రూ.90 వేలకే 84 కి.మీ మైలేజ్ స్కూటర్.. ఇంత మైలేజ్ ఇప్పటివరకు లేదు! Tvs నుంచి సంచలనం

భారత స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్‌ (Tvs Jupiter)కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హోండా యాక్టివాకు ప్రత్యక్ష పోటీదారుగా నిలిచిన ఈ స్కూటర్, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. నమ్మకమైన పనితీరు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి అంశాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే కుటుంబ వినియోగదారుల నుంచి యువత వరకు చాలా మంది జూపిటర్‌ను ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజయవంతమైన స్కూటర్‌ను మరో అడుగు ముందుకు తీసుకెళ్లే దిశగా టీవీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలో టీవీఎస్ జూపిటర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ ఇంధన ఖర్చులతో ప్రయాణించాలనే వినియోగదారుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని, జూపిటర్ CNG స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ ప్రణాళిక ప్రకారమే జరిగితే, కొత్త టీవీఎస్ జూపిటర్ CNG స్కూటర్ అతి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ ఏప్రిల్ నెల నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

Tvs Jupiter Cng Scooter Launch Soon In India Here Expected Price And Mileage Details

అయితే ఇప్పటివరకు దీనిపై టీవీఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఆటో రంగంలో ఈ స్కూటర్‌పై ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది. ధర విషయానికి వస్తే, టీవీఎస్ జూపిటర్ CNG స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,000 నుంచి రూ. 1 లక్ష మధ్య ఉండవచ్చని అంచనా. ఈ ధర శ్రేణిలో లాంచ్ అయితే, ఇది రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కూడిన మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.

ఈ స్కూటర్‌ను జనవరి 2025లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అధికారికంగా ప్రదర్శించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. టీవీఎస్ జూపిటర్ CNG 124.8-cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7.1 bhp హార్స్‌పవర్‌ 9.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర ప్రయాణాలకు సరిపడే పవర్‌తో పాటు మృదువైన రైడింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ సెటప్‌ను ట్యూన్ చేశారు.

Tvs Jupiter Cng Scooter Launch Soon In India Here Expected Price And Mileage Details

ఇంధన వ్యవస్థ విషయానికి వస్తే, ఇందులో 1.4 కిలోల CNG ట్యాంక్‌తో పాటు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌ను కూడా అందించారు. దీని వల్ల అవసరాన్ని బట్టి CNG లేదా పెట్రోల్ మోడ్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా CNG మోడ్‌లో ఈ స్కూటర్ ఒక్క కిలోమీటర్‌కు సుమారు 84 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది రోజువారీ ఖర్చులను గణనీయంగా తగ్గించే అంశంగా చెప్పుకోవచ్చు.

CNG, పెట్రోల్ రెండింటినీ కలిపి ఉపయోగించినప్పుడు, ఈ స్కూటర్ మొత్తం 226 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని టీవీఎస్ వెల్లడించింది. దూర ప్రయాణాల్లోనూ రేంజ్ టెన్షన్ లేకుండా వినియోగదారులు నిశ్చింతగా ప్రయాణించేలా ఈ డ్యూయల్-ఫ్యూయల్ కాన్సెప్ట్ ఉపయోగపడనుంది. మొత్తంగా, జూపిటర్ CNG స్కూటర్ తక్కువ ఖర్చు, మెరుగైన మైలేజీ, వినూత్న సాంకేతికతలతో భారత స్కూటర్ మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని చెప్పవచ్చు.

Tvs Jupiter Cng Scooter Launch Soon In India Here Expected Price And Mileage Details

దీనిలో అందించిన ఫీచర్లను చూసినట్లయితే, ముందు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. అలాగే సేఫ్టీకి సైడ్-స్టాండ్ ఇండికేటర్, USB ఛార్జర్, TVS కనెక్ట్ యాప్ వంటి వాటిని కలిగి ఉంది. ఇది రైడర్‌కు గరిష్ట రక్షణను అందించే అవకాశం ఉంది. భద్రత కోసం, ఇది ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక 3-స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 29, 2026, 15:05 [IST]
English summary
Tvs jupiter cng scooter launch soon in india here expected price and mileage details
Read more on: #tvs motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+