లీటరు పెట్రోల్‌కు 100 కి.మీల మైలేజ్ ఇచ్చే యమహా బైక్! పెట్రోల్ ఖర్చు తగ్గించడానికి చాలా మంది కొంటున్నారు

భారతీయ యువతలో స్టైలిష్ లుక్, మస్క్యులర్ డిజైన్, స్మూత్ రైడింగ్ అనుభవంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బైక్‌లలో యమహా ఎఫ్‌జెడ్ (Yamaha FZ) ఒకటి. నగర రోడ్లపై యువత ఎక్కువగా ఎంచుకునే ఈ బైక్, ఇటీవలి కాలంలో మళ్లీ తన సేల్స్ గ్రాఫ్‌ను గట్టిగా పెంచుకుంటూ మార్కెట్లో తన స్థానం బలపరుస్తోంది. దానికి తాజా ఉదాహరణగా 2026 ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు నిలిచాయి. ఈ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా మొత్తం 16,852 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, యమహా FZ పై వినియోగదారుల నమ్మకం మళ్లీ పెరుగుతోందనే సంకేతం. ముఖ్యంగా గత ఏడాది ఇదే కాలాన్ని తీసుకుంటే, పరిస్థితి ఎంత మారిందో స్పష్టంగా తెలుస్తుంది.

2025 ఫిబ్రవరిలో కేవలం 9,589 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి దాదాపు 7,263 యూనిట్లు అదనంగా విక్రయించబడటం పెద్ద సక్సెస్. ఈ పెరుగుదల శాతం పరంగా చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 75.74 శాతం వృద్ధి నమోదు కావడం అంటే, ఒకే ఏడాదిలో ఈ బైక్‌కు డిమాండ్ ఎంత వేగంగా పెరిగిందో అర్థమవుతుంది. ఈ బైక్ రోజువారీ ప్రయాణాల్లో కంఫర్ట్ ఇవ్వడమే కాకుండా, స్టైల్ విషయంలో కూడా రాజీపడు.

Yamaha Fz Bike February 2026 Sales Performance 76 Percent Growth Full Details Here

ఈ రకమైన గ్రోత్ సాధించడం సాధారణ విషయం కాదు.. ఇది బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసం, అలాగే మార్కెట్లో సరైన ప్రొడక్ట్ పొజిషనింగ్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ విజయానికి ప్రధాన కారణాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్, యూత్‌ఫుల్ లుక్, సిటీ రైడింగ్‌కు అనువైన పనితీరు, అలాగే నమ్మకమైన ఇంజిన్ ఇవి అన్నీ కలిసి యమహా మోటార్ కంపెనీ తయారు చేసిన ఈ బైక్‌ను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

భారతీయ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్ లైనప్, ప్రస్తుతం మరింత విస్తృతంగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఒకే సిరీస్‌లో మొత్తం 8 మోడళ్లను అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకునేలా యమహా ప్లాన్ చేసింది. FZ Rave, FZ-FI, FZ-S FI, FZ-S FI Hybrid, FZ-X, FZ-X Hybrid, FZ-S FI Ver 4.0, FZ-S FI Ver 4.0 DLX అన్ని మోడళ్లు తమ తమ ప్రత్యేకతలతో మార్కెట్లో నిలుస్తున్నాయి.

Yamaha Fz Bike February 2026 Sales Performance 76 Percent Growth Full Details Here

ఈ సిరీస్‌లోని అన్ని బైక్‌లు 149cc ఇంజన్‌తో రావడం ప్రధాన హైలైట్. ఇది నగర ప్రయాణాలకు సరిపోయేంత పవర్‌ను అందించడమే కాకుండా, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో హైబ్రిడ్ టెక్నాలజీ ప్రవేశపెట్టడం ద్వారా యమహా మరింత ముందడుగు వేసింది. స్మార్ట్ మోటర్ జనరేటర్ (SMG), స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ట్రాఫిక్‌లో ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయి.

అందుకే FZ-S FI హైబ్రిడ్ వేరియంట్ విషయంలో చాలా మంది యూజర్లు లీటరుకు 100 కిలోమీటర్లకు పైగా మైలేజ్ వస్తుందని చెప్పడం గమనార్హం. డిజైన్ విషయంలో ఈ బైక్‌లు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ధరల పరంగా కూడా ఈ సిరీస్ విభిన్న కస్టమర్లను టార్గెట్ చేస్తోంది. ఎంట్రీ లెవెల్‌గా FZ-FI సుమారు రూ. 1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, FZ Rave రూ. 1.19 లక్షల వద్ద అందుబాటులో ఉంది.

Yamaha Fz Bike February 2026 Sales Performance 76 Percent Growth Full Details Here

FZ-S FI ధర రూ. 1.25 లక్షలు కాగా, హైబ్రిడ్ వేరియంట్ FZ-S FI Hybrid రూ. 1.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్టైలిష్ లుక్‌తో వచ్చే FZ-X రూ. 1.21 లక్షలు కాగా, FZ-X Hybrid ధర సుమారు రూ. 1.39 లక్షల వరకు ఉంటుంది. ఇక FZ-S FI Ver 4.0, దాని DLX వేరియంట్లు సుమారు రూ. 1.20 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద ప్రారంభమవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 26, 2026, 15:14 [IST]
English summary
Yamaha fz bike february 2026 sales performance 76 percent growth full details here
Read more on: #yamaha #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+