ఈ స్కూటర్ కొనగలిగితే మీరు నిజంగా లక్కీ.. అందరూ కొనలేనిది.. కేవలం కొద్దిమందికే సొంతం చేసుకునే ఛాన్స్
దేశీయ ప్రీమియం స్కూటర్ మార్కెట్‌లో ఇటాలియన్ స్టైల్‌కు ప్రతీకగా నిలిచిన వెస్పా (Vespa) ప్రస్తుతం మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. ప్రత్యేకమైన డిజైన్, క్లాసిక్ లుక్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా వెస్పా స్కూటర్లకు నగరాల్లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తన 80వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వెస్పా, భారత మార్కెట్ కోసం ఒక ప్రత్యేక గిఫ్ట్‌లా కొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ వేడుకల్లో భాగంగా, వెస్పా టెక్ 80వ ఎడిషన్ (Vespa Tech 80th Edition) అనే స్పెషల్ ఎడిషన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇది సాధారణ మోడళ్లకు భిన్నంగా, డిజైన్, ఫీచర్ల పరంగా అనేక ప్రత్యేక మార్పులతో రూపొందించబడుతోంది.
క్లాసిక్ వెస్పా డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన ఆ గుండ్రని బాడీ స్టైల్, స్మూత్ కర్వ్స్‌ను అలాగే ఉంచుతూ, కొత్త తరం స్కూటర్లలో కనిపించే ఆధునిక టెక్నాలజీ అంశాలను ఇందులో చక్కగా మేళవించారు. అందుకే ఇది ఒకేసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, కొత్త తరం స్టైలింగ్‌ను కూడా అందిస్తుంది. ఇంజన్ పరంగా కూడా వినియోగదారులకు ఎంపికలు అందించనుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ 125cc, 150cc ఇంజన్ ఆప్షన్‌లతో రాబోతోంది.

అంటే, రోజువారీ నగర ప్రయాణాలకు సరిపోయే వేరియంట్ నుంచి, కొంచెం ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి మరో ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ మోడల్‌ను నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టేది దాని పరిమిత లభ్యత. వెస్పా భారతదేశంలో ఈ Vespa Tech 80th Edition స్కూటర్‌ను కేవలం 100 యూనిట్లలో మాత్రమే విడుదల చేయనుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారణంగా, ఈ స్కూటర్‌ను కొంటే మీరు అదృష్ట వంతులే.
Vespa Tech 80th Edition ప్రత్యేకత అక్కడితో ఆగిపోదు, దీని విక్రయ విధానం నుంచే ఈ మోడల్ ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను మోటోప్లెక్స్ అవుట్‌లెట్లు, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన షోరూమ్‌లలో మాత్రమే విక్రయించనున్నారు. అంటే, ఇది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే మోడల్ కాదు ఎంచుకున్న కొద్ది మందికే దక్కే ప్రత్యేక అనుభూతి.

డిజైన్ విషయానికి వస్తే, ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ "వెర్డే పాస్టెల్లో" అనే కొత్త రంగు ఎంపిక. ఈ లేత ఆకుపచ్చ రంగు 1940లలో వచ్చిన తొలి వెస్పా స్కూటర్లను గుర్తు చేస్తుంది. చారిత్రక డిజైన్‌లను ఆధునిక శైలితో మేళవించడం వెస్పా ప్రత్యేకత కాగా, ఈ రంగు అదే వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పట్లో వచ్చిన మొదటి మోనోకలర్ వెస్పా మోడళ్లలో ఒకదానికి ఇది ప్రేరణగా నిలిచిందని కంపెనీ చెబుతోంది.
ఇక బాడీ డీటైలింగ్‌లో కూడా చాలా నిశితంగా పని చేశారు. షీల్డ్ ట్రిమ్, మిర్రర్స్, ప్యాసింజర్ గ్రాబ్ హ్యాండిల్, స్విచ్ గేర్ చుట్టూ ఉన్న భాగాలు, అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ లింకేజ్ భాగాలపై బాడీ కలర్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల స్కూటర్ మొత్తం ఒకే థీమ్‌లో మెరుస్తుంది. గ్లాసీ బాడీ ప్యానెల్స్‌కు శాటిన్ ఫినిష్ యాక్సెంట్స్ జత చేయడం ద్వారా "క్లీనర్ ప్రీమియం లుక్" ఇవ్వడానికి వెస్పా ప్రయత్నించింది.

సీటు, హ్యాండిల్ గ్రిప్స్, ఫ్లోర్‌బోర్డ్ ఇన్సర్ట్‌లపై ముదురు ఆకుపచ్చ టచ్‌లు ఇవ్వడం ద్వారా మంచి కాంట్రాస్ట్‌ను సృష్టించారు. ముఖ్యంగా సీటుపై ఉన్న ప్రత్యేక కుట్టు పనితనం (స్టిచింగ్) ఈ స్కూటర్‌ను మరింత ప్రీమియంగా చూపిస్తుంది. ప్రతి చిన్న వివరంలోనూ క్లాసిక్ టచ్ కనిపించేలా డిజైన్ చేశారు. మరో హైలైట్ చక్రాల డిజైన్. ఇది 1946లో వచ్చిన తొలి Vespa 98 మోడల్ నుంచి ప్రేరణ పొందింది.
125cc మోడల్‌లోని ఇంజన్, 7,100 rpm వద్ద 9.3 bhp శక్తిని, 5,600 rpm వద్ద 10.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, 150cc ఇంజన్ 7,500 rpm వద్ద 11.4 bhp పవర్‌ను, 6,100 rpm వద్ద 11.66 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ రెండు ఇంజన్‌లకు CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేయబడింది. ధర ప్రకటించనప్పటికీ, ఇది ప్రత్యేకమైన స్కూటర్ కాబట్టి ఎక్కువ ఉండవచ్చు.


Click it and Unblock the Notifications