లెజెండ్ మళ్లీ వచ్చేసింది.. పేరు చెబితే చాలు.. యువత కలల బైక్‌కు కొత్త అప్‌డేట్
భారత టూవీలర్ మార్కెట్‌లో ఎన్నో కొత్త మోడళ్లు వచ్చినా, కొన్ని బైక్‌లకు మాత్రం ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంటుంది. అలాంటి మోటార్‌సైకిళ్లలో బజాజ్ పల్సర్ 220 ఎఫ్ (Bajaj Pulsar 220F) ఒకటి. దాదాపు రెండు దశాబ్దాలుగా యువత హృదయాలను గెలుచుకుంటూ వస్తున్న ఈ బైక్, తన స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ప్రత్యేక గుర్తింపుతో ఇప్పటికీ మార్కెట్లో మంచి ఆదరణను కొనసాగిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో కొత్త గ్రాఫిక్స్, ఆకర్షణీయమైన రంగులతో ఈ బైక్‌ను అప్‌డేట్ చేసిన బజాజ్, ఇప్పుడు 2026 మోడల్‌ను మరిన్ని మెరుగుదలలతో పరిచయం చేసింది. కొత్త 2026 పల్సర్ 220F ఎక్స్-షోరూమ్ ధర రూ.1.36 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
అయితే ఈసారి కంపెనీ బైక్ ఐకానిక్ డిజైన్‌ను పెద్దగా మార్చకుండా, రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే అంశాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా భద్రత, రాత్రిపూట ప్రయాణ సౌకర్యాన్ని పెంచే అప్‌డేట్‌లు ఈ మోడల్‌లో కనిపిస్తున్నాయి. ఈ కొత్త వెర్షన్‌లో అత్యంత ఆకర్షణీయమైన మార్పు LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్. గత మోడల్‌లో లో బీమ్ కోసం ప్రొజెక్టర్, హై బీమ్ కోసం ప్రత్యేక మల్టీ-రిఫ్లెక్టర్ యూనిట్ ఉండేది.

కానీ 2026 మోడల్‌లో బజాజ్ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి, లో, హై బీమ్ రెండింటినీ ఒకే సింగిల్ LED ప్రొజెక్టర్ యూనిట్‌లో అందించింది. దీంతో కాంతి మరింత స్పష్టంగా, విస్తృతంగా పడటంతో రాత్రి సమయంలో హైవే ప్రయాణాలు మరింత సురక్షితంగా మారనున్నాయి. అదే సమయంలో కొత్త LED పొజిషన్ లైట్లు ఇచ్చారు. పగలు, రాత్రి ఏ సమయంలో చూసినా బైక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా లైటింగ్ సెటప్ రూపొందించబడింది.
ఈ అప్‌డేట్‌లో బైక్ డిజైన్, మెకానికల్ సెటప్‌లో ఎలాంటి కీలక మార్పులు చేయలేదు. అయితే ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న పనితీరు, విశ్వసనీయతను అలాగే కొనసాగించింది. ఈ బైక్‌కు శక్తినిచ్చే 220 సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ DTS-i ఇంజన్ ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది 8,500 rpm వద్ద 20.1 bhp గరిష్ట శక్తిని, 7,000 rpm వద్ద 18.55 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజన్‌కు జత చేసిన 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ గేర్ మార్పిడులను మరింత సాఫీగా చేస్తుంది. దీంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లోనూ, అధిక వేగంతో ప్రయాణించే హైవేల్లోనూ రైడర్‌కు మంచి నియంత్రణ లభిస్తుంది. రైడింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు నైట్రాక్స్ షాక్ అబ్జార్బర్లను కంపెనీ అందించింది. ఈ సస్పెన్షన్ సెటప్ కారణంగా గుంతలు, స్పీడ్ బ్రేకర్లు లేదా ఎగుడుదిగుడు రోడ్లపై సాఫీగా వెళ్తుంది.
దూర ప్రయాణాల్లో కూడా అలసటను తగ్గించడంలో ఈ సస్పెన్షన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. భద్రత పరంగా కూడా ఈ బైక్ మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముందువైపు, వెనుకవైపు డిస్క్ బ్రేకులను అందించడం వల్ల బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా అధిక వేగంతో ప్రయాణించే సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో బైక్‌ను వేగంగా, సురక్షితంగా ఆపేందుకు ఈ బ్రేకింగ్ వ్యవస్థ సహాయపడుతుంది.
ఫీచర్ల పరంగా బైక్‌లో కొత్త డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించింది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడంతో పాటు రైడర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునేందుకు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కొత్త డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్, SMS నోటిఫికేషన్లు వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని నేరుగా రైడర్‌కు చూపిస్తుంది.


Click it and Unblock the Notifications