చరిత్ర సృష్టించిన స్కూటర్.. రోజుకు కేవలం రూ.3 తో 30 కి.మీ..! ప్రతి ఒక్కరూ కొంటున్నారు
భారత టూ-వీలర్ మార్కెట్ ఇప్పటివరకు ప్రధానంగా పెట్రోల్ వాహనాల ఆధిపత్యంలోనే కొనసాగుతోంది. హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా వంటి లెజెండరీ మోడళ్లు సంవత్సరాలుగా అమ్మకాల జాబితాలో అగ్రస్థానాల్లో ఉంటూ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అయితే ఈ స్థిరమైన ట్రెండ్‌ను మార్చే స్థాయిలో టీవీఎస్ ఐక్యూబ్ (Tvs iqube) ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి సవాల్ విసురుతోంది. డిసెంబర్ 2025 నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ద్విచక్ర వాహనాల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌గా టీవీఎస్ ఐక్యూబ్ నిలిచింది. ఇది ఎలక్ట్రిక్ వాహన రంగానికి మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ టూ-వీలర్ మార్కెట్‌కు ఒక కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
పెట్రోల్ స్కూటర్లు, బైక్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్న జాబితాలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ నిలదొక్కుకోవడం అనేది వినియోగదారుల ఆలోచనల్లో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తోంది. ప్రత్యేకంగా కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఐక్యూబ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో పెద్ద ఎత్తున ఆదరణ పొందుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను మళ్లిస్తున్నాయి.

ఈ మార్పును సరిగ్గా ఉపయోగించుకున్న టీవీఎస్, ఐక్యూబ్‌ను ఒక మాస్ ఫ్యామిలీ స్కూటర్‌గా స్థిరపరిచింది. హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా వంటి దశాబ్దాల చరిత్ర కలిగిన మోడళ్లతో పోటీ పడుతూ, వాటి మధ్య ఐక్యూబ్ తన స్థానం సంపాదించుకోవడం ఎలక్ట్రిక్ టెక్నాలజీపై వినియోగదారుల నమ్మకం ఎంతగా పెరిగిందో తెలియజేస్తోంది. డిసెంబర్ 2025 నెలలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అసాధారణ ప్రదర్శన కనబరిచింది.
ఒక్క నెలలోనే టీవీఎస్ మొత్తం 35,177 ఐక్యూబ్ యూనిట్లను విక్రయించి మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. గత ఏడాది డిసెంబర్ 2024లో అమ్ముడైన 20,003 యూనిట్లతో పోలిస్తే, ఈసారి ఐక్యూబ్ 75.86 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో అమ్మకాల పరంగా 15,174 యూనిట్ల వాల్యూమ్ పెరుగుదల సాధించిందన్న మాట. బజాజ్ చేతక్, ఓలా ఎలక్ట్రిక్ వంటి బలమైన ప్రత్యర్థులను కూడా వెనక్కి నెట్టి టీవీఎస్ ముందంజలో నిలిచింది.

టీవీఎస్ ఐక్యూబ్ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో శక్తిని పొందుతుంది. iQube 3.1 వేరియంట్ గరిష్టంగా 82 కి.మీ వేగాన్ని అందుకోగలగడం విశేషం. బ్యాటరీ ఛార్జింగ్ పరంగా చూస్తే, 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి సుమారు 3 నుంచి 4.5 గంటల సమయం మాత్రమే పడుతుంది. మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో, టీవీఎస్ తక్కువ ధరలో iQube 2.2kWh వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఒక పెట్రోల్ స్కూటర్‌ను 50,000 కి.మీ నడపాలంటే సుమారు లక్ష రూపాయల వరకు ఇంధన ఖర్చు అవుతుందని అంచనా. అదే దూరాన్ని TVS iQubeతో ప్రయాణిస్తే ఖర్చు కేవలం రూ.6,466 మాత్రమేనని కంపెనీ చెబుతోంది. రోజువారీ ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం రూ.6.30 మాత్రమే. యూనిట్‌కు రూ.7 నుంచి రూ.8 వరకు విద్యుత్ రేటు ఉంటుందని భావిస్తే, బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.15.40 మాత్రమే.

iQube ఎంట్రీ-లెవల్ వేరియంట్ IDC ప్రకారం 94 కి.మీలు. సగటున 70 నుంచి 75 కి.మీ వరకు రేంజ్‌తో ఒక్క కిలోమీటర్ నడపడానికి అయ్యే ఖర్చు దాదాపు 21 పైసలే. రోజుకు 30 కి.మీ ప్రయాణించే వ్యక్తికి మొత్తం ఖర్చు రూ.6.30 మాత్రమే. అదే వ్యక్తి పెట్రోల్ స్కూటర్ ఉపయోగిస్తే నెలకు దాదాపు రూ.2,268 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐక్యూబ్ 145 కి.మీ వరకు ప్రయాణించగలదు.


Click it and Unblock the Notifications








