ఒక్కసారి కొంటే 10 ఏళ్లు తిరగొచ్చు! రిపేర్లు చాలా తక్కువ, రూ. 66 వేల నుంచి స్టార్ట్.. 90 కి.మీ మైలేజ్!

రేపు (మార్చి 19న) జరగబోయే ఉగాది (Ugadi) పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, కొత్త ప్రారంభాల సూచికగా భావిస్తారు. ఈ ప్రత్యేక రోజున కొత్త వాహనం కొనడం శుభప్రదంగా భావించే వారు కూడా చాలా మంది ఉంటారు. మీరు కూడా ఈ ఉగాది సందర్భంగా కొత్త మోటార్‌సైకిల్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్‌లో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కలిగిన కొన్ని మోడళ్లు మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. రోజువారీ వినియోగానికి సరిపోయే కమ్యూటర్ బైక్‌లలో బజాజ్ ప్లాటినా 100, హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియన్, హోండా షైన్ 100, హీరో గ్లామర్ బైకులు స్టైలిష్ లుక్‌తో పాటు మెరుగైన పనితీరు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. మీరు కొత్త బైక్ కొనాలని భావిస్తే, ఈ మోడళ్లు తగిన విధంగా మంచి ఎంపికలుగా నిలుస్తాయి. వీటి గురించి ఈ కథణంలో.

Hero Splendor Plus: హీరో స్ప్లెండర్ ప్లస్ గురించి చెప్పుకుంటే, ఇది భారత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఎక్స్-షోరూమ్ ధర రూ. 74,152 నుండి రూ. 76,437 మధ్య ఉంటుంది. ఈ బైక్‌లో 97.2 సిసి పెట్రోల్ ఇంజన్ అందించారు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా, లీటర్‌కు సుమారు 70 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వడం దీని ప్రధాన బలం.

Ugadi 2026 Top 5 Best Mileage Bikes India Splendor Platina Shine Radeon Glamour

Bajaj Platina 100: బజాజ్ ప్లాటినా 100 తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే బైక్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 66,015 మాత్రమే. ఇందులో 102 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, లీటర్‌కు 75 నుండి 90 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం ఉండటం దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

Honda Shine 100: హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,243గా ఉండటంతో బడ్జెట్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. ఇందులో 98.98 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, నగర ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది. లీటర్‌కు సుమారు 65 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగలదు. ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో ఇది సింపుల్ డిజైన్‌ను అందిస్తుంది. బ్రేకింగ్ కోసం డ్రమ్ బ్రేకులు ఇవ్వబడ్డాయి.

Ugadi 2026 Top 5 Best Mileage Bikes India Splendor Platina Shine Radeon Glamour

TVS Radeon: టీవీఎస్ రేడియన్ ధర రూ. 68,100 నుండి రూ. 80,300 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో 109.7 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్, సిటీ, గ్రామీణ రోడ్లకు అనుకూలంగా ఉంటుంది. లీటర్‌కు 60 నుండి 70 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగలదు. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, ఎలక్ట్రిక్ సెల్ఫ్-స్టార్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

Hero Glamour: హీరో గ్లామర్ మార్కెట్లో నమ్మకమైన బైక్‌గా మంచి గుర్తింపు పొందింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,813 నుండి రూ. 86,501 మధ్య ఉంటుంది. ఇందులో 124.7 సిసి పెట్రోల్ ఇంజన్ అందించారు, ఇది మిగతా 100 సిసి బైక్‌లతో పోలిస్తే మరింత పవర్‌ఫుల్ అనుభవాన్ని ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల హైవే రైడింగ్ సౌకర్యంగా ఉంటుంది. లీటర్‌కు 55 నుండి 65 కి.మీ వరకు మైలేజ్ ఇవ్వగలదు.

Ugadi 2026 Top 5 Best Mileage Bikes India Splendor Platina Shine Radeon Glamour

More from DriveSpark

Article Published On: Wednesday, March 18, 2026, 16:43 [IST]
English summary
Ugadi 2026 top 5 best mileage bikes india splendor platina shine radeon glamour
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+