స్మార్ట్‌ఫోన్ ధరకే స్కూటర్..లీటరు పెట్రోల్ ఖర్చుతో నెలంతా తిరిగేయండి..టీవీఎస్ ఆర్బిటర్ ఫీచర్లు మామూలుగా లేవు
భారతదేశపు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor), సామాన్యుల కలలను సాకారం చేస్తూ మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే తన ఐక్యూబ్ (iQube) మోడల్‌తో ఓలా, ఏథర్ వంటి దిగ్గజాలకు చమటలు పట్టించిన టీవీఎస్, ఇప్పుడు బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లను కోరుకునే వారి కోసం ఆర్బిటర్ (Orbiter) శ్రేణిలో సరికొత్త బేస్ మోడల్ టీవీఎస్ ఆర్బిటర్ V1 (TVS Orbiter V1)ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే లభించే ఈ స్కూటర్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.
ఏమిటీ BaaS మాయాజాలం?
టీవీఎస్ ఆర్బిటర్ V1 ఇంత తక్కువ ధరకే లభించడానికి ప్రధాన కారణం కంపెనీ ప్రవేశపెట్టిన బ్యాటరీ యాస్-ఏ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో సగానికి పైగా బ్యాటరీ ఖర్చే ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో కస్టమర్లు బ్యాటరీ ధరను ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం స్కూటర్ బాడీకి మాత్రమే ధర చెల్లిస్తే సరిపోతుంది.

బ్యాటరీ కోసం నెలకు కేవలం రూ.862 నుంచి ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లపై ఒకేసారి ఆర్థిక భారం పడదు. పైగా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో 5 ఏళ్ల వరకు లేదా 70,000 కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ (Extended Warranty) కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ పద్ధతి కాకుండా బ్యాటరీతో కలిపి మొత్తం నగదు చెల్లించి కొనాలనుకుంటే, దీని ధర సుమారు రూ.84,500 వరకు ఉంటుంది.
పర్ఫార్మెన్స్, ఛార్జింగ్ విశేషాలు
టీవీఎస్ ఆర్బిటర్ V1 లో 1.8kWh సామర్థ్యం కలిగిన పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులకు లేదా మార్కెట్ పనులకు వెళ్లే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ స్కూటర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే దీని ఛార్జింగ్ సమయం.

కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు నింపేయవచ్చు. అంటే మీరు ఇంట్లో పనులన్నీ ముగించుకునే లోపే మీ స్కూటర్ ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది. మరిన్ని ఫీచర్లు కోరుకునే వారి కోసం ఆర్బిటర్ V2 వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది 3.1kWh బ్యాటరీతో ఏకంగా 158 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
టెక్నాలజీలో కింగ్
ధర తక్కువైనా ఫీచర్లలో టీవీఎస్ ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో అత్యాధునిక ఎల్‌సీడీ క్లస్టర్ (LCD Cluster) ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా దీనిని కనెక్ట్ చేస్తే టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం లభిస్తుంది. అంతేకాకుండా ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్, యాంటీ-థెఫ్ట్ అలారం, క్రాష్ అలర్ట్, జియో-ఫెన్సింగ్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట లేదా వాలుగా ఉన్న రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు మీ మూడ్‌ను బట్టి ఎకో (Eco) లేదా పవర్ (Power) మోడ్‌లను ఎంచుకోవచ్చు. పార్కింగ్ చేయడంలో ఇబ్బంది కలగకుండా రివర్స్ ఫంక్షన్ (Parking Assist) కూడా ఇచ్చారు.
సబ్సిడీ పోకముందే పట్టేయండి
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న భారీ సబ్సిడీ (PM E-DRIVE) గడువు మార్చి 31, 2026తో ముగియనుంది. ఈ లోపే కారు లేదా బైక్ కొనుగోలు చేస్తే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి సబ్సిడీ తగ్గిపోవడం వల్ల ఈ ఆర్బిటర్ ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
34 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్, విశాలమైన ఫ్లాట్ సీటు,స్టైలిష్ డిజైన్‌తో వస్తున్న ఈ స్కూటర్, పెట్రోల్ స్కూటర్ల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలకనుంది. యమహాను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కంపెనీగా ఎదిగిన టీవీఎస్, ఈ ఆర్బిటర్ V1తో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








