స్ప్లెండర్‌కు పోటీగా రూ. 56 వేలకే బైక్.. 73.68 కి.మీ మైలేజ్! హైట్ తక్కువైనా ఈజీగా నడపొచ్చు
భారతీయ మార్కెట్లో బైక్ కొనుగోలు చేసే చాలా మంది వినియోగదారుల మొదటి ప్రాధాన్యం మైలేజీకే ఉంటుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, వ్యాపార పనుల కోసం ఎక్కువగా ప్రయాణించే వారు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేవారు ఇలా ప్రతి వర్గానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లగల బైక్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో 100 సీసీ నుంచి 110 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లే ముందుంటున్నాయి. ఇవి తక్కువ ఇంధన వినియోగంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గించడంతో మధ్యతరగతి, ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా వీటినే ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో "మంచి మైలేజీతో పాటు బడ్జెట్‌లో దొరికే బైక్ ఏది?" అనే ప్రశ్నతో చాలా మంది షోరూమ్‌లకు వెళ్తున్నారు.
ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు తమ తమ పోర్ట్‌ఫోలియోలో అధిక మైలేజీ ఇచ్చే మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా లాంటి బైక్‌లు ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకోగా, TVS కూడా తన ప్రత్యేక శైలిలో వినియోగదారులను ఆకట్టుకునే మోడళ్లను తీసుకొచ్చింది. అలాంటి బైక్‌లలో టీవీఎస్ రేడియన్ (TVS Radeon) ఒకటి.

సాధారణ కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బైక్, స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి మైలేజీ, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తూ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి రహదారిపై సులభంగా నడిచేలా దీనిని రూపొందించారు. ముఖ్యంగా దీని సింపుల్ డిజైన్, బలమైన బాడీ, పొడవైన సీటు, కంఫర్టబుల్ సస్పెన్షన్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ బైక్‌ను TVS భారత మార్కెట్లో రూ. 56,850 ప్రారంభ ధర నుంచి రూ. 78,200 వరకు విక్రయిస్తోంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఆల్ బ్లాక్ ఎడిషన్' పూర్తిగా బ్లాక్ థీమ్‌తో వస్తూ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఈ వేరియంట్ ధర కేవలం రూ. 56,850 మాత్రమే. 'బేస్ ఎడిషన్'ను కూడా అందిస్తోంది. ఈ వేరియంట్ ధర రూ. 63,350గా నిర్ణయించారు.

టాప్ రెండు వేరియంట్లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేకత. ఆధునిక టచ్ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు TVS ఈ ఫీచర్‌ను జోడించింది. డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ను రూ. 75,950కి కొనచ్చు. మరింత మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోరుకునే వారికి డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ. 78,200 ధరకు అందుబాటులో ఉంది. పనితీరు విషయానికి వస్తే, 109.7 సిసి సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉంది.
ఈ ఇంజన్ 8 హెచ్‌పీ పవర్‌తో పాటు 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడటం వల్ల నగర రోడ్లపై కూడా సాఫీగా నడుస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వాడకం, చిన్న వ్యాపార అవసరాలకు ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది. దీన్ని ఉపయోగిస్తున్న చాలా మంది కస్టమర్లు లీటరుకు 65 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తోందని చెబుతున్నారు.

అంతేకాదు, అధికారికంగా ARAI నిర్వహించిన పరీక్షల్లో ఇది లీటరుకు 73.68 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని వెల్లడించడం విశేషం. బైక్ బరువు సుమారు 115 కిలోల వరకు ఉండటం వల్ల మరీ తేలికగా అనిపించదు, అలాగే ఎక్కువ బరువుతో ఇబ్బంది పెట్టదు. 780 మిమీ సీట్ ఎత్తు ఇవ్వబడింది. దీంతో పొట్టిగా ఉండే రైడర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్‌పై కూర్చొని, రెండు కాళ్లను సులభంగా నేలపై ఉంచగలుగుతారు.


Click it and Unblock the Notifications