఐక్యూబ్ స్టాండర్డ్, టాప్ ఎండ్ ఎస్టీ వేరియంట్ మధ్య సరిగ్గా బ్యాలెన్స్‌గా నిలిచిన మోడల్ ఎస్ వేరియంట్. ఫీచర్లు, ధర, పనితీరు సమానంగా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ వేరియంట్ లేకపోవడంతో, కొనుగోలుదారులు రెండు ఎంపికల మధ్య నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు కొంతమేర బేసిక్ ఫీచర్లతో వచ్చే స్టాండర్డ్ వేరియంట్, మరోవైపు అధిక ఫీచర్లు, ఎక్కువ ధరతో కూడిన ఎస్టీ వేరియంట్ ఉంటాయి.

మధ్యస్థాయి ఎంపిక లేకపోవడం కొంతమందికి నిరాశ కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, బడ్జెట్ పరంగా సమతుల్యత కోరుకునే వినియోగదారులకు ఇది చిన్న షాక్ అన్న మాట. అయితే ఈ నిర్ణయం వెనుక కంపెనీ వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉత్పత్తి సరళీకరణ కోసం ఈ నిర్ణయం తీసుకుందా? లేక భవిష్యత్తులో కొత్త అప్‌డేటెడ్ వేరియంట్‌ను తీసుకురావాలనే ప్లాన్ ఉందా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
కానీ ఒక విషయం మాత్రం ఖాయం, మార్కెట్‌లో ముందంజలో ఉన్నప్పటికీ, iQube లైన్‌ప్‌లో చేసిన ఈ మార్పు వినియోగదారుల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అందరి చూపు టీవీఎస్ తదుపరి అడుగుపైనే ఉంది. ఈ నిశ్శబ్ద నిర్ణయం వెనుక ఉన్న అసలు కథ బయటపడే వరకు, మార్కెట్‌లో ఈ చర్చ ఆగేలా కనిపించడం లేదు. టీవీఎస్ మోటార్ అధికారిక వెబ్‌సైట్ నుండి ఐక్యూబ్ ఎస్ వేరియంట్ పేరును తొలగించారు.

TVS iQube S సుమారు రూ. 1.32 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చింది. ఇందులో ఇచ్చిన 3.5kWh బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 145 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండటం, రోజువారీ ఉపయోగానికి ఇది ఎంత ఉపయోగకరమో చూపిస్తుంది. అంతేకాదు, గంటకు 78 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది సిటీ రైడ్స్‌కే కాదు, కొంతవరకు హైవే వినియోగానికి కూడా సరిపోయేలా ఉండేది.
ఫీచర్ల విషయానికి వస్తే,ఇది నిజంగా తన క్లాస్‌లో ఒక స్టెప్ ముందే ఉండేది. 7-అంగుళాల TFT డిస్‌ప్లే, నావిగేషన్, Q-పార్క్ అసిస్ట్ వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు, 17.78 సెం.మీ టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ వినియోగదారులకు ఒక ప్రీమియం అనుభూతిని ఇచ్చేది. ముఖ్యంగా TVS SmartXonnect కనెక్టివిటీతో వచ్చే ఈ సిస్టమ్, స్కూటర్‌ను ఒక స్మార్ట్ డివైస్‌లా మార్చేసింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, ఇదే S వేరియంట్ నిలిపివేతకు కారణమైంది.

ఎందుకంటే చాలా మంది వినియోగదారులు స్టాండర్డ్ వేరియంట్ కన్నా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి, కానీ టాప్ ఎండ్ ఎస్టీ వేరియంట్ కన్నా తక్కువ ధరలో ఉండే ఈ 'ఎస్' వేరియంట్‌ను ఎంచుకుంటున్నరు. ఇది మిగతా రెండు వేరియంట్ల అమ్మకాలపై ప్రభావం పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ తన ప్రోడక్ట్ లైన్‌ను సింప్లిఫై చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే, వినియోగదారులను స్పష్టంగా రెండు ఎంపికలను ఎంచుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications