నెలకు లక్షలు.. రోజుకు వేలల్లో సేల్స్.. ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లోయింగ్.. ఇదే అసలు దూకుడు!
యమహా(Yamaha) అనేది ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత, పనితీరు, స్టైలిష్ డిజైన్‌లకు పేరుగాంచిన ప్రముఖ ఆటోమొబైల్, టూ-వీలర్ తయారీ సంస్థ. జపాన్‌కు చెందిన ఈ కంపెనీ, ముఖ్యంగా బైక్‌ల రంగంలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. యమహా తయారు చేసే బైక్‌లు స్పోర్టీ లుక్, స్మూత్ ఇంజన్ పనితీరు, అలాగే ఆధునిక టెక్నాలజీకి ప్రసిద్ధి చెందాయి. ఇండియాలో ఈ కంపెనీ మంచి మార్కెట్ కలిగి ఉంది. యమహా కంపెనీ కేవలం కమ్యూటర్ బైక్‌లకే పరిమితం కాకుండా, స్పోర్ట్స్ బైక్‌లు, స్కూటర్లు, అలాగే ప్రీమియం సెగ్మెంట్ వాహనాల్లో కూడా తన స్థాయిని నిరూపించింది. నూతన టెక్నాలజీలను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఈ సంస్థ ముందంజలో ఉంది. యువతను ఆకర్షించే డిజైన్, మంచి మైలేజ్, అలాగే రేసింగ్ డీఎన్ఏ కలిగిన ఇంజన్లతో యమహా బైక్‌లు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
యమహా కంపెనీ తాజాగా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సేల్స్ గణాంకాలను విడుదల చేసింది. ఈ వివరాలను గమనిస్తే, సంస్థ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు గల కాలాన్ని కలుపుకుని చూసినప్పుడు, యమహా మొత్తం 10,39,756 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది మంచి ఆరోగ్యకరమైన వృద్ధి అని చెప్పవచ్చు.

గత ఆర్థిక సంవత్సరం (FY25)లో కంపెనీ 10,01,823 యూనిట్ల విక్రయాలను సాధించగా, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి 37,933 యూనిట్లు అదనంగా అమ్ముడయ్యాయి. అంటే, మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ యమహా తన స్థాయిని నిలబెట్టుకోవడమే కాకుండా, ముందుకు సాగుతున్నదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ వృద్ధిని శాతం పరంగా పరిశీలిస్తే, ఏడాది ప్రాతిపదికన దాదాపు 3.79 శాతం పెరుగుదల నమోదైంది.
ఇది భారీ ఎగబాకుడు కాకపోయినా, స్థిరమైన, ఆరోగ్యకరమైన గ్రోత్‌గా పరిగణించవచ్చు. ముఖ్యంగా టూ-వీలర్ మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం ఉన్నప్పటికీ, యమహా తన వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగుతోంది. యమహా భారత మార్కెట్‌లో విభిన్న కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతమైన మోడల్ లైనప్‌ను అందిస్తోంది. రోజువారీ వినియోగానికి అనువుగా, సింపుల్, స్టైలిష్ డిజైన్‌తో Yamaha Fascino 125 ను కంపెనీ అందించింది.

ఈ స్కూటర్ అమ్మకాలు ఇటీవలి కాలంలో మెరుగ్గానే ఉంటున్నాయి.అదే సమయంలో యువతకు స్పోర్టీ లుక్, అగ్రెసివ్ స్టైలింగ్ కావాలనుకునే వారికి Yamaha Ray ZR 125 ను రూపొందించింది. ఇది కూడా మంచి పనితీరుతో కొత్త కస్టమర్లను సంపాదించుకుంటూ మొత్తం యమహా టూవీలర్ సేల్స్ పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఈ రెండు స్కూటర్లు మైలేజ్, తేలికపాటి హ్యాండ్లింగ్, అలాగే ఆధునిక ఫీచర్లతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను సంపాదించాయి.
ఇక స్ట్రీట్ బైక్ సెగ్మెంట్‌లో Yamaha FZ సిరీస్ యమహాకు ప్రధాన బలం. మస్క్యులర్ డిజైన్, కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్, అలాగే మంచి ఇంధన సామర్థ్యంతో FZ బైక్‌లుసరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారికి Yamaha R15 ఒక ఐకానిక్ మోడల్‌గా నిలిచింది. రేసింగ్ డీఎన్ఏ, అగ్రెసివ్ డిజైన్, అధునాతన ఫీచర్లతో ఇది యంగ్ రైడర్స్‌ను బాగా ఆకర్షిస్తోంది.

అలాగే, నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ లుక్‌తో MT-15 కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. తక్కువ ధరలో కమ్యూటర్ టూవీలర్స్ కోసం చూస్తున్న వారికి సాధారణ మోడళ్లను అందిస్తూనే, అదే సమయంలో స్పోర్ట్స్ బైక్‌లను తీసుకువస్తూ యమహా మార్కెట్లో తన సత్తా చాటుతుంది. మొత్తానికి, స్కూటర్లు నుంచి స్పోర్ట్స్ బైక్‌ల వరకు విస్తరించిన యమహా లైనప్, ప్రతి వర్గానికి తగిన ఎంపికను అందిస్తూ భారత మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications








