నెక్స్ట్ లెవెల్ లుక్‌తో మరింత అందంగా ముస్తాబై వచ్చిన రైడర్.. భారీ అప్‌డేట్ తెచ్చిన టీవీఎస్
భారతీయ రెండు చక్రాల వాహన మార్కెట్లో 125cc సెగ్మెంట్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. మంచి మైలేజ్, సరైన పనితీరు, అలాగే యువతను ఆకట్టుకునే డిజైన్ కలిపి ఈ విభాగాన్ని అత్యంత పోటీగా మార్చాయి. ఈ సెగ్మెంట్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న బైక్‌లలో టీవీఎస్ రైడర్ (TVS Raider 125) ఒకటి. స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరతో ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఇప్పుడీ క్రేజ్‌ను మరింత పెంచేలా కంపెనీ ఒక చిన్న కానీ ఆకర్షణీయమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. రైడర్ 125కు 'నైట్రో గ్రీన్' అనే కొత్త రంగును పరిచయం చేసింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ బైక్‌కు మరింత స్పోర్టీ, ఫ్రెష్ లుక్‌ను అందిస్తూ, ముఖ్యంగా యువతను ఆకర్షించేలా డిజైన్ చేయబడింది.
రోడ్డుపై కనిపించిన వెంటనే ప్రత్యేకంగా కనిపించే ఈ కలర్, ఇప్పటికే ఉన్న స్టైలింగ్‌కు మరో లెవెల్‌ను జోడించింది. అయితే ఈ కొత్త రంగు అన్ని వేరియంట్లలో అందుబాటులో లేదు. ప్రస్తుతం మార్కెట్లో రైడర్ 125 మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తున్నప్పటికీ, 'నైట్రో గ్రీన్' కలర్‌ను కేవలం టాప్-ఎండ్ వేరియంట్లైన SXC DD, TFT DDలో మాత్రమే అందిస్తున్నారు. దీంతో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.

ధర విషయానికి వస్తే, SXC DD వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.96,725గా ఉంది. అలాగే, టాప్-ఎండ్ TFT DD వేరియంట్ ధర రూ.98,550గా నిర్ణయించబడింది. ఈ ధర పరిధిలో స్టైలిష్ డిజైన్‌తో పాటు డిజిటల్ ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఆధునిక సదుపాయాలు అందించడం ఈ బైక్‌కు ఉన్న ప్రధాన బలం. చిన్న అప్‌డేట్ అయినప్పటికీ 'నైట్రో గ్రీన్' కలర్ ద్వారా ఇది మరింత యంగ్, డైనమిక్ ఇమేజ్‌ను సంపాదించుకుంది.
కొత్త అప్‌డేట్‌లలో ప్రధానంగా కనిపించేది 'నైట్రో గ్రీన్' కలర్. బైక్ ముందు భాగంలో హెడ్‌ల్యాంప్ కౌల్, ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, బెల్లీ పాన్ వంటి భాగాలపై అప్లై చేయడంతో బైక్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీనికి తోడు గ్రే గ్రాఫిక్స్ ఇవ్వడంతో లుక్ మరింత స్టైలిష్‌గా మారింది. ముందుభాగంలో గ్రీన్ అల్లాయ్ వీల్, వెనుక బ్లాక్ వీల్ కలయిక బైక్‌కు మంచి కాంట్రాస్ట్‌ను ఇస్తుంది.

ఈ బైక్‌లో నైట్రో గ్రీన్ మాత్రమే కాకుండా మెటాలిక్ బ్లూ, స్ట్రైకింగ్ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో అయితే పెద్ద మార్పుగా ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఇవ్వబడింది. ఇది ముందు ఉన్న LCD యూనిట్ స్థానంలోకి వచ్చి మరింత క్లియర్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇందులో నావిగేషన్, కాల్ అలర్ట్స్, రైడ్ డేటా, వాతావరణ సమాచారం, లైవ్ స్కోర్లు వంటి కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి.
ఇక SXC DD వేరియంట్‌లో మాత్రం LCD డిస్‌ప్లేనే కొనసాగించినప్పటికీ, దీనిలో కూడా 85కి పైగా కనెక్టెడ్ ఫీచర్లకు సపోర్ట్ ఉంది. మెకానికల్ పరంగా చూస్తే TVS Raider 125 లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ముందున్న అదే 124.8 సీసీ ఎయిర్- మరియు ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో కొనసాగుతుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించడం వల్ల సిటీ రైడింగ్‌కు సరిపోయే స్మూత్ పనితీరు లభిస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ మోటార్ గరిష్టంగా 11.38 PS పవర్, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా iGO అసిస్ట్ ఫీచర్ ఉండటం వల్ల అవసరమైనప్పుడు టార్క్‌ను 11.75 Nm వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది, దీంతో వేగంగా పికప్ అందుతుంది. కంపెనీ ప్రకారం, ఈ బైక్ 0 నుంచి 60 kmph వేగాన్ని కేవలం 5.8 సెకన్లలో అందుకోవడం కూడా దీని స్పోర్టీ నేచర్‌ను చూపిస్తుంది.


Click it and Unblock the Notifications