హోండా యాక్టివా కంటే పెద్దదైన కొత్త మ్యాక్సీ స్కూటర్.. భారీ లుక్‌తో ఎంట్రీ ఇవ్వనుంది!
భారతదేశంలో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హోండా (Honda) ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలపరచేందుకు కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మ్యాక్సీ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ హోండా ఏడీవీ160 (Honda ADV160) అనే కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో యువతతో పాటు దూర ప్రయాణాలను ఇష్టపడే రైడర్లలో మ్యాక్సీ-స్కూటర్లకు ఆదరణ గణనీయంగా పెరిగింది. సంప్రదాయ స్కూటర్లతో పోలిస్తే మరింత శక్తివంతమైన ఇంజన్, మెరుగైన రైడింగ్ కమ్ఫర్ట్, అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ వంటి అంశాలు ఈ వాహనాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అయితే భారతదేశంలో 200cc లోపు మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ప్రస్తుతం ఎంపికలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఈ సెగ్మెంట్‌లో ప్రధానంగా యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొత్త మోడళ్ల కోసం చాలా మంది కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హోండా ADV160 మార్కెట్లోకి రావడం ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌కు కొత్త ఊపునివ్వనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన ADV160, అడ్వెంచర్-స్టైల్ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఎత్తైన విండ్‌స్క్రీన్, మస్క్యులర్ బాడీ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్, పొడవైన సస్పెన్షన్ సెటప్ వంటి అంశాలు దీన్ని సాధారణ స్కూటర్లకు భిన్నంగా నిలబెడతాయి. నగర ప్రయాణాలతో పాటు లాంగ్ రైడ్స్‌కు కూడా ఇది అనువుగా ఉండేలా రూపొందించబడింది. పనితీరు విషయానికి వస్తే, Honda ADV160లో లిక్విడ్-కూల్డ్, 157cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది. ఇదే ఇంజన్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ADV160 మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

ఈ ఇంజన్ 8,500 rpm వద్ద 16 hp శక్తిని, 6,500 rpm వద్ద 14.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో నగర రహదారులపై చురుకైన పనితీరు అందించడంతో పాటు, హైవే ప్రయాణాల్లో కూడా సౌకర్యాన్ని అందిస్తుంది. హోండా ADV160 భారత మార్కెట్లోకి వస్తే, ప్రస్తుతం ఈ విభాగంలో ఆధిపత్యం చాటుతున్న యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
డిజైన్, పరిమాణాల పరంగా హోండా ADV160 ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ మ్యాక్సీ-స్కూటర్ 1,950 మిమీ పొడవు, 763 మిమీ వెడల్పు, 1,196 మిమీ ఎత్తుతో వస్తుంది. అలాగే 1,324 మిమీ వీల్‌బేస్ కలిగి ఉండటం వల్ల అధిక వేగాల్లో కూడా మెరుగైన స్థిరత్వాన్ని అందించే అవకాశం ఉంది. రైడర్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీటు ఎత్తును 780 మిమీగా ఉంచారు. దీంతో చాలా మంది రైడర్లు సులభంగా స్కూటర్‌ను నియంత్రించగలుగుతారు.

మరోవైపు, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం భారతీయ రహదారులపై గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వంటి పరిస్థితులను సులభంగా ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. 8.1 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ADV160లో అనేక ఆధునిక సౌకర్యాలను అందించింది. ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, పూర్తి LED లైటింగ్ సెటప్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అయితే ADV160లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్. అమెరికా మార్కెట్లో విక్రయిస్తున్న ADV160 మోడల్‌లో రెండు వేర్వేరు పొజిషన్‌లకు సర్దుబాటు చేసుకునే విండ్‌స్క్రీన్‌ను అందిస్తున్నారు. రైడర్ అవసరాన్ని బట్టి దీని ఎత్తును మార్చుకోవచ్చు. ఒకవేళ ఇదే ఫీచర్ భారతీయ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి వస్తే, 200cc లోపు మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్‌తో వచ్చే తొలి మోడల్‌గా హోండా ADV160 చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications