ఈ హైబ్రిడ్ స్కూటర్‌ను దేశంలో తెగ కొంటున్నారు.. షోరూమ్‌ల ముందు క్యూ.. పెట్రోల్ ఖర్చు చాలా తగ్గిస్తుంది!
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) భారత స్కూటర్ మార్కెట్లో ఇటీవలి కాలంలో తన ప్రభావాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా యువతతో పాటు ఫ్యామిలీ వినియోగదారులను ఆకట్టుకునేలా స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్ కలయికతో యమహా తన స్కూటర్లను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. దేశంలో హైబ్రిడ్ టెక్నాలజీతో స్కూటర్లను పరిచయం చేసిన తొలి బ్రాండ్లలో ఒకటిగా నిలిచిన యమహా, ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్రాండ్‌కు ప్రస్తుతం అత్యంత బలమైన ఆయుధాలుగా నిలుస్తున్నవి Yamaha Fascino 125 Fi Hybrid, Yamaha RayZR 125 Fi Hybrid మోడళ్లు.
వీటిలో ముఖ్యంగా ఫాసినో స్కూటర్ కుటుంబ వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. తేలికైన బాడీ, ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్, నగర ప్రయాణాలకు సరిపోయే కంఫర్ట్ వంటి అంశాలు ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా మహిళలు, కాలేజ్ విద్యార్థులు, రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు ఈ మోడల్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంత దీని డిమాండ్ బాగా పెరుగుతుంది.

2026 ఏప్రిల్ నెలలో ఫాసినో అమ్మకాల గణాంకాలు చూస్తే యమహా ఎంత వేగంగా ఎదుగుతోందో స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ఒకే నెలలో ఈ స్కూటర్‌కు చెందిన 10,430 యూనిట్లు అమ్ముడవడం మార్కెట్లో దాని పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనం. గత ఏడాది ఇదే నెలలో 5,678 యూనిట్లు మాత్రమే విక్రయమైన నేపథ్యంలో, ఇప్పుడు నమోదైన 83.69 శాతం వార్షిక వృద్ధి యమహాకు పెద్ద విజయంగా చెప్పాలి.
ఫాసినో అప్‌డేట్ మోడల్ విడుదల కూడా ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. కొత్త డిజైన్ అప్‌డేట్లు, మెరుగైన ఫీచర్లు, స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్, హైబ్రిడ్ అసిస్ట్ టెక్నాలజీ వంటి అంశాలు ఈ స్కూటర్‌ను మరింత ఆధునికంగా మార్చాయి. ఇక యమహా ఫాసినో విజయాన్ని చూస్తుంటే భారత స్కూటర్ మార్కెట్లో హైబ్రిడ్ టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ ప్రస్తుతం భారత మార్కెట్లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డ్రమ్, డిస్క్, స్పెషల్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందిస్తోంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.77,200, రూ.88,000, రూ.96,200గా ఉన్నాయి. ఫ్యామిలీ వినియోగదారులతో పాటు యువతను కూడా ఆకట్టుకునేలా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఈ హైబ్రిడ్ స్కూటర్‌లో 125cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను అందించారు.
CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేసిన ఈ ఇంజన్ 8.2 bhp పవర్‌తో పాటు 10.3 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ట్రాఫిక్ పరిస్థితుల్లో సాఫ్ట్,స్మూత్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్కూటర్ త్వరగా పిక్‌అప్ అందుకోవడంలో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టెక్నాలజీ చిన్న ఎలక్ట్రిక్ బూస్ట్‌ను అందించి ప్రారంభ వేగాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

మైలేజ్ విషయంలో కూడా ఫాసినో బెస్ట్. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల సమయంలో మైలేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఈ స్కూటర్ మంచి ఎంపికగా మారుతోంది. యమహా ప్రకారం, ఫాసినో 125 హైబ్రిడ్ ఒక లీటరు పెట్రోల్‌కు 68.75 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. అంటే స్టైలిష్ లుక్‌తో పాటు తక్కువ ఇంధన ఖర్చుతో రోజువారీ ప్రయాణాలకు ఇది సరైన ఫ్యామిలీ స్కూటర్‌గా నిలుస్తోంది.
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని ఇందులో అమర్చారు. వాహనం కొన్ని సెకన్ల పాటు ఆగి ఉంటే ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది, తిరిగి యాక్సిలేటర్ ఇస్తే వెంటనే స్టార్ట్ అవుతుంది. అలాగే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కారణంగా స్కూటర్ స్టార్ట్ చేసే సమయంలో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఈ స్కూటర్‌ను మరింత ప్రీమియం అనుభూతి కలిగించేలా మారుస్తున్నాయి.


Click it and Unblock the Notifications