తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇస్తున్న యువత ఫేవరెట్ బైక్! చాలా మంది దీని వైపు మళ్లుతున్నారు!

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో బడ్జెట్ రేంజ్‌లో మంచి మైలేజ్, శక్తివంతమైన పనితీరు, అలాగే స్టైలిష్ లుక్ బైక్ కావాలని ప్రతి వినియోగదారు కోరుకుంటారు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది టీవీఎస్. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ బైక్, తన స్పోర్టీ డిజైన్, కంఫర్టబుల్ రైడింగ్ అనుభవం, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. నగర ప్రయాణాలకు సరిపోయేలా స్మూత్ పనితీరు, అలాగే ఆకర్షణీయమైన స్టైలింగ్ కలగలిపి ఈ బైక్‌ను ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్‌గా మార్చాయి. అందుకే ఇది యువ రైడర్స్‌కు మాత్రమే కాకుండా, రోజువారీ ఉపయోగానికి కూడా అనువైన బైక్‌గా గుర్తింపు పొందుతోంది.

ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా టీవీఎస్ రైడర్ 125 మార్కెట్‌లో ఎంత బలంగా దూసుకెళ్తోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 మార్చి నెలలో ఈ బైక్ మొత్తం 37,345 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం విశేషం. ఇదే సమయంలో గత ఏడాది మార్చి 2025లో ఈ సంఖ్య 30,988 యూనిట్లుగా ఉండటం గమనార్హం. ఈ రెండు గణాంకాలను పోల్చి చూస్తే, ఈసారి దాదాపు 6,357 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.

Tvs Raider 125 March 2026 Sales Report Deails Check Inside

ఇది కేవలం సంఖ్యల్లో పెరుగుదల మాత్రమే కాదు, మార్కెట్‌లో ఈ బైక్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. శాతాం పరంగా, సుమారు 20.51 శాతం వృద్ధి నమోదు కావడం ఈ బైక్ సక్సెస్‌ను మరింత స్పష్టంగా తెలియజేస్తోంది. దీని అగ్రెసివ్ ఫ్రంట్ లుక్ చూసిన వెంటనే ప్రీమియమ్ బైక్ అనిపిస్తుంది. అమ్మకాలలో కనిపిస్తున్న ఈ పెరుగుదల చూస్తుంటే, రాబోయే కాలంలో ఈ బైక్ మార్కెట్‌లో మరింత బలంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

భారత మార్కెట్లో మంచి డిమాండ్‌ను కొనసాగిస్తున్న TVS Raider 125 ప్రస్తుతం మొత్తం 7 వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.80,500 నుంచి రూ.95,600 వరకు మారుతూ ఉంటుంది. ఈ ధర రేంజ్‌లో స్టైలిష్ డిజైన్, మంచి పనితీరు కలయికను అందించడం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 124.8 సిసి ఎయిర్-కూల్డ్, BS6 3-వాల్వ్ ఇంజన్‌ను అమర్చారు.

Tvs Raider 125 March 2026 Sales Report Deails Check Inside

ఈ ఇంజన్ 11.2 bhp పవర్, 11.75 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ నగర ప్రయాణాలకు సరిపోయే శక్తిని అందిస్తుంది. స్మూత్‌గా గేర్ మార్పులు చేసుకునేలా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేయడం వల్ల డ్రైవింగ్ అనుభవం మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది. మైలేజ్ పరంగా కూడా TVS Raider 125 మంచి బ్యాలెన్స్‌ను అందిస్తుంది. సాధారణ వినియోగంలో ఈ బైక్ సగటున లీటరుకు 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

దీని సస్పెన్షన్ సెటప్ బలంగా ఉండటం వల్ల గుంతలు ఎక్కువగా ఉన్న రోడ్లపైనా మంచి స్థిరత్వంతో ప్రయాణించవచ్చు. నగర ట్రాఫిక్‌లోనైనా, కొంచెం రఫ్ రోడ్లపై అయినా ఈ బైక్ రైడర్‌కు నమ్మకాన్ని ఇస్తుంది. ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే, ఇందులోని అండర్-సీట్ స్టోరేజ్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గ్లోవ్స్, చిన్న పత్రాలు, లేదా రోజువారీ అవసరాల కోసం తీసుకెళ్లే చిన్న వస్తువులను సులభంగా ఉంచుకునేంత స్పేస్ ఇందులో ఉంది.

Tvs Raider 125 March 2026 Sales Report Deails Check Inside

టెక్నాలజీ పరంగా చూస్తే, ఈ బైక్ తన సెగ్మెంట్‌లో ముందంజలో ఉందని చెప్పాలి. బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ TFT డిస్‌ప్లే, అలాగే TVS SmartXConnect సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటి సహాయంతో రైడర్‌కు కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. అదనంగా వాయిస్ అసిస్టెంట్ ఫంక్షన్ కూడా ఉండటం వల్ల, హ్యాండ్స్-ఫ్రీగా కొన్ని ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, April 20, 2026, 7:30 [IST]
English summary
Tvs raider 125 march 2026 sales report deails check inside
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+