సింగిల్ ఛార్జ్ పై 150కిమీ రేంజ్..పేదవాడు సైతం సొంతం చేసేకునేలా ఈ స్కూటర్ పై రూ.30వేలు తగ్గింది
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇటాలియన్ బ్రాండ్ అయిన వెలోసిఫెరో(Velocifero - VLF) తన వినూత్నమైన డిజైన్లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టెన్నిస్ అనే మోడల్ తన గ్లామరస్ లుక్‌తో ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్రాండ్ తన కస్టమర్లకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ స్కూటర్ ధరపై ఏకంగా రూ.30,000ల భారీ తగ్గింపును ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ స్టైలిష్ స్కూటర్ లక్ష రూపాయల లోపే అంటే రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరకే అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా పండుగ సీజన్లలో మాత్రమే ఇలాంటి ఆఫర్లు చూస్తుంటాం. కానీ VLF తన మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి, ఎక్కువ మంది సామాన్య వినియోగదారులకు చేరువ కావడానికి ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసి స్థానికంగానే వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో తయారీ ఖర్చు తగ్గడం వల్లే ఈ స్థాయిలో ధరను తగ్గించగలిగారని నిపుణులు భావిస్తున్నారు.

VLF టెన్నిస్ స్కూటర్ కేవలం చూడటానికే కాదు, పనితీరులో కూడా మొనగాడే. ఇందులో 1500W హబ్ మోటార్ అమర్చారు. ఇది గరిష్టంగా 157 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంటే గతుకులు ఉన్న రోడ్లపై కూడా ఈ స్కూటర్ సునాయాసంగా దూసుకుపోతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. నగర ప్రయాణాలకు ఇది చాలా అనువైన వేగం.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 2.6 kWh కెపాసిటీ ఉన్న రిమూవబుల్ LMFP బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే, దీన్ని స్కూటర్ నుంచి తీసి ఇంట్లో లేదా ఆఫీసులో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 3 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది, ఇది వినియోగదారులకు చాలా పెద్ద ప్లస్ పాయింట్.

చూడటానికి కొంచెం భారీగా అనిపించినా.. ఈ స్కూటర్ బరువు కేవలం 88 కిలోగ్రాములు మాత్రమే. హై-టెన్సైల్ స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేయడం వల్ల దీనికి ఈ తేలికపాటి గుణం వచ్చింది. సాధారణ పెట్రోల్ స్కూటర్ల కంటే ఇది చాలా తక్కువ బరువు ఉండటం వల్ల ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడం చాలా సులభం. మహిళలు, కాలేజీ విద్యార్థులకు ఇది ఒక వరమనే చెప్పాలి.
రోడ్లు గుంతలమయంగా ఉన్నా ప్రయాణం సాఫీగా సాగడానికి ఇందులో అదిరిపోయే సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. ముందు వైపు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, వెనుక వైపు ప్రోగ్రెసివ్ కాంటిలివర్ సస్పెన్షన్ తో కూడిన హైడ్రాలిక్ మోనోషాక్. ఈ సస్పెన్షన్ సెటప్ వల్ల వెన్నునొప్పి సమస్యలు లేకుండా ప్రయాణించవచ్చు. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక రెండు వైపులా డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. అలాగే 12 అంగుళాల అలాయ్ వీల్స్ స్కూటర్‌కు మంచి గ్రిప్‌ని ఇస్తాయి.
మోడ్రన్ ఈవీల్లో ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.5-అంగుళాల TFT డిస్ప్లే దీనిలో ఇచ్చారు. దీనిలో వేగం, బ్యాటరీ శాతం, మోడ్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో ఎకో (Eco), కంఫర్ట్ (Comfort), స్పోర్ట్ (Sport) అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. హెడ్ ల్యాంప్ నుంచి టెయిల్ లైట్ వరకు అన్నీ ఎల్ఈడీ యూనిట్లే.
VLF బ్రాండ్ ప్రస్తుతం ఇండియాలో తన డీలర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 15 ప్రధాన నగరాల్లో డీలర్ షిప్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆ సంఖ్యను 50కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. KAW వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ ఇటాలియన్ బ్రాండ్ భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. అప్రిలియా తర్వాత ఇండియాలో వాహనాలను తయారు చేస్తున్న రెండో ఇటాలియన్ బ్రాండ్ ఇదే కావడం విశేషం.


Click it and Unblock the Notifications








