ఏడాదికి 14లక్షలు.. రోజుకు 4009 స్కూటర్లు అమ్ముడుపోతున్న స్కూటర్.. ఇది దేశంలోనే రెండో ది బాసూ !

భారతదేశంలో టూ వీలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హోండా యాక్టీవా. దశాబ్దాలుగా తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న యాక్టివా కోటను ఇప్పుడు ఒక స్వదేశీ స్కూటర్ బ్రేక్ చేస్తోంది. అదే టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter). మధ్యతరగతి భారతీయుడికి నమ్మకమైన నేస్తంలా మారిన ఈ స్కూటర్, అమ్మకాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

జూపిటర్ జోరు చూస్తుంటే భవిష్యత్తులో నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం ఒక్క ఏడాదిలోనే లక్షలాది మంది కస్టమర్లను ఆకర్షించిన ఈ స్కూటర్ విజయగాథ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‎ గా మారింది.

TVS Jupiter Records Massive Growth Sells 4009 Units Daily Challenges Activas Dominance

టీవీఎస్ జూపిటర్ ప్రస్తుతం భారత్‎లో ఒక బ్రాండ్‎గా మారిపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో జూపిటర్ సాధించిన వృద్ధి చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గత 12 నెలల్లో ఈ స్కూటర్ ఏకంగా 14,63,328 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీని అర్థం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ సగటున 4,009 మంది ఈ స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్తున్నారు.

గతేడాది 11 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఏకంగా 32 శాతం వృద్ధిని సాధించి, 10 లక్షల మైలురాయిని వరుసగా రెండో ఏడాది కూడా దాటేసింది. టీవీఎస్ కంపెనీ మొత్తం స్కూటర్ అమ్మకాల్లో 64 శాతం వాటా ఒక్క జూపిటర్ దేనంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

TVS Jupiter Records Massive Growth Sells 4009 Units Daily Challenges Activas Dominance

సెప్టెంబర్ 16, 2013న కేవలం 110 సీసీ మోడల్ గా ప్రవేశపెట్టిన జూపిటర్, నేడు దేశంలో 90 లక్షల (9 మిలియన్) యూనిట్ల టోకు అమ్మకాల మైలురాయిని దాటింది. ప్రారంభంలో కేవలం మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకుని తెచ్చిన ఈ మోడల్, ఆ తర్వాత యువతను ఆకట్టుకోవడానికి 125 సీసీ వేరియంట్ లో కూడా వచ్చింది.

కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాలకు కూడా ఈ స్కూటర్ ను ఎగుమతి చేస్తున్నారు. గత 13 ఏళ్లలో సుమారు 1.54 లక్షల యూనిట్లు ఇతర దేశాలకు ఎగుమతి కావడం విశేషం. జూపిటర్ విజయంలో దాని ఫీచర్లు కీలక పాత్ర పోషించాయి. అక్టోబర్ 2025లో వచ్చిన అప్‌డేట్ లో ఈ స్కూటర్ ను టెక్నాలజీ పరంగా మరింత బలోపేతం చేశారు.

TVS Jupiter Records Massive Growth Sells 4009 Units Daily Challenges Activas Dominance

ఇందులో మైక్రో-హైబ్రిడ్ సిస్టమ్, సీటు కింద ఏకంగా 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. అంటే రెండు హెల్మెట్లు సునాయాసంగా పడతాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లే, మెరుగైన ఇంజిన్ పవర్ (7.91 bhp) దీని ప్రత్యేకత. సిటీలో లీటరుకు 50 కిలోమీటర్లు, హైవేపై 56 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండటంతో జనం దీనికి ఫిదా అవుతున్నారు.

ఎన్‌టార్క్ స్కూటర్ సక్సెస్ తర్వాత టీవీఎస్ అక్టోబర్ 2021లో జూపిటర్ 125 మోడల్ ను లాంచ్ చేసింది. తన విభాగంలోనే అత్యంత పొడవైన సీటు, మస్కులర్ స్టైలింగ్ మరియు అద్భుతమైన మైలేజీతో ఇది దూసుకుపోతోంది. ఈ 125 సీసీ మోడల్ కి కూడా అక్టోబర్ 2025లో భారీ అప్‌డేట్స్ ఇచ్చారు.

హోండా యాక్టివా, హీరో డెస్టినీ, సుజుకి యాక్సెస్ వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీనిస్తోంది. రూ. 73,400 నుంచి రూ. 87,800 ధరల మధ్య లభిస్తున్న ఈ స్కూటర్, వాల్యూ ఫర్ మనీ అనిపించుకుంటోంది.

Article Published On: Wednesday, April 29, 2026, 8:15 [IST]
English summary
Tvs jupiter records massive growth sells 4009 units daily challenges activas dominance
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+