2 నిమిషాలకో బైక్..19 రోజుల్లోనే 16 వేల బైకులు..రాయల్ ఎన్ ఫీల్డ్, టీవీఎస్‌లకు పగలే కనిపిస్తున్న చుక్కలు
భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో యమహా మోటార్స్ కంపెనీ ఎల్లప్పుడూ కస్టమర్లకు ఓ ఎమోషన్ అని చెప్పొచ్చు. పాతతరం RX 100 నుంచి నేటి మోడ్రన్ R15 వరకు, ఈ సంస్థ అందించిన ప్రతి బైక్ భారతీయ యూత్‌ను విశేషంగా ఆకర్షించింది. అయితే, చాలా కాలంగా యువకులు ఎదురుచూస్తున్న పక్కా రెట్రో స్టైల్ బైక్ కోరికను తీరుస్తూ యమహా XSR 155 2025 నవంబర్ 11న భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ఈ బైక్ విడుదలైన అనతి కాలంలోనే సాధించిన విక్రయాలు యమహా బ్రాండ్‌పై ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించాయి. కేవలం 19 రోజుల్లోనే 16,359 యూనిట్ల రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేయడం ఈ మోడల్‌కు లభించిన అద్భుతమైన ఆదరణను తెలియజేస్తోంది. అంతే సుమారు రెండు నిమిషాలకో బైక్ అమ్ముడయింది. ఈ అద్భుతమైన విజయం కారణంగా, ఇది మార్కెట్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ వంటి బైకులకు గట్టి పోటీనిస్తూ హాట్ ఫేవరెట్‌గా మారింది.

యమహా XSR 155 మెయిన్ అట్రాక్షన్ దాని క్లాసిక్ రెట్రో డిజైన్, దీనికి మోడ్రన్ టెక్నాలజీని జోడించారు. ఈ బైక్ డిజైన్‌లో గుండ్రటి ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, కన్నీటి బొట్టు ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ సింగిల్ పీస్ సీటు వంటి అంశాలు దీనికి అచ్చం పాతకాలపు బైక్‌ను తలపించే వింటేజ్ లుక్‌ను అందిస్తాయి.
డిజైన్‌తో పాటు, ఇది మెటాలిక్ గ్రే, వివిడ్ రెడ్, గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్, మెటాలిక్ బ్లూ అనే నాలుగు అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అన్ని రంగులకు ధర ఒకేలా ఉండటం వినియోగదారులకు మరింత సానుకూల అంశం.

డిజైన్‌లో రెట్రో స్టైల్‌ను అనుసరించినా, ఇంజన్ విషయంలో యమహా ఏమాత్రం రాజీ పడలేదు. ఈ XSR 155 బైక్‌లో, పవర్ఫుల్ యమహా ఆర్15 (R15 V4)లో ఉపయోగించిన అదే 155సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 18.1 bhp పవర్, 14.2 Nm టార్క్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇందులో పొందుపరిచిన అత్యాధునిక వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) టెక్నాలజీ వల్ల రైడర్‌కు తక్కువ వేగంతో ప్రయాణించినా, హై స్పీడ్‌లో దూసుకుపోయినా ఇంజన్ నుంచి స్మూత్ పర్ఫామెన్స్ అందిస్తుంది. కేవలం 137 కిలోల బరువు ఉండటం వల్ల ఈ బైక్‌ను సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు. అంతేకాకుండా ఇది లీటరుకు సుమారు 50 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

తమ బైక్‌ను వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోవాలనుకునే ఔత్సాహిక రైడర్‌ల కోసం యమహా రెండు ప్రత్యేక యాక్సెసరీ కిట్‌లను అందుబాటులోకి తెచ్చింది. మొదటిది మరింత కఠినమైన, రోడ్డుకు అనువైన లుక్‌ను అందించే స్క్రాంబ్లర్ ప్యాకేజీ (ధర: kp.25,450), ఇందులో హెడ్‌లైట్ కవర్, నీ ప్యాడ్స్ వంటివి లభిస్తాయి.
రెండవది, స్పోర్టీ రేసింగ్ లుక్‌ను ఇష్టపడే వారి కోసం కేఫ్ రేసర్ ప్యాకేజీ (ధర: రూ.28,180), ఇందులో రేసింగ్ సీట్ హంప్ వంటివి ప్రధానంగా ఉంటాయి. భారతదేశంలో ఈ యమహా XSR 155 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,49,990 గా నిర్ణయించారు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, యమహా భరోసా, ఆకర్షణీయమైన లుక్ కలగలిసిన ఈ బైక్ రాబోయే 2026 సంవత్సరంలో కూడా మరిన్ని అమ్మకాల రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








