ఒక్కసారి ఈ బైక్ ఎక్కారంటే..గుర్రం కూడా మీ స్పీడు అందుకోలేదు..యూత్ కోసం టాప్ 7 అడ్వెంచర్ బైక్స్ ఇవే

నేటి తరం యువతకు బైక్ అంటే కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ముఖ్యంగా వీకెండ్ రాగానే సిటీ దాటి అడవుల్లోకో, కొండల మధ్యకో ప్రయాణించాలనుకునే అడ్వెంచర్ ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే భారత మార్కెట్లో అడ్వెంచర్ బైక్స్(Adventure Bikes)కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. గతుకుల రోడ్లు, బురద దారులు, ఇసుక తిన్నెలు.. ఇలాంటి వాటన్నింటినీ సునాయాసంగా దాటగలిగే సత్తా ఉన్న టాప్ 7 అడ్వెంచర్ బైకుల వివరాలను తెలుసుకుందాం.

1. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450)
అడ్వెంచర్ బైకుల ప్రపంచంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఒక లెజెండ్. కొత్తగా వచ్చిన హిమాలయన్ 450 వెర్షన్ మరింత పవర్‌ఫుల్ గా మారింది. దీని ధర సుమారు రూ.3.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 452cc లిక్విడ్ కూల్డ్ షెర్పా ఇంజన్ ఉంది, ఇది 39.48 hp పవర్, 40 Nm టార్క్‌ను అందిస్తుంది. 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఎంత పెద్ద రాళ్లనైనా ఈ బైక్ సులభంగా దాటేస్తుంది. 17 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ వల్ల లాంగ్ రైడ్స్ లో పెట్రోల్ టెన్షన్ ఉండదు.

Unleash the Explorer Within Top 7 Adventure Motorcycles for Indian Youth in 2026

2. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ (Triumph Scrambler 400 X)
స్టైల్,పెర్ఫార్మెన్స్ రెండూ కావాలనుకునే వారికి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ఒక అద్భుతమైన ఎంపిక. దీని ధర రూ.2.70 లక్షలు. ఇందులో 398.15cc ఇంజన్ ఉంది, ఇది 39.5 hp పవర్ ఇస్తుంది. దీని డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది కేవలం ఆఫ్-రోడింగ్ మాత్రమే కాదు, సిటీ రోడ్లపై కూడా చాలా హుందాగా కనిపిస్తుంది. మల్టీ-టెరైన్ రైడింగ్ కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

3. హీరో ఎక్స్ పల్స్ 200 4V (Hero XPulse 200 4V)
బడ్జెట్ తక్కువగా ఉన్నా అడ్వెంచర్ చేయాలనుకునే యువతకు హీరో ఎక్స్ పల్స్ ఒక వరం. దీని ప్రారంభ ధర కేవలం రూ.1.41 లక్షలు. 199.6cc ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ బరువు చాలా తక్కువ, అందుకే దీనిని హ్యాండిల్ చేయడం చాలా సులభం. దీని ప్రో-వేరియంట్ లో 270 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది, ఇది ప్రొఫెషనల్ ఆఫ్-రోడర్లకు కూడా నచ్చుతుంది. తక్కువ మెయింటెనెన్స్ ఉండటం దీని ప్లస్ పాయింట్.

Unleash the Explorer Within Top 7 Adventure Motorcycles for Indian Youth in 2026

4. సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ ఎక్స్ (Suzuki V-Strom SX)
కంఫర్ట్ మరియు జపాన్ టెక్నాలజీ నమ్మకం కావాలనుకునే వారు సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ ఎక్స్ వైపు మొగ్గు చూపవచ్చు. దీని ధర రూ.1.98 లక్షలు. ఇందులో 249cc ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది రోజువారీ ఆఫీసు ప్రయాణాలకు, వీకెండ్ ట్రిప్పులకు రెండింటికీ సరిగ్గా సరిపోతుంది. దీని సీటింగ్ పొజిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, దీనివల్ల వందల కిలోమీటర్లు ప్రయాణించినా రైడర్ కు అలసట అనిపించదు.

5. కేటీఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure S)
స్పీడ్ , టెక్నాలజీకి మారుపేరు కేటీఎమ్. 390 అడ్వెంచర్ ఎస్ ధర రూ.3.97 లక్షలు. ఇది ఈ లిస్ట్ లోనే అత్యంత పవర్‌ఫుల్ బైక్. దీని 398.63cc ఇంజన్ ఏకంగా 45.37 hp పవర్ ఇస్తుంది. ఇందులో కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. రేసింగ్ డీఎన్ఏ ఉన్న అడ్వెంచర్ బైక్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Unleash the Explorer Within Top 7 Adventure Motorcycles for Indian Youth in 2026

6. యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)
క్లాసిక్ లుక్ తో పాటు మోడర్న్ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం యెజ్డీ అడ్వెంచర్ సిద్ధంగా ఉంది. దీని ధర రూ.1.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. దీని 15.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 815 mm సీట్ హైట్ విభిన్న ఎత్తు ఉన్న రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. లాంగ్ టూరింగ్ కోసం లగేజీ మౌంట్స్ వంటి అదనపు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

7. టీవీఎస్ అపాచీ ఆర్ టీ ఎక్స్ 300 (TVS Apache RTX 300)
అడ్వెంచర్ సెగ్మెంట్లో టీవీఎస్ నుంచి వచ్చిన సరికొత్త ఆయుధం అపాచీ ఆర్ టీ ఎక్స్ 300. దీని ధర రూ.1.99 లక్షలు. ఇందులో 299.1cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అమర్చారు, ఇది 35.51 hp పవర్ ఇస్తుంది. టీవీఎస్ రేసింగ్ అనుభవంతో రూపొందించిన ఈ బైక్ అద్భుతమైన బ్యాలెన్స్, ఫీచర్లను కలిగి ఉంది. కొత్తగా అడ్వెంచర్ బైక్ కొనాలనుకునే వారికి ఇది ఒక రిఫ్రెషింగ్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Friday, March 20, 2026, 7:30 [IST]
English summary
Unleash the explorer within top 7 adventure motorcycles for indian youth in 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+