బైకుపై లక్ష తగ్గింపు.. రూ.1.49 లక్షలకే అడ్వెంచర్ సొంతం.. నెలకు రూ.2499 చెల్లిస్తే చాలు!
ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) మరో కీలక నిర్ణయంతో వినియోగదారులకు సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల తన X-47 అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసి మంచి స్పందన పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు వినియోగదారులకు మరింత సులభంగా బైక్ కొనుగోలు చేసేలా బ్యాటరీ ఫ్లెక్స్ (Battery-as-a-Service - BaaS) అనే కొత్త పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ప్రారంభ ఖర్చు గణనీయంగా తగ్గి, మరింత సరసమైన ధరలో అధునాతన ఎలక్ట్రిక్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది.
ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి అల్ట్రావయోలెట్ ప్రముఖ NBFC సంస్థ Ecofyతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు ప్రత్యేక ఫైనాన్సింగ్ పరిష్కారాలు అందించబడతాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం బ్యాటరీ ఖర్చు. అయితే ఈ Battery Flex (BaaS) మోడల్ ద్వారా ఆ భారాన్ని తగ్గిస్తూ, వినియోగదారులు బైక్‌ను తక్కువ ప్రారంభ ధరతో కొనుగోలు చేయగలుగుతారు.

ఈ పథకం కింద వినియోగదారులు మొదట బైక్ చాసిస్, ఇతర భాగాల కోసం మాత్రమే నేరుగా చెల్లింపు చేస్తారు. బ్యాటరీ ఖర్చును మాత్రం వేరు చేసి, దాన్ని నెలవారీ అద్దె రూపంలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా, నెలవారీ చెల్లింపులతో సులభంగా బైక్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో కొత్తగా ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు తక్కవ ధరలో కొనచ్చు.
ఈ పథకం అమల్లోకి వచ్చిన తరువాత, అల్ట్రావయోలెట్ X-47 అడ్వెంచర్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర కేవలం రూ. 1,49,000 నుంచే అందుబాటులోకి వస్తోంది. అయితే వినియోగదారులు బ్యాటరీ వినియోగానికి నెలకు రూ. 2,499 నుండి ప్రారంభమయ్యే అద్దెను చెల్లించాలి. ఈ విధానం వల్ల ప్రారంభ పెట్టుబడి గణనీయంగా తగ్గిపోతుంది, అధునాతన ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయడం సాధారణ వినియోగదారులకు కూడా సులభమవుతుంది.

సాధారణంగా సుమారు రూ. 2.5 లక్షల ధరలో లభించే ఈ అధునాతన ఎలక్ట్రిక్ బైక్, ఇప్పుడు కొత్త Battery Flex (BaaS) పథకం కారణంగా చాలా తక్కువ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ. 1.5 లక్షల ప్రారంభ ధరతోనే కొనుగోలు చేయగలుగుతున్నారు. అధునాతన టెక్నాలజీ, ఆకర్షణీయమైన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరును అందించే బైక్‌ను ఇంత తక్కువ ధరకు పొందడం వాహన ప్రియులకు మంచి అవకాశంగా మారింది.
ఈ పథకం కింద వినియోగదారులు బ్యాటరీ ఖర్చును మాత్రం నెలవారీ అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం నెలకు రూ. 2,499 నుండి ప్రారంభమయ్యే చెల్లింపు చేయాలి. ఈ ఖర్చు కూడా సాధారణంగా ఒక పెట్రోల్ బైక్‌పై ఇంధనం కోసం నెలలో ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ బైక్ కావడంతో నిర్వహణ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి.
పనితీరు విషయానికి వస్తే, X47 ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్ శక్తివంతమైన 10.3kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఒకసారి చార్జ్‌తోనే గరిష్టంగా 323 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇది గరిష్టంగా 40.2 hp శక్తిను, 610 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీంతో వేగవంతమైన యాక్సిలరేషన్‌తో పాటు శక్తివంతమైన రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








