ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కిమీ..ధర కూడా 75 వేల లోపే..పల్లెటూరి రోడ్లకు అసలైన మొనగాడు

ప్రతి రోజూ ఆఫీసుకో లేదా వ్యాపార పనుల మీద పల్లెటూరి రోడ్లపైన, సిటీ ట్రాఫిక్‌లోనూ ప్రయాణించాల్సి వస్తోందా? పెట్రోల్ ధరలు చూస్తే భయమేస్తుందా? అయితే మీ కోసమే టీవీఎస్ (TVS) సంస్థ అదిరిపోయే మైలేజీ ఇచ్చే స్టార్ సిటీ ప్లస్ (Star City Plus) బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.72,500 ధరతో ప్రారంభమయ్యే ఈ బైక్, మధ్యతరగతి ప్రజలకు ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ, సిట్టింగ్ కంఫర్ట్ కారణంగా ఈ బైక్ ఎన్నాళ్లుగానో మార్కెట్లో రారాజుగా వెలుగుతోంది. ముఖ్యంగా పల్లెటూరి రోడ్లపై కూడా ఇది చాలా స్మూత్‌గా వెళ్తుంది.

ధర, వేరియంట్లు
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ.72,500 ఉండగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.75,200 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువగా గ్రామాల్లో, తక్కువ వేగంతో ప్రయాణించే వారైతే డ్రమ్ వేరియంట్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అదే సిటీలో వేగంగా వెళ్తూ మంచి సేఫ్టీ కావాలనుకుంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోవడం ఉత్తమం.

TVS Star City Plus 83 Kmpl Mileage Disc Brakes Long Seat Best Commuter Bike Rs 72 500

ఇంజిన్ పవర్, పెర్ఫార్మెన్స్
ఈ బైక్‌లో 109.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7,350 rpm వద్ద 8.08 bhp పవర్‌ను, 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వల్ల గేర్లు మార్చడం చాలా తేలికగా ఉంటుంది. దీని బరువు కేవలం 115 కిలోలు మాత్రమే ఉండటంతో ట్రాఫిక్‌లో సులభంగా మలుపులు తిప్పవచ్చు. అలాగే దీని సీటు ఎత్తు 785mm కావడంతో తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా చాలా సౌకర్యవంతంగా నడపవచ్చు. ఇందులో ఉన్న iGO అసిస్ట్ ఫీచర్ వల్ల ఇంజిన్ పనితీరు మెరుగుపడి మైలేజీ పెరుగుతుంది.

మైలేజీలో కింగ్
స్టార్ సిటీ ప్లస్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని మైలేజీ. కంపెనీ లెక్కల ప్రకారం ఇది లీటరుకు 83 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అయితే సాధారణ రోడ్లపై నడిపినా కూడా 70 నుంచి 75 కిలోమీటర్ల మైలేజీ పక్కాగా వస్తుంది. ఇందులో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, అంటే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఇందులోని ETFi (Easy Torque First Ignition) టెక్నాలజీ వల్ల చలికాలంలో కూడా బైక్ వెంటనే స్టార్ట్ అవుతుంది.

TVS Star City Plus 83 Kmpl Mileage Disc Brakes Long Seat Best Commuter Bike Rs 72 500

ఫీచర్లు, సేఫ్టీ
తక్కువ ధరలో ఉన్నప్పటికీ ఫీచర్ల విషయంలో టీవీఎస్ రాజీ పడలేదు. ఇందులో స్టైలిష్ ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ (USB) ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ప్రయాణంలోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్యూబ్‌లెస్ టైర్లు, పటిష్టమైన సస్పెన్షన్, ఎస్బీటీ (SBT) బ్రేకింగ్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా బైక్ స్కిడ్ అవ్వకుండా సేఫ్ గా ఉంటుంది. అందుకే ఈ బైక్ సేల్స్ దుమ్ములేపుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 10, 2026, 11:04 [IST]
English summary
Tvs star city plus 83 kmpl mileage disc brakes long seat best commuter bike rs 72 500
Read more on: #tvs motor #tvs motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+