కుర్చీ కోసం కొట్లాట.. ఓలాను వెనక్కి నెట్టి నంబర్ 1 సీటెక్కిన టీవీఎస్.. ఏడాదికి 3.41 లక్షల స్కూటర్లు అంటే మామూల

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెను సంచలనం నమోదైంది. నిన్న మొన్నటి వరకు ఈవీ (EV) రంగం అంటే కేవలం కొత్త స్టార్టప్ కంపెనీలదే హవా అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ, ఒక వెటరన్ కంపెనీ రాకెట్ వేగంతో దూసుకొచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విక్రయాల గణాంకాలు పరిశీలిస్తే, టీవీఎస్ మోటార్స్ (TVS Motors) టాప్ ప్లేస్ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఓలా, ఏథర్ వంటి కంపెనీలు మార్కెటును ఓ ఊపు ఊపగా, ఇప్పుడు టీవీఎస్ తన నమ్మకమైన సర్వీస్, అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్ల మనసు గెలుచుకుంది. కేవలం 365 రోజుల్లో 3.41 లక్షల స్కూటర్లను విక్రయించి, ఈ సెగ్మెంట్‌లో 3 లక్షల మార్కును దాటిన ఏకైక కంపెనీగా రికార్డు క్రియేట్ చేసింది.

టీవీఎస్ మోటార్స్
ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్స్ వృద్ధి రేటును పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. 2025 ఆర్థిక సంవత్సరంలో 2,37,929 వాహనాలను విక్రయించిన టీవీఎస్ కంపెనీ, ఈ ఏడాది ఏకంగా 3,41,513 యూనిట్లను అమ్మేసింది. అంటే సుమారు 43.54 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) మోడల్ కస్టమర్లకు బాగా దగ్గరైంది. ఫ్యామిలీస్ కు అనువుగా ఉండే డిజైన్, నమ్మకమైన బ్యాటరీ ప్యాక్, దేశవ్యాప్తంగా ఉన్న సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ టీవీఎస్ ను ఈ రేసులో విజేతగా నిలబెట్టాయి. మార్కెట్ లో టీవీఎస్ వాటా ఇప్పుడు 24.36 శాతానికి చేరుకుంది.

tvs motors crowns as indias electric two-wheeler king in fy26 ola faces massive sales drop

బజాజ్, ఏథర్
రెండో స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. బజాజ్ చేతక్ (Chetak) స్కూటర్ ద్వారా ఈ కంపెనీ 2,89,349 యూనిట్లను విక్రయించింది. గతేడాది కంటే 25 శాతం వృద్ధిని సాధించినప్పటికీ, టీవీఎస్ దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. మూడో స్థానంలో ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏకంగా 82 శాతం వృద్ధి రేటుతో 2,39,178 స్కూటర్లను అమ్మి తన సత్తా చాటింది. అయితే మొదటి మూడు స్థానాల్లో ఉన్న కంపెనీల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, టీవీఎస్ మాత్రం 3 లక్షల మార్కును దాటి అందరికంటే ముందు నిలిచింది.

ఓలా ఎలక్ట్రిక్
ఒకప్పుడు ఈవీ మార్కెటును శాసించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఓలా అమ్మకాలు ఏకంగా 52.28 శాతం పడిపోయాయి. గతేడాది 3.44 లక్షల స్కూటర్లను అమ్మిన ఓలా, ఈ ఏడాది కేవలం 1,64,295 యూనిట్లకే పరిమితమైంది. సాఫ్ట్‌వేర్ సమస్యలు, సర్వీస్ సెంటర్ల దగ్గర కస్టమర్ల నిరసనలు, క్వాలిటీ ఇష్యూస్ ఓలాను నాలుగో స్థానానికి పడేశాయి. మరోవైపు హీరో విడా (Hero Vida) మాత్రం 196 శాతం వృద్ధితో 1.44 లక్షల వాహనాలను విక్రయించి ఓలా కు గట్టి పోటీనిస్తోంది.

tvs motors crowns as indias electric two-wheeler king in fy26 ola faces massive sales drop

మెరిసిన స్టార్టప్స్
పెద్ద కంపెనీల మధ్య చిన్న చిన్న స్టార్టప్స్ కూడా తమ ముద్ర వేస్తున్నాయి. రివర్ ఈవీ (River EV) అనే సంస్థ ఏకంగా 426 శాతం వృద్ధిని సాధించి 22,354 వాహనాలను విక్రయించింది. దీనిని స్కూటర్ల ఎస్‌యూవీ అని పిలుస్తుండటం విశేషం. ఇక ఈ-స్ప్రెంటో (e-Sprinto) అనే కంపెనీ ఏకంగా 792 శాతం అసాధారణ వృద్ధిని నమోదు చేసి 12,582 వాహనాలను అమ్మేసింది. సింపుల్ ఎనర్జీ (Simple Energy) కూడా 319 శాతం వృద్ధితో 8,214 స్కూటర్లను విక్రయించి రేసులో నిలిచింది. చిన్న పట్టణాల్లో చౌకగా లభించే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడమే వీటికి కలిసొచ్చింది.

మార్కెట్ లో పెరుగుతున్న అవగాహన
మొత్తం మీద 2026 ఆర్థిక సంవత్సరంలో 14 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ ధరల భారం, ప్రభుత్వ రాయితీలు (Subsidies) ప్రజలను ఈవీల వైపు మళ్ళిస్తున్నాయి. అయితే, కస్టమర్లు ఇప్పుడు కేవలం లుక్ చూసి మాత్రమే కాకుండా, ఏ కంపెనీ మంచి సర్వీస్ ఇస్తోంది? ఏ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది? అన్న విషయాలను కూడా గమనిస్తున్నారు. అందుకే అనుభవం ఉన్న టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు ఇప్పుడు నంబర్ వన్ స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రేసు మరింత ఆసక్తికరంగా మారనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 9, 2026, 19:58 [IST]
English summary
Tvs motors crowns as indias electric two wheeler king in fy26 ola faces massive sales drop
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+