జూపిటర్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. షోరూమ్‌కు వెళ్లే ముందు ఈ విషయం తప్పక తెలుసుకోండి
టీవీఎస్ జూపిటర్ 110 (Tvs Jupiter 110) భారత మార్కెట్‌లో చాలా కాలంగా ఒక నమ్మకమైన, ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా నిలిచింది. రోజువారీ ప్రయాణాలకు ఇది ఎంతగానో అనుకూలంగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, అలాగే మంచి మైలేజ్ అందించడం వల్ల అన్ని వర్గాల వినియోగదారుల నుంచి దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే ప్రతి నెలా ఈ స్కూటర్ మంచి అమ్మకాలు నమోదు చేస్తూ మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. ఇప్పటికే జూపిటర్‌ను వినియోగిస్తున్న కస్టమర్లు కూడా దీని పనితీరు, సౌకర్యాలపై సంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టీవీఎస్ కంపెనీ జూపిటర్ 110 స్కూటర్ ధరలను సవరించింది. ప్రస్తుతం ఈ స్కూటర్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ప్రతి వేరియంట్‌పై కొంత ధర పెంపు జరిగింది.
ప్రాథమికంగా వచ్చే డ్రమ్ వేరియంట్ ధర రూ.750 పెరిగి ఇప్పుడు రూ.73,400కు చేరుకుంది. ఇంతకుముందు ఇది రూ.72,650గా ఉండేది. అలాగే డ్రమ్ అల్లాయ్ వేరియంట్‌పై రూ.550 పెంపుతో కొత్త ధర రూ.78,000గా నిర్ణయించారు. పాత ధరతో పోలిస్తే ఇది పెరుగుదలే, ఎందుకంటే గతంలో ఈ వేరియంట్ ధర రూ.77,450 మాత్రమే. ఇక కొంచెం అధిక ఫీచర్లతో వచ్చే డ్రమ్ SXC వేరియంట్ ధరను కూడా టీవీఎస్ పెంచింది.

ఈ వేరియంట్‌పై రూ.850 పెరిగి ప్రస్తుతం రూ.82,100కు చేరింది. గతంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.81,250 గా ఉండేది. డిస్క్ SXC వేరియంట్ ధర రూ.84,750 ధరకు లభిస్తోంది. ఇది జూపిటర్ 110లో అత్యంత ఆకర్షణీయంగా భావించే స్పెషల్ ఎడిషన్ వేరియంట్.
డిస్క్ SXC B.E వేరియంట్ ధరను రూ.1,250 పెంచడంతో ప్రస్తుతం దీని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.86,900గా ఉంది. ఇంతకు ముందు ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ.85,650గా ఉండేది. మొత్తం మీద చూస్తే, అన్ని వేరియంట్లపై ధరలు పెరిగినా, జూపిటర్ 110 అందించే నమ్మకం, మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ స్కూటర్‌కు డిమాండ్ తగ్గే అవకాశం తక్కువగానే ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

టీవీఎస్ జూపిటర్ 110 ఇప్పుడు మరింత ఆధునికమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కొత్త స్టైలింగ్ కారణంగా ఈ స్కూటర్ రోడ్డు మీద చూసిన వెంటనే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందుభాగంలో అందంగా కనిపించే LED హెడ్‌ల్యాంప్, స్లీక్ టర్న్ ఇండికేటర్లు, వెనుకవైపు LED టెయిల్ లాంప్‌లు దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. మొత్తం డిజైన్ నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా, అన్ని వయసుల రైడర్లకు నచ్చేలా రూపొందించబడింది.
ఈ కొత్త జూపిటర్ స్కూటర్‌లో శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను అందించారు. ఇందులో 113 సిసి సామర్థ్యం గల సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండగా, ఇది 8.02 PS హార్స్‌పవర్, 9.8 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ రోజువారీ రైడింగ్‌కు సరిపోయే పనితీరుతో పాటు మంచి పికప్‌ను ఇస్తుంది. ముఖ్యంగా మైలేజ్ విషయంలో జూపిటర్ ఎప్పటిలాగే ముందంజలోనే ఉంది. ఇది లీటర్‌కు సుమారు 50 కిలోమీటర్ల వరకు అందిస్తుంది.

పనితీరు విషయానికి వస్తే, ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 82 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. అంతేకాదు, కేవలం 8.29 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. ఫీచర్ల పరంగా పూర్తి డిజిటల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, ఇంజిన్ కిల్ స్విచ్, iGO అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు వంటి సౌకర్యాలు ఆధునిక అవసరాలకు సరిపోతాయి.


Click it and Unblock the Notifications








