తక్కువ ధరకే శక్తివంతమైన బైక్ కోసం చూస్తున్నారా? రెండూ పర్ఫెక్ట్.. రూ.2 లక్షల లోపు ఏది బెస్ట్?
భారతదేశంలో ఇటీవలి కాలంలో సరసమైన పనితీరు మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. స్టైల్ కూడా ఉండాలి, పవర్ కూడా ఉండాలి, కానీ ధర మాత్రం అందుబాటులో ఉండాలనే అభిరుచి యువతలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌ను సరిగ్గా క్యాచ్ చేసిన మోడల్ అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350). గత రెండు సంవత్సరాలుగా ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన అత్యంత సరసమైన బైక్‌గా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అదే ధర శ్రేణిలోకి కొత్తగా అడుగుపెట్టింది Yamaha XSR 155. ఇది యమహా కంపెనీ నుంచి వచ్చిన తేలికైన, మోడర్న్ రెట్రో స్టైల్ బైక్. 350cc ఎన్‌ఫీల్డ్ రోడ్‌స్టర్‌కు ఇది ఒక తక్కువ బరువు, ఇంధన-సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా భావించబడుతోంది. ఈ రెండింటి నుంచి ఈ కథనంలో.
ధర చూస్తే Yamaha XSR 155 ఎక్స్-షోరూమ్ రూ.1.50 లక్షలకు లభిస్తుండగా, Royal Enfield Hunter 350 ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభమై రూ.1.67 లక్షల వరకు ఉంటుంది. అంటే బేస్ వేరియంట్ పరంగా హంటర్ కొద్దిగా చవకగా ఉన్నా, రెండు బైక్‌లు సమానమైన ధరలో పోటీ పడుతున్నాయి. నెలకు సుమారు 1,000-1,500 కి.మీ ప్రయాణించే రైడర్లకు యమహా మెరుగైన మైలేజ్ కారణంగా సంవత్సరానికి పెట్రోల్ ఆదా కలిగించగలదు.

అయితే తక్కువగా రైడ్ చేసే వారు, ముఖ్యంగా వారాంతాల్లో లాంగ్ రైడ్‌లను ఆస్వాదించే వారికి హంటర్ 350 మంచి ఎంపికగా ఉంటుంది. ఇంజిన్ పరంగా XSR 155లో 155cc లిక్విడ్-కూల్డ్ VVA ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 18.14 hp పవర్, 14.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తేలికైన బరువు, హై-రెవ్వింగ్ నేచర్ కారణంగా నగర రైడింగ్‌లో చురుకుదనం అందిస్తుంది.
ఇక హంటర్ 350లో 349cc ఎయిర్-ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిసి 20.2 hp పవర్, 27 Nm టార్క్‌ను అందిస్తుంది. తక్కువ ఆర్‌పిఎమ్‌ల వద్దే బలమైన టార్క్ ఇవ్వడం దీని ప్రత్యేకత. అందువల్ల సిటీ ట్రాఫిక్‌లో కూడా గేర్ మార్పులు తక్కువగా అవసరం అవుతాయి. టెక్నాలజీ పరంగా XSR 155లో వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్(VVA), అసిస్ట్-స్లిప్పర్ క్లచ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

హంటర్ 350 మాత్రం సింపుల్, ట్రాక్టబుల్ పవర్ డెలివరీపై దృష్టి పెడుతుంది. అదనంగా, Royal Enfield విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే స్పేర్ పార్ట్స్ కారణంగా హంటర్‌కు మెయింటెనెన్స్ పరంగా ఒక అదనపు ప్రయోజనం లభిస్తుంది. మైలేజ్ పరంగా చూస్తే Hunter 350 లీటరుకు సుమారు 36 కి.మీ ఇస్తే, Yamaha XSR 155 దాదాపు 45.5 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది.
లైట్ హ్యాండ్లింగ్, చురుకుదనం, ట్రాఫిక్‌లో సులభంగా మలుపులు తిరగగల సామర్థ్యం ఇవి XSR 155 బలాలు. తేలికైన ఛాసిస్, చిన్న ఇంజిన్ కలయిక నగర రోడ్లపై వేగంగా కదలడానికి అనువుగా ఉంటుంది. రోజువారీ ఆఫీస్ కమ్యూట్ లేదా గట్టిగా ఉన్న ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇది చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. మరోవైపు, హంటర్ 350 నగరం మాత్రమే కాకుండా హైవే ప్రయాణాలకు కూడా సరైన ఎంపిక.

భారీ లోడ్‌తో, వెనుక రైడర్‌తో స్థిరంగా ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. భారతీయ రోడ్ల పరిస్థితుల్లో బలమైన టార్క్, స్టేబుల్ రైడింగ్ ఫీల్ హంటర్‌కు ప్రత్యేకతగా నిలుస్తాయి. హైవే స్టెబిలిటీ, బలమైన రోడ్ ప్రెజెన్స్ కోరుకునే రైడర్లు హంటర్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. నగర ట్రాఫిక్‌లో మైలేజ్, లైట్ హ్యాండ్లింగ్ ముఖ్యమైతే XSR 155 బెస్ట్. నగరం+హైవే రెండింటికీ బలమైన, స్థిరమైన అనుభూతి కావాలంటే హంటర్ 350 బెస్ట్.


Click it and Unblock the Notifications








