ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కిలోమీటర్లు పక్కా..కేవలం రూ.55,400లకే టీవీఎస్ టాప్-3 బడ్జెట్ బైక్స్

ప్రస్తుతం పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆఫీసుకో, కాలేజీకో వెళ్లాలంటే పెట్రోల్ బిల్లు చూసి గుండె జారిపోతోంది. ఇలాంటి సమయంలో అందరూ వెతికేది ఒకటే.. తక్కువ ధరలో రావాలి, మైలేజీలో తోపు అయి ఉండాలి. సరిగ్గా ఇదే పాయింట్‌ను క్యాచ్ చేసిన టీవీఎస్ (TVS) మోటార్స్, సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా మూడు అదిరిపోయే బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది.

కేవలం రూ.55,400 ప్రారంభ ధరతో లభించే ఈ బైక్‌లు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఏకంగా 800 కిలోమీటర్ల వరకు ఆగకుండా పరుగులు తీస్తాయి. 2026లో మీరు కొత్త బైక్ కొనాలనుకుంటే, టీవీఎస్ అందిస్తున్న ఈ మైలేజీ కింగ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్స్ తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లను తయారు చేయడంలో టీవీఎస్ ఎప్పుడూ ముందుంటుంది. 2026లో కూడా ఈ కంపెనీ నుంచి వస్తున్న మూడు మోడళ్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అవేంటో వివరంగా చూద్దాం.

TVS Mileage Bikes Rule 2026 800 Km Range at Just Rs 55 400 Price

1. టీవీఎస్ రేడియాన్ (TVS Radeon)
టీవీఎస్ రేడియాన్ అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అది ఒక పక్కా లోకల్ పవర్‌హౌస్. దీని ప్రారంభ ధర రూ.55,400 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్‌ను పల్లెటూళ్లలో ఉన్న గతుకుల రోడ్లపై నడిపినా, పట్టణాల్లోని ట్రాఫిక్‌లో నడిపినా దీని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.ఇందులో 109.7cc డ్యురా లైఫ్ ఇంజిన్ ఉంది. ఇది చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా ఇంజిన్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఈ బైక్ లీటరుకు దాదాపు 73.68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు. అంటే ఒక్కసారి ట్యాంక్ నింపితే మీరు ఏకంగా 700 నుంచి 800 కిలోమీటర్ల వరకు నిశ్చింతగా ప్రయాణించవచ్చు. దీని సీటు చాలా పొడవుగా, మెత్తగా ఉంటుంది, దీనివల్ల వెనుక కూర్చునే వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. మెటల్ బాడీ కావడంతో బైక్ చాలా కాలం మన్నిక వస్తుంది.

TVS Mileage Bikes Rule 2026 800 Km Range at Just Rs 55 400 Price

2. టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
మైలేజీ అంటే టీవీఎస్ స్పోర్ట్.. టీవీఎస్ స్పోర్ట్ అంటే మైలేజీ! అనే రేంజ్ లో దీనికి పేరు ఉంది. దీని ధర రూ. 55,500 వద్ద ప్రారంభమవుతుంది. యువతను, ఆఫీస్‎కు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని దీనిని లైట్ వెయిట్ గా డిజైన్ చేశారు. ఇందులో కూడా 109.7cc ఇంజిన్ ఉన్నప్పటికీ, దీని బాడీ వెయిట్ తక్కువగా ఉండటం వల్ల మైలేజీ అదిరిపోతుంది.

టీవీఎస్ స్పోర్ట్ ఏకంగా 80 కిలోమీటర్ల మైలేజీని (క్లెయిమ్డ్) ఇస్తుంది. అంటే ఈ రోజుల్లో ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ట్రాఫిక్ లో బైక్ ను వంచాలన్నా, తిప్పాలన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అందుకే సిటీ రైడర్స్ కి ఇది మొదటి ఛాయిస్.

TVS Mileage Bikes Rule 2026 800 Km Range at Just Rs 55 400 Price

3. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus)
మీకు మైలేజీతో పాటు కొంచెం స్టైలిష్ లుక్ కూడా కావాలంటే స్టార్ సిటీ ప్లస్ సరైన ఎంపిక. దీని ధర రూ.72,200. ఇది కొంచెం ప్రీమియం లుక్ లో కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లాంప్స్, డిజిటల్ అనలాగ్ కన్సోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. మైలేజీ విషయంలో ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

కంపెనీ లెక్కల ప్రకారం ఇది సుమారు 83.09 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని సస్పెన్షన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, గుంతల రోడ్లపై వెళ్తున్నప్పుడు కూడా కుదుపులు తక్కువగా అనిపిస్తాయి. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి ఇది చాలా సేఫ్, కంఫర్టబుల్ బైక్.

మీ బడ్జెట్ తక్కువగా ఉండి, రోజువారీ అవసరాలకు ఒక నమ్మకమైన బైక్ కావాలనుకుంటే టీవీఎస్ రేడియాన్ లేదా స్పోర్ట్ ఎంచుకోవచ్చు. అదే మీకు కొంచెం స్టైల్ కూడా తోడవ్వాలి అనుకుంటే స్టార్ సిటీ ప్లస్ బెస్ట్. 2026లో హీరో స్ప్లెండర్ లేదా హోండా షైన్ కొనే ముందు ఈ బైక్‌లను ఒక్కసారి టెస్ట్ రైడ్ చేసి చూడండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 27, 2026, 9:13 [IST]
English summary
Tvs mileage bikes rule 2026 800 km range at just rs 55 400 price
Read more on: #tvs #tvs motor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+