బైక్ అంటే ఇలా ఉండాలి భయ్యా.. రోడ్డు మీద వెళ్తుంటే అంతా మనల్నే చూడాలి.. ఒక్క నెలలోనే 8 వేల మంది కొనేశారు

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్లతో బైక్స్‌ను లాంచ్ చేస్తూ అమ్మకాల్లో దూసుకుపోతోంది. తాజాగా టీవీఎస్ రోనిన్ (TVS Ronin) మోడల్ ఫిబ్రవరి 2026లో ఏకంగా 8,000 యూనిట్లకు పైగా అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ ఇప్పుడు రొనిన్ వెర్షన్‌లోనే ఒక పవర్‌ఫుల్ కేఫ్ రేసర్ (Cafe Racer) ఎడిషన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన డిజైన్ పేటెంట్ ఫైలింగ్స్ కూడా పూర్తయ్యాయి.

టీవీఎస్ రోనిన్ భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 2025 ప్రారంభంలో నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఈ బైక్ ప్రయాణం, ఇప్పుడు 8,000 మార్కును దాటేసింది. గడిచిన 12 నెలల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు ప్రతి నెల అమ్మకాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా జనవరిలో 8,247 యూనిట్లు, ఫిబ్రవరిలో 8,175 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలే రోనిన్ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నాయి.

TVS Ronin Sales Surge Over 8 000 Units Sold in Feb 2026 New Cafe Racer Edition Coming Soon

రోనిన్‎కి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ ఈ లైనప్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కేఫ్ రేసర్ డిజైన్‌ను రూపొందించింది. ఇటీవల ఈ కొత్త వెర్షన్ డిజైన్ పేటెంట్‌ను కంపెనీ ఫైల్ చేసింది. సాధారణ రోనిన్ బైక్ స్క్రాంబ్లర్ లేదా క్రూయిజర్ శైలిలో ఉంటే, ఈ కొత్త కేఫ్ రేసర్ వెర్షన్ మరింత స్పోర్టీగా, అగ్రెసివ్ లుక్‌లో ఉండబోతోంది. రేసింగ్ ప్రియులను ఆకట్టుకునేలా దీని బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు.

కొత్త టీవీఎస్ రోనిన్ కేఫ్ రేసర్ డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో కొత్తగా క్వార్టర్ ఫెయిరింగ్ (Quarter Fairing)ను అమర్చారు, ఇది బైక్ ముందు భాగానికి ఒక క్లాసిక్ రేసింగ్ లుక్‌ను ఇస్తుంది. అలాగే లో-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, వెనుక వైపుకు జరిపిన ఫుట్‌పెగ్స్ దీని ప్రత్యేకత. దీనివల్ల రైడర్ మరింత వంగి బైక్‌ను నడపాల్సి ఉంటుంది, ఇది అచ్చమైన రేసింగ్ ఫీల్‌ను ఇస్తుంది. సింగిల్ సీట్ ఆప్షన్, స్టబీ ఎగ్జాస్ట్ (చిన్న సైలెన్సర్) వంటి ఎలిమెంట్స్ ఈ బైక్‌ను పాత కాలపు కేఫ్ రేసర్ల వలె మార్చేశాయి.

TVS Ronin Sales Surge Over 8 000 Units Sold in Feb 2026 New Cafe Racer Edition Coming Soon

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో సెంట్రల్‌గా అమర్చిన రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను మనం చూడవచ్చు. ఇది స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో వస్తుంది, అంటే మీరు బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేసుకుని నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటివి పొందవచ్చు. టైర్లు, గ్రాఫిక్స్ కూడా మరింత స్పోర్టీగా ఉండబోతున్నాయి. రోడ్డు మీద ఈ బైక్ వెళ్తుంటే ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించేలా దీని రోడ్ ప్రెజెన్స్ ఉండబోతోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఈడీ హెడ్ లాంప్స్, టెయిల్ లైట్స్ లో కూడా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉంది.

పెర్ఫార్మెన్స్ విషయంలో రొనిన్ కేఫ్ రేసర్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 225.9cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ నే ఇందులోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 20.4 PS పవర్, 19.93 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, రైడింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్‌లో చిన్న చిన్న మార్పులు చేయవచ్చు. అప్-సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ బైక్‌కు మంచి స్టెబిలిటీని ఇస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఫీచర్ తప్పనిసరిగా ఉంటుంది.

200cc నుంచి 250cc సెగ్మెంట్‌లో ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, బజాజ్ అవెంజర్ 220,హోండా సీబీ 350 వంటి బైక్‌లతో పోటీ పడనుంది. కేఫ్ రేసర్ వెర్షన్ రావడం వల్ల టీవీఎస్ కు ఈ సెగ్మెంట్‌లో ఒక యూనిక్ అడ్వాంటేజ్ లభిస్తుంది. ప్రస్తుతం కంపెనీ దీని లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు, కానీ పేటెంట్ ఫైల్ అయిన నేపథ్యంలో 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర ప్రామాణిక రోనిన్ కంటే రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, March 23, 2026, 8:59 [IST]
English summary
Tvs ronin sales surge over 8 000 units sold in feb 2026 new cafe racer edition coming soon
Read more on: #tvs motor #luxury bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+